BigTV English

Good News : ఉచితంగా రూ.కోటి బీమా.. ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఫ్రీ ఫ్రీ ఫ్రీ..

Good News : ఉచితంగా రూ.కోటి బీమా.. ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఫ్రీ ఫ్రీ ఫ్రీ..

Good News : ఆస్తులు ఉన్నా లేకున్నా ఓకే. డబ్బులు కూడబెట్టినా పెట్టకపోయినా ఓకే. సొంతిల్లు గట్రా ఉన్నా లేకున్నా ఓకే. కారు, బ్యాంక్ బ్యాలెన్సు, బంగారం.. ఇలా ఏవి ఉన్నాలేకున్నా.. ఓ మనిషికి తప్పకుండా ఉండాల్సింది ఒకటుంది. అదే ఇన్సూరెన్స్. నిరుపేదైనా, కోటీశ్వరుడైనా బీమా తప్పనిసరి. క్లిష్ట పరిస్థితుల్లో మనల్ని ఆదుకునేది అదే. తిన్నా తినకున్నా.. దాచుకున్నా దాచుకోకపోయినా.. ముందుగా ప్రతీఒక్కరు ప్రమాద బీమా తీసుకోవాల్సిందే. ఆ తర్వాతే మిగతా బడ్జెట్ ప్లానింగ్స్ చేసుకోవాలి. ఆర్థిక నిపుణులు ఈ విషయాన్ని గట్టిగా నొక్కి చెబుతుంటారు. కానీ, మనమే విని వదిలేస్తాం.


ఉచితంగా రూ.కోటి బీమా..

మనమిప్పుడు బాగానే ఉన్నాంగా? మనకేం కష్టం వచ్చింది? అవసరం వచ్చినప్పుడు చూసుకుందాంలే. బీమా అంటే ఏడాదికోసారి ప్రీమియం డబ్బులు కట్టాలి.. మనకేం కాకపోతే ఆ డబ్బులన్నీ వేస్టేగా? ఇలా చాలా నెగెటివ్‌గా ఆలోచిస్తుంటారు చాలామంది. ఇన్సూరెన్స్ తీసుకునే అలవాటు తెలుగు వారికి చాలా తక్కువేనని చెప్పాలి. అనుకోని ప్రమాదం జరినప్పుడే తెలుసొస్తుంది ఇన్సూరెన్స్ ఇంపార్టెన్స్ ఏంతో. అదెంత ముఖ్య అవసరమో. అలాంటి బీమా సౌకర్యం ఉచితంగా వస్తే ఎలా ఉంటుంది? పైసా కూడా కట్టాల్సిన అవసరం లేకుండా ఏకంగా కోటి రూపాయల బీమాను ఉచితంగా అందిస్తే అంతకంటే అదృష్టం ఇంకేం ఉంటుంది? అదే చేస్తోంది తెలంగాణ ప్రజా ప్రభుత్వం. అయితే, ఈ అవకాశం అందరికీ అందరికీ అందుబాటులో లేదు. కేవలం ఆ శాఖ వారికి మాత్రమే.


రూ.కోటి చెక్ అందించిన డిప్యూటీ సీఎం

దేశ చరిత్రలోనే తొలిసారి. ఇదో అరుదైన రికార్డు. విద్యుత్ కార్మికులకు ఉచితంగా రూ.కోటి ప్రమాద బీమాను అందిస్తోంది తెలంగాణ సర్కారు. ఇప్పటికే ఈ పథకం ప్రారంభమైంది. ఈమధ్య Npdcl పరిధిలో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు మరణించాడు జోగు నరేష్. ఆయనకు ఉచిత బీమా పథకం వర్తించింది. తాజాగా, నరేష్ కుటుంబ సభ్యులకు కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కును స్వయంగా అందజేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆ రూ.కోటితో ఇంటిపెద్దను కోల్పోయిన ఆ కుటుంబానికి కాస్త ఓదార్పు. అంతేకాదు. నరేశ్ భార్యకు కారుణ్య నియామకంలో భాగంగా విద్యుత్ శాఖలో ఉద్యోగం కూడా ఇచ్చారు. ఆ నియామక పత్రాలను సైతం అందించారు భట్టి విక్రమార్క. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వంతో ఇది సాధ్యం అయిందని చెప్పారాయన.

పెట్టుబడుల డ్రైవ్

మరోవైపు, రాష్ట్ర యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి ఉపాధి, ఆదాయం తీసుకువచ్చే పరిశ్రమలు ఏర్పాటు అయ్యేలా కసరత్తు చేస్తున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రజాభవన్‌లో మంత్రులతో కలిసి ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌పై స్పెషల్‌ డ్రైవ్ నిర్వహించారు. ఇండస్ట్రియల్ ప్రమోషన్ సబ్ కమిటీ సమావేశానికి.. మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి హాజరయ్యారు. సమావేశంలో MOU అమలులో ప్రగతి, కొత్త యూనిట్ల స్థాపనకు సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

ఇక ప్రతీ శనివారం..

అనుబంధ పరిశ్రమలు వచ్చే ప్రతిపాదనలపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు భట్టి. ఇక నుంచి ప్రతి శనివారం తప్పకుండా ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్‌ల సమావేశాలు జరగాలని ఆదేశించారు. జహీరాబాద్ నిమ్జ్ ప్రాంతంలో హుండాయ్ గ్లోబల్ ఇన్నోవేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ స్థాపనకు.. సబ్ కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. 675 ఎకరాల్లో 8,528 కోట్ల పెట్టుబడితో కంపెనీ రావడం గొప్ప విజయం అన్నారు. సెంటర్ ఏర్పాటుతో కొత్తగా 4,276 మంది రాష్ట్ర యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. ప్రస్తుతం ప్రారంభించబోతున్న పరిశ్రమలు రాబోయే రోజుల్లో పెద్ద సంఖ్యలో ఉపాధి, ఆదాయాన్ని సమకూరుస్తాయన్నారు తెలంగాణ మంత్రులు.

Related News

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండి కుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Big Stories

×