Vishnupriya – Prithvi :ఈ మధ్యకాలంలో ప్రతి ఛానల్లో పదుల సంఖ్యలో షోలు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి షోలో కూడా కామెడీ తప్పనిసరిగా అయిపోయింది. అందుకే అటు కంటెస్టెంట్స్ కూడా తమ కామెడీతో ప్రేక్షకులను మెప్పించడానికి ఏవేవో చేస్తూ ఉంటారు.. ఇకపోతే కామెడీనే కాదు ఈమధ్య సెలబ్రిటీల మధ్య ప్రేమాయణం కూడా ఎక్కువ అయిపోయింది. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ లేకపోయినా ఉన్నట్టు.. రొమాన్స్ లేకపోయినా చేస్తున్నట్టు చూపిస్తూ వారి మధ్య ఏదో ఉన్నట్టు అటు ఎడిటర్స్ కూడా క్రియేట్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇదిలా ఉండగా ఇప్పటికే రష్మీ – సుధీర్ మధ్య ఏమి లేకపోయినా ఏదో ఉన్నట్టు పెళ్లి చేసుకోబోతున్నట్టు.. అంతేకాదండోయ్ స్టేజ్ పై చాలా సార్లు పెళ్లి కూడా చేసేసారు. దీంతో టిఆర్పి కోసం ఏమైనా చేసేస్తారా అని మండిపడ్డ ఆడియన్స్ కూడా లేకపోలేదు.
బిగ్ బాస్ తో ప్రేమాయణం మొదలు..
ఇదిలా ఉండగా ఇప్పుడు మరో లవ్ జంట తెరపై సందడి చేయడానికి సిద్ధం అయ్యింది. అదేదో కాదు పృథ్వీ రాజ్ శెట్టి (Prithvi RajShetty) – విష్ణు ప్రియ (Vishnu Priya) . పలు సీరియల్స్ ద్వారా తనకంటూ గుర్తింపు సొంతం చేసుకున్న పృథ్వీ రాజ్ శెట్టి.. ఈసారి తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న విషయం తెలిసిందే. మరొకవైపు ఇదే సీజన్లో ప్రముఖ యాంకర్ విష్ణు ప్రియ కూడా కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసింది. పృథ్వీ రాజ్ శెట్టి ని ఎంతలా ప్రేమించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతడికి ఇష్టం లేకపోయినా అతడి వెంటపడింది. ఇదేంటని అడిగితే తనకు ఇష్టం లేదు కానీ నాకు ఇష్టం ఉంది కదా అంటూ తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేసింది. అటు హౌస్ లోకి పృథ్వి తల్లి వచ్చినప్పుడు కూడా విష్ణుప్రియను కోడలిగా చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పింది. కానీ పృథ్వీ రాజ్ శెట్టి మాత్రం ఏం పట్టనట్టే ఉన్నారు. ఇక హౌస్ లో వీరిద్దరి ప్రేమాయణం ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ అందించిన విషయం తెలిసిందే.
గుండెల్లో పెట్టుకుంటానన్న పృథ్వీ.. విష్ణు రియాక్షన్..
అయితే ఇప్పుడు దీనిని పలు షోలకి కూడా ఉపయోగించుకుంటున్నారు నిర్వాహకులు. అసలు విషయంలోకి వెళ్తే తాజాగా శ్రీముఖి హోస్టుగా ప్రముఖ ఛానల్లో ప్రసారమవుతున్న కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ సీజన్ 2 ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక తాజాగా లవ్ థీమ్ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చారు. అందులో పృధ్విరాజ్ శెట్టి వేసుకున్న కోట్ పై ముందు భాగంలో చిన్న లవ్ సింబల్, వెనుక భాగంలో మరో లవ్ సింబల్ వేయబడింది. అటు విష్ణుప్రియ కూడా చిన్నచిన్న హార్ట్ సింబల్స్ తో ఉన్న డ్రస్ ధరించింది. ఇంకా షో ప్రారంభం అవ్వగానే “టూ హాట్ బికాస్ ఆఫ్ హిమ్” అంటూ మెలికలు తిరుగుతుంది. అంతలోనే శ్రీ ముఖి.. పృథ్వీరాజ్ శెట్టిని వెనక్కి తిప్పుతూ వెనక ఉన్న ఇంత పెద్ద హార్ట్ ఎవరికి ముందు ఉన్న ఈ చిన్న హార్ట్ ఎవరికి అని ప్రశ్నించగా.. దానికి పృథ్వీ ముందున్నది ఫ్యూచర్ వైఫ్.. వెనుకున్నది ఫ్యాన్స్ కి అని చెబుతాడు. వెంటనే శ్రీముఖి విష్ణుప్రియకేగా అంటూ నవ్వుతూ కామెంట్ చేస్తుంది. ఇక దీంతో విష్ణు ప్రియ సంబరపడిపోతుంది. వెంటనే తేజస్విని మరి తనకేం లేదా అని అడిగితే.. వెంటనే బుంగమూతి పెట్టుకున్న విష్ణు ప్రియ దగ్గరికి వచ్చి..” ఒక్క ఛాన్స్ ఇస్తావా.. ఇక్కడ పెట్టుకొని చూసుకుంటాను అంటే హృదయం వైపు చూపించాడు” వెంటనే విష్ణు ప్రియ నేను రెడీ అంటూ ఎగిరి గంతేసింది. ఇది చూసిన నెటిజన్స్ ఏంట్రా ఈ ఘోరం వీరిద్దరికీ స్టేజ్ పైనే శోభనం కూడా చేయించేలా ఉన్నారే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ALSO READ:Bigg Boss : ఈ సారి 100 రోజులు కాదు.. డబుల్ పెంచారు… కంటెస్టెంట్స్ అన్ని డేస్ బతుకుతారా..?
?utm_source=ig_web_copy_link