E-Paper
Advertisement

Municipal Elections: ఘన్ పూర్ మున్సిపాలిటీలో జోరందుకున్న ప్రచారం.. చైర్మన్ పీఠంపై ఆ మూడు పార్టీల నజర్!

Municipal Elections: ఘన్ పూర్ మున్సిపాలిటీలో జోరందుకున్న ప్రచారం.. చైర్మన్ పీఠంపై ఆ మూడు పార్టీల నజర్!
Advertisement

Municipal Elections: స్టేషన్ ఘన్ పూర్, స్వేచ్ఛ: ము న్సిపల్ ఎన్నికల ప్రచారానికి మరో రెండు రోజుల గడువు మాత్రం ఉండడంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టిఆర్ఎస్, బీజేపీ, జనసేన పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థుల ప్రచారం జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మునిసిపాలిటీ పరిధిలోని 18 వార్డుల్లో జోరుగా సాగుతుంది.

3 గ్రామాలు 18 వార్డులు

స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోకి చాగల్, శివుని పల్లి, స్టేషన్ ఘన్ పూర్ మూడు గ్రామాలలోని 18 వేల పైచిలుకు జనాభాతో కలిపి 18 వార్డులుగా విభజించారు. ఈనెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో 18 వార్డులకు గాను 82 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి 18 అంది, టిఆర్ఎస్ నుండి 18 మంది, బిజెపి నుండి 12 మంది, బీఎస్పీ నుండి నలుగురు, జనసేన నుండి ఇద్దరు, సిపిఐ నుండి ముగ్గురు, డి.ఎస్.పి నుండి ఒక్కరు, స్వతంత్ర అభ్యర్థులు 24 మంది ఎన్నికల బరిలో నిలిచారు.

Advertisement

Also Read: WhatsApp MeeSeva: ఇకపై వాట్సాప్‌లోనే మీసేవ, సేవలు.. ఈజీగా ఈ సర్టిఫికెట్లు క్షణంలో ఇలా పొందొచ్చు, ప్రాసెస్ ఇదే!

చైర్మన్ పీఠం లక్ష్యం

అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని లక్ష్యంగా ముందుకు సాగుతుంది. అభ్యర్థుల ఎంపిక నుండి ఉపసంహరణలు, రెబల్స్ బుజ్జగింపుతో పాటు ప్రచారంలో దూసుకుపోతుంది. ఏడు మండలాల నుండి కేటాయించిన ఇన్చార్జులు, అభ్యర్థులు వ్యక్తిగతంగా వార్డులు మొత్తం చుట్టి వస్తున్నప్పటికీ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరిలు కార్నర్ మీటింగ్లతో విస్తృత ప్రచారం చేస్తున్నారు.18 కి 18 స్థానాలు గెలుచుకుని చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. వీరికి తోడు జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేటి నుండి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. దీనితో అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఛాలెంజ్ గా బీఆర్ఎస్

Advertisement

ప్రధాన ప్రతిపక్ష పార్టీ టిఆర్ఎస్ కూడా మున్సిపల్ ఎన్నికలను ఛాలెంజ్ గా తీసుకుంది. స్థానికుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టి.రాజయ్య తో పాటు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహ రచనలు చేస్తున్నారు. ఇప్పటివరకు అభ్యర్థులతోపాటు మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఇంటింటా ప్రచారం చేస్తుండగా నేటి నుండి పోచంపల్లి రంగంలోకి దిగానున్నారు.

బీజేపీ సైతం

12 వార్డులు అభ్యర్థులను బరిలోకి దింపిన బీజేపీ సైతం ఇంటింటా ప్రచారం చేస్తుంది. వీరితోపాటు స్వతంత్ర అభ్యర్థులు బి ఎస్ పి, జనసేన, డిఎస్పి కి చెందిన అభ్యర్థులు కూడా ప్రచార వాహనాలను ఏర్పాటు చేసి మున్సిపాలిటీ పరిధిలో విస్తృత ప్రచారం చేస్తున్నారు

మైకుల హోరు

మైకుల హోరు… ప్రచార జోరు అన్నట్టుగా స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వాడవాడల ఒకవైపు అభ్యర్థులు మరోవైపు మైకుల మోతతో హోరెత్తిస్తున్నారు. ఇది ఇలా ఉంటే అధికార ప్రధానం ప్రతిపక్ష పార్టీలకు రెబెల్స్ తో ప్రమాదం పొంచి ఉన్నట్టు పలువురు భావిస్తున్నారు.

Also Read: Mahabubabad Politics: వార్డు ఎన్నికల్లోనూ సర్పంచ్ ఎన్నికల దుస్థితేనా? పోటాపోటీగా ఖర్చులు.. ఓడితే బాధలు తప్పవా?

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×