E-Paper
Advertisement

Gold Shop Robbery: గోల్డ్ షాపులో దోపిడీ దొంగల బీభత్సం.. అరడజను మంది సర్దేశారు, సీసీటీవీ సాక్షిగా

Gold Shop Robbery: గోల్డ్ షాపులో దోపిడీ దొంగల బీభత్సం.. అరడజను మంది సర్దేశారు, సీసీటీవీ సాక్షిగా
Advertisement

Gold Shop Robbery: బంగారం, వెండి ధరలు మార్కెట్లో ఆకాశాన్ని తాకాయి. దీంతో దొంగల చూపు అటు వైపు పడింది. పగలు రెక్కీ నిర్వహించడం.. రాత్రి వేళ దోపిడీకి దిగడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో ఏకంగా బంగారం షాపుని దోచేశారు అరడజను మంది దొంగల ముఠా గ్యాంగ్.

అనంతపురం జిల్లాలో గోల్డ్ షాపు దోపిడీ

Advertisement

కారణాలు ఏమైనా బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు కొండెక్కి కూర్చొన్నాయి. ఆ ధరలను చూసి సామాన్యుడు బెంబేలెత్తుతున్నాడు. పెళ్లిళ్లకు, ఏదైనా ఫంక్షన్లకు బంగారం కాకపోయినా, కనీసం వెండి ఆభరణాలు బహుమతిగా ఇచ్చేవారు. ఈ రెండు లోహాల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉన్నాయి. మార్కెట్లో బంగారం ధర 10 గ్రాములు రెండున్నర లక్షలు పైమాటే. అటు వెండి కిలో ధర అంతే పలుకుతోంది.

ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. బంగారం, వెండి ధరల నేపథ్యంలో దొంగల ముఠాల చూపు గోల్డ్ షాపులపై పడ్డాయి. తాజాగా అనంతపురం జిల్లాలో బంగారం షాపుని లూఠీ చేసింది ఓ గ్యాంగ్. రాయదుర్గం పట్టణంలోని బళ్లారి రోడ్‌లోని సయ్యద్ జ్యువెలర్స్‌ షాపులో భారీ చోరీ జరిగింది. మంగళవారం ఉదయం తెల్లవారుజామున అంటే మూడున్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.

Advertisement

షాపులో దొంగల బీభత్సం..  అరగంటలో సర్దేసిన దొంగలు

దాదాపు ఆరు లక్షల విలువచేసే వెండి ఆభరణాలతో దుండగులు పరారయ్యారు. దుకాణంలోని ట్రెజరీ తెరిచేందుకు ప్రయత్నించాడు దొంగలు. బంగారు ఆభరణాలన్నీ ట్రెజరీ‌లో ఉండటంతో భారీ నష్టం తప్పింది. దాదాపు అరడజను మంది దొంగలు ఈ చోరీకి పాల్పడినట్టు తెలుస్తోంది.

బయట ఇద్దరు కాపలా ఖాయగా, మిగతా నలుగురు దొంగలు తాము తెచ్చుకున్న బ్యాగుల్లో వెండి ఆభరణాలను సర్దేశారు. ఉదయం 10 గంటలకు షాపు ఓపెన్ చూసి చూసేసరికి ఆభరణాలు కనిపించకపోవడంతో షాపు యజమాని షాకయ్యాడు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. షాపులోని సీసీటీవీ కెమెరా పరిశీలించారు. తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో చోరీ జరిగినట్టు అందులో రికార్డు అయ్యింది.

ALSO READ: హుస్సేన్‌సాగర్‌లోకి దూకి టెక్కీ ఆత్మహత్య.. హైదరాబాద్‌లో దారుణం

https://twitter.com/ChotaNewsApp/status/2021109376271188198

 

 

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×