E-Paper
Advertisement

GHMC: బల్దియా చిట్ట చివరి స్టాండింగ్ కమిటీ భేటీలో ఆమోదించిన అంశాలివే..?

GHMC: బల్దియా చిట్ట చివరి స్టాండింగ్ కమిటీ భేటీలో ఆమోదించిన అంశాలివే..?
Advertisement

GHGMC: స్వేఛ్చ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మహానగరాభివృద్ది, పౌర, అత్యవసర సేవల నిర్వహణకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే స్టాండింగ్ కమిటీ చివరి సమావేశం సోమవారం జీహెచ్ఎంసీ(GHMC) ప్రధాన కార్యాలయంలో ముగిసింది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన ప్రారంభమైన సమావేశంలో అజెండాలోని ప్రతిపాదనలకు, 11 అదనపు ప్రతిపాదనలకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. చివరి సమావేశం కావటంతో కమిషనర్ కర్ణన్(RV Karnana) మేయర్ గద్వాల్ విజయలక్ష్మి(Meya Gadwal Vijaya Laxmi)ని సన్మానించారు. కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, అధికారుల కృషితోనే గడిచిన అయిదేళ్లలో గ్రేటర్ హైదరాబాద్ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా, అనేక అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు.

పునర్వ్యిభజనకు ప్రత్యేక సెషన్‌..

జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. దేశంలోనే అతిపెద్ద నగరపాలక సంస్థ జీహెచ్ఎంసీకి మేయర్‌గా విధులు నిర్వర్తించటం తనకెంతో గర్వంగా ఉందన్నారు. తన పదవీకాలంలో కమిషనర్‌, అధికారులు అందించిన సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు, అధికారుల సమష్టి కృషితో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించామని స్పష్టం చేశారు. కమిషనర్ ఆర్.వి.కర్ణన్ మాట్లాడుతూ, క్లిష్టమైన కాలంలోనూ అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించామని తెలిపారు. జీహెచ్ఎంసీ వార్డుల పునర్వ్యిభజనకు సంబంధించి ప్రత్యేక సెషన్‌ను నిర్వహించి సభ్యుల అభ్యంతరాలను స్వీకరించామని తెలిపారు. కౌన్సిల్ లో కార్పొరేటర్లు లేవనెత్తిన ప్రజా సమస్యలను చాలా వరకు పరిష్కరించామని వెల్లడించారు. స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపిన అభివృద్ధి పనులన్నింటినీ అమలు చేస్తామన్నారు. అనంతరం ఇటీవలే అహ్మదాబాద్, రాజ్ కోట్ స్టడీ టూర్ రిపోర్ట్ ను మేయర్ విజయలక్ష్మి కమిషనర్ కు అందజేశారు. ఈ స్టడీ టూర్ లో తాము అహ్మదాబాద్, రాజ్ కోట్ పురపాలికల్లో గుర్తించిన ఉత్తమ విధానాలతో కూడిన సమగ్ర స్టడీ టూర్ నివేదికను రూపొందించినట్లు మేయర్ వెల్లడించారు.

Advertisement

Also Read: Municipal Elections: మున్సిపాలిటీలలో మూగబోయిన మైకులు.. అంతా సైలెన్స్ మోడ్..!

చివరి మీటింగ్ లో అజెండా వివరాలివి..

వార్డు నెం.134, అల్వాల్ సర్కిల్-27లోని లక్ష్మీనగర్‌లో శ్రీ లక్ష్మీ కళామందిర్ థియేటర్ ఎదుట బాక్స్ డ్రెయిన్ నిర్మాణ ప్రతిపాదనన ఆమోదించిన కమిటీ, టెండర్ల ప్రక్రియకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆస్తి పన్ను, ఖాళీ భూమి పన్ను విషయంలో జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లకు అప్పగించిన అధికారాల మేరకు కమిషనర్ తీసుకున్న చర్యలకు అమోదం తెలిపింది. కూకట్‌పల్లి జోన్, మూసాపేట సర్కిల్-23, వార్డు నెం.114, కేపీహెచ్ బీ కాలనీ 5వ దశలోని క్రికెట్ ప్రాక్టీస్ పిచ్‌ల నిర్వహణ, ఆపరేషన్ కోసం తాజా ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఈ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా టెండర్లు పిలవడానికి కమిటీ అనుమతినిచ్చింది. కేపీహెచ్ బీ కాలనీ 9వ దశలోని ఇండోర్ షటిల్ కోర్టు నిర్వహణ, ఆపరేషన్ కోసం తాజా ఈఓఐ ఆహ్వానించేందుక కమిటీ ఆమోదం తెలిపింది.

కమిటీ ఆమోదం

Advertisement

బాలానగర్ ఫ్లైఓవర్ కింద ఉన్న ఓపెన్ స్పేస్‌ను క్రీడా ప్రాంగణంగా ఉపయోగించేందుకు ఎన్ఆర్‌స్‌కి ఒక సంవత్సరం పాటు నిర్వహణ బాధ్యతలను పొడిగించటం, మూసాపేట సర్కిల్-23, కేపీహెచ్ బీ కాలనీలోని నెక్సస్ మాల్ ఫ్లైఓవర్ కింద ఉన్న క్రీడా ప్రాంగణం నిర్వహణ, ఆపరేషన్ కోసం తాజా ఈఓఐ ఆహ్వానించేందుకు కమిటీ ఆమోదం తెలిపినట్లు తెల్సింది. వార్డు నెం.110, చందానగర్ సర్కిల్-21, శేరిలింగంపల్లి పరిధిలోని పీ,టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో బాక్సింగ్ కోర్టు నిర్మాణానికి కమిటీ పరిపాలన అనుమతిచ్చింది. వార్డు నెం.116, యూసుఫ్ నగర్ (అల్లాపూర్), మూసాపేట సర్కిల్-23లోని వైకుంఠధామ హిందూ శ్మశాన వాటిక నిర్వహణ, ఆపరేషన్ కోసం ఈఓఐ ఆహ్వానించాలని కమిటీ తీర్మానించింది. అదనపు కమిషనర్ (అడ్మిన్)కు అప్పగించిన కొన్ని అధికారాలకు సంబంధించి కమిషనర్ బదలాయించాలన్న ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటితో పాటు మరో 13 అదనపు ప్రతిపాదనలను సైతం కమిటీ పరిశీలించి ఆమోదించింది.

Also Read: Gold Shop Robbery: గోల్డ్ షాపులో దోపిడీ దొంగల బీభత్సం.. అరడజను మంది సర్దేశారు, సీసీటీవీ సాక్షిగా

Related News

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆరోగ్యం మాటేంటి? షాకింగ్ విషయాలు, బిగ్ టీవీతో డాక్టర్ రవిశంకర్

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Big Stories

Advertisement
×