BigTV English

Bigg Boss Hindi : ఈ సారి 100 రోజులు కాదు.. డబుల్ పెంచారు… కంటెస్టెంట్స్ అన్ని డేస్ బతుకుతారా..?

Bigg Boss Hindi : ఈ సారి 100 రోజులు కాదు.. డబుల్ పెంచారు… కంటెస్టెంట్స్ అన్ని డేస్ బతుకుతారా..?

Bigg Boss Hindi :బిగ్ బ్రదర్ గా ఎక్కడో పాశ్చాత్య దేశాలలో ప్రారంభమైన ఈ రియాల్టీ షో హిందీలో తొలిసారి బిగ్ బాస్ పేరిట ప్రారంభం అయింది. ఇక హిందీలో ప్రారంభమై కొన్ని సీజన్లు పూర్తయ్యాక మిగతా భాషలలోకి కూడా ఈ రియాల్టీ షో వచ్చేసింది. నిజానికి ఈ షో ప్రారంభమైనప్పుడు భాషతో సంబంధం లేకుండా మంచి ఆదరణ పెరగడంతో ఇతర భాషలలో కూడా ఈ రియాల్టీ షో ప్రారంభించారు. దాదాపు 100 రోజులపాటు ప్రపంచంతో సంబంధం లేకుండా.. అసలు సమయం ఎంత అవుతుందో అనే విషయాలు తెలియకుండా.. పూర్తిగా గుర్తు తెలియని వ్యక్తుల మధ్య గడపడం అంటే అతిపెద్ద సవాల్ తో కూడుకున్న పని.. తినడానికి సరైన తిండి లేక బిగ్ బాస్ ఇచ్చే టాస్క్లలో గెలిచి, పోరాడి తమ వ్యక్తిత్వాన్ని సైతం బయట పెట్టుకునే కార్యక్రమం ఇది. కొంతమంది ఈ షో ద్వారా మంచి ఇమేజ్ సొంతం చేసుకుంటే.. మరి కొంతమంది తమ క్యారెక్టర్ ను బ్యాడ్ కూడా చేసుకున్నారు.


ఇకపై బిగ్ బాస్ 5 నెలలు..

అందుకే ఈ షోలో చాలామంది ఎక్కువ కాలం ఉండలేక వెంటనే బయటకు వచ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే ఇదిలా ఉండదా తాజాగా ఈ షో నుంచి మరో విషయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇకపై ఈ షో వంద రోజులు కాదు 170 రోజులట. అంటే మూడు నెలలు కాదు ఐదు నెలలు. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. సాధారణంగా ఏ భాషలో అయినా సరే బిగ్ బాస్ షో మూడు నెలలు నడుస్తుంది. ముఖ్యంగా టిఆర్పి రేటింగ్ బాగున్నప్పుడు కొన్ని రోజులు షోని కొనసాగిస్తారు. అయితే ఇప్పుడు ఈ రియాల్టీ షోని ఏకంగా 5 నెలలు నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకోసం కంటెస్టెంట్స్ మానసికంగా సిద్ధమై ఉండాలి. ముఖ్యంగా మూడు నెలలు అంటేనే ఎన్నో సవాళ్లతో కూడుకున్న పని. అలాంటిది ఐదున్నర నెలలు బిగ్ బాస్ హౌస్ లోనే ఉండాలి అంటే మామూలు విషయం కాదు. ఒకవేళ ఇదే జరిగితే కంటెస్టెంట్ల సంఖ్య పెరగడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే 170 రోజులంటే పోటీదారుల సంఖ్య, వైల్డ్ కార్డు ఎంట్రీలు ఎక్కువగా ఉంటాయి. ఇక టైటిల్ ఫేవర్ గా నిలిచేవారు 170 రోజులు నిలవాలి అంటే.. ఇక అన్ని రోజులు వారు ఉంటారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.


వర్కౌట్ అవుతుందా..?

అయితే ఈ విషయంపై తెలుగు ఆడియన్స్ పలు రకాలుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ.. అనుమానాలకు తెరదించుతూ ఇది తెలుగు బిగ్ బాస్ కి కాదు.. హిందీ బిగ్ బాస్. సల్మాన్ ఖాన్ (Salman Khan) హోస్ట్ గా వ్యవహరిస్తున్న హిందీ బిగ్ బాస్.. ఈ షో నుంచీ కొన్ని నివేదికల ప్రకారం బిగ్ బాస్ హిందీ రియాల్టీ షో జూలై 30 నుండి ప్రారంభమవుతుంది. అలాగే జనవరి చివరి వరకు ఈ రియాల్టీ షో కొనసాగబోతుందని సమాచారం. అంతేకాదు ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తనకున్న ఇబ్బందులను, ప్రాణహానిని దృష్టిలో పెట్టుకొని రెమ్యునరేషన్ కూడా పెంచినట్లు తెలుస్తోంది. మరి ఈ సీజన్ ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

ALSO READ:Hero Vishal: మాట నిలుపుకోనున్న హీరో విశాల్.. పెళ్లి ఎక్కడంటే..?

Related News

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Mallika Sherawat: బిగ్ బాస్‌లోకి హాట్ బ్యూటి మల్లికా షెరావత్.. అబ్బాయిలు ఇక టీవీ వదలరేమో!

Big Stories

×