E-Paper
Advertisement

Municipal Elections: మున్సిపాలిటీలలో మూగబోయిన మైకులు.. అంతా సైలెన్స్ మోడ్..!

Municipal Elections: మున్సిపాలిటీలలో మూగబోయిన మైకులు.. అంతా సైలెన్స్ మోడ్..!
Advertisement

Municipal Elections: స్వేఛ్చ బ్యూరో: రాష్టంలోని 116 మున్సిపాల్టీలు, మరో ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు జరుగుతున్న పుర పాలక ఎన్నికల్లో భాగంగా హోరాహోరిగా కొనసాగిన వివిధ పార్టీల, అభ్యర్థుల ప్రచారానికి సోమవారం సాయంత్రం అయిదు గంటలకు తెర పడింది. గత నెల 28వ తేదీన ఎన్నికల షెడ్యూల్ జారీ చేసిన నాటి నుంచి టికెట్ల ప్రయత్నాలు, నామినేషన్ల పరిశీలన, విత్ డ్రా వంటి ప్రక్రియలు ముగిసిన తర్వాత రానున్న 48 గంటల పాటు సైలెన్స్ మోడ్ కొనసాగనుంది. ఈ నెల 11న పోలింగ్, ఆ తర్వాత 13న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటించేందుకు వీలుగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేస్తూనే మరో వైపు ఎన్నికల ప్రక్రియలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా, ఎలక్షన్ కోడ్ ను పకడ్బందీగా అమలు చేసి, ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. ఈ నెల 11న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు 116 మున్సిపాల్టీలు, మరో ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలో పోలింగ్ ప్రక్రియను నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లలో ఎలక్షన్ కమిషన్ నిమగ్నమైంది. పోలింగ్ రోజున ఇప్పటికే సర్కారు సెలవు ప్రకటించిన సంగతి తెల్సిందే. పోలింగ్ జరగనున్న మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల పరిధిలో ఇప్పటికే సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించిన ఎన్నికల కమిషన్ అక్కడ భారీ బందోబస్తును చేపట్టేందుకు వ్యూహాం సిద్దం చేసినట్లు సమాచారం. 11న పోలింగ్ ముగిసిన తర్వాత అవసరమైన చోట 12న రీపోలింగ్ నిర్వహించేందుకు కూడా కమిషన్ ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిసింది. 137 స్ట్రాంగ్ రూమ్ లలో 16 వేల 31బ్యాలెట్ బాక్స్ లను భధ్రపరిచి, 13న మున్సిపాల్టీలు, మున్సిపల్ కార్పొరేషన్లలోని 136 కౌంటింగ్ సెంటర్లలో ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల కౌంటింగ్ ప్రక్రియను చేపట్టి, ఎప్పటికపుడు ఫలితాలను వెల్లడించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

2996 వార్డులు..8 వేల 203 పోలింగ్ స్టేషన్లు

116 మున్సిపాల్టీలు, ఏడు కార్పొరేషన్ల పరిధిలో మొత్తం 2996 వార్డులున్నట్లు, వీటిలో ఇటీవలే ఖరారు చేసిన రిజర్వేషన్ల ప్రకారం బీసీ (జనరల్) 463, బీసీ (మహిళ) 391, ఎస్సీ( జనరల్) 254, ఎస్సీ (మహిళ) 190, ఎస్టీ జనరల్ (147), ఎస్టీ (మహిళ) 40, అన్ రిజర్వుడ్ (జనరల్) గా 647, అన్ రిజర్వుడ్ (మహిళ) 864గా కేటాయించి ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తున్నారు. మొత్తం వార్డుల్లో వీటిల్లో దాదాపు 8 వేల 203 పోలింగ్ స్టేషన్లలో మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించనున్నారు. వీరిలో మహిళా ఓటర్లు 26.80 లక్షల మంది కాగా, పురుష ఓటర్లు 25.62 లక్షల మంది ఉన్నట్లు ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది.

Advertisement

Also Read: Akira Nandan: అకీరా నందన్ కోసం ఆ దర్శకుడిని స్టోరీ అడిగిన పవన్ కళ్యాణ్..

పకడ్బందీగా కోడ్ అమలు

సోమవారం సాయంత్రం అయిదు గంటల నుంచి అమల్లోకి వచ్చిన 48 గంటల సైలెన్స్ మోడ్ తో పాటు మొత్తం ఎన్నికల ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరిగేందుకు వీలుగా ఎలక్షన్ కమిషన్ 742 మంది జోనల్ ఆఫీసర్లను నియమించింది. వీరిలో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ లో 279 మంది, స్టాటిటిక్ సర్వైలెన్స్ టీమ్ లో 381 మందిని నియమించి, ప్రత్యక బృందాలుగా రౌండ్ ది క్లాక్ నిఘాను ముమ్మరం చేసింది. దీంతో పాటు పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలు కూడా నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహించేందుకు వీలుగా మొత్తం 1379 మంది రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించగా, మరో 1547 మందిని అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లను, మరో 9560 మందిని ప్రెసైడింగ్ ఆఫీసర్లుగా, 31 వేల 428 మందిని అదర్ పోలింగ్ ఆఫీసర్లుగా నియమించింది. పుర పాలక ఎన్నికల్లో భాగంగా అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ. రెండున్న కోట్ల విలువైన సొత్తును చేసుకున్నట్లు సమాచారం. పోలింగ్ ముగిసే వరకు అమల్లోనున్న సైలెన్స్ మోడ్ ను పక్కాగా అమలు చేసేందుకు ప్రత్యేకంగా ఎస్ఎస్ టీ, ఎఫ్ ఎస్ టీ బృందాలు విధి నిర్వహణలో ఉన్నట్లు ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు, నిబంధనలను సోమవారం విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్ నిబంధనలను ఉల్లంఘించి ప్రచారం చేసే వ్యక్తులు, రాజకీయ పార్టీలపై చర్యలు తప్పవని ఎలక్షన్ కమిషన్ సెక్రటరీ జి. లింగ్య నాయక్ ప్రకటన జారీ చేశారు. మంగళ, బుధవారం రెండు రోజుల్లో పత్రికల్లో ప్రకటనలు వేయరాదని కమిషన్ పేర్కొంది. కానీ సైలెన్స్ మోడ్ అమలు కానున్న ఈ రెండు రోజుల్లో వార్త పత్రికల్లో ప్రకటనలు వేసుకునేందుకు బీజేపీ దరఖాస్తు చేసుకోగా, అందుకు నిరాకరించినట్లు తెలిసింది.

14న చైర్ పర్సన్స్, వైస్ చైర్ పర్సన్స్ ఎన్నిక

Advertisement

ఈ నెల 13న కౌంటింగ్ ముగిసిన తర్వాత ఈ నెల 14న మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల చైర్ పర్సన్లు, వైస్ చైర్ పర్సన్లు, మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక, పదవీ ప్రమాణ స్వీకరణ కార్యక్రమాల్ని నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నాం పన్నెండున్నర గంటలకు అన్ని సంస్థల్లో స్పెషల్ మీటింగ్ లను నిర్వహించనున్నారు. దీంతో పాటు ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల పరిధిలోని ప్రజాప్రతినిధులను ఎక్స్ అఫిషియో సభ్యులకు పరోక్ష ఎన్నికను కూడా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఈ నెల 14వ తేదీలోపు ప్రజాప్రతినిధుల వివరాలను సమర్పించాలని ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

Also Read: Illu Illalu Pillalu Today Episode: విశ్వం పై అమూల్య రివేంజ్.. వల్లికి, విశ్వంకు మైండ్ బ్లాక్.. సాగర్ దొరికిపోతాడా..?

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×