BigTV English

Jagtial: కొత్తరకం మోసం.. సగం‌ ధరకే బంగారం..

Jagtial: కొత్తరకం మోసం.. సగం‌ ధరకే బంగారం..

Jagtial: జగిత్యాలలో కొత్తరకం మోసం బయటపడింది. సగం‌ ధరకే బంగారం ఇస్తామంటూ కేటుగాళ్లు అమాయకులకు వల విసురుతున్నారు. పలువురికి ఫోన్ చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. కర్ణాటక నుంచి ఇలాంటి కాల్స్ వస్తున్నాయని జగిత్యాల వాసులు చెబుతున్నారు.


బెంగుళూరు సమీపంలో ఇంటి నిర్మాణం చేపట్టే సమయంలో బంగారం బయట పడిందని దానిని సగం ధరకే విక్రయిస్తామని కేటుగాళ్లు చెబుతున్నారు. అమాయకులను ఇలాంటి జిమ్మిక్కుతో నమమించే ప్రయత్నం చేస్తున్నారు. 82960 09383, 88670 24793 ఫోన్ నంబర్ల నుంచి కాల్స్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే వాట్సప్ లో కూడా ప్రత్యేకమైన బంగారు ఆభరణాల ఫోటోలు పంపుతున్నారు.

ముఖ్యంగా జగిత్యాల జిల్లాలోని జాబితాపూర్, హబ్సీపూర్, కల్లెడ, అనంతారం,ధర్మారం, లక్ష్మీపూర్ గ్రామాలలో పలువురికి ఫోన్ చేసి వల విసురుతున్నారు కేటుగాళ్లు. కర్ణాటకకి డబ్బులు తీసుకొని వస్తే బంగారం ఇస్తామని మాయమాటలు చెబుతున్నారు. దీంతో ఈ బంగారం విషయం ఇప్పుడు జగిత్యాలలో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు రంగంలోకి దిగి కేటుగాళ్లను అరెస్టు చేయాలని జగిత్యాల జిల్లా వాసులు కోరుతున్నారు.


Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×