E-Paper
Advertisement

Fertilizer Booking App: రైతులకు గుడ్ న్యూస్.. ఇంటి నుంచే యూరియా బుకింగ్

Fertilizer Booking App: రైతులకు గుడ్ న్యూస్.. ఇంటి నుంచే యూరియా బుకింగ్
Advertisement
Advertisement

రైతులకు యూరియాను ఒకేసారి కాకుండా.. పలు విడతల వారిగా సరఫరా చేయనున్నారు. ఐదు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు రెండు విడతల్లో, ఐదు నుంచి ఇరవై ఎకరాలు ఉన్న రైతన్నలకు మూడువిడతల్లో, 20 ఎకరాలకు మించి భూమి ఉన్న రైతులు నాలుగు విడతల్లో యూరియాను బుక్ చేసుకుని యూరియాను తీసుకువెళ్లాల్సి ఉంటుంది. సంబంధిత యాప్‌లో రైతు పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్‌ను నమోదు చేయగానే.. లింకైన ఫోన్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేసిన వెంటనే రైతుకు చెందిన భూమి విస్తీర్ణం, సాగు చేసిన పంటకు అవసరమైనటువంటి యూరియా పరిమాణంలో బుకింగ్ ఆధారంగా.. అధీకృత టైలర్లు లేదా సహకార సంఘాల ద్వారా యూరియాను కొనుగోలు చేసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. బుకింగ్ చేసుకున్న యూరియా కేవలం 48 గంటలు మాత్రమే ఉంటుంది. ఈ గడువు తేదీలోగా యూరియా తీసుకోనట్లైతే అది తిరిగి స్టాక్‌లోకి వెళ్తుంది.

ఈ యాప్ ద్వారా యూరియా పంపిణీ వల్ల రైతులకు సమయం ఆదాతో పాటు .. యురియా ఇతర ఎరువుల పంపిణీనీ సరళతరం చేసేందుకు విధానం తీసుకొచ్చినట్లుగా కొద్దిరోజుల క్రితం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. దీని ద్వారా ఎరువులు పక్కదారి పట్టకుండా పంట పండించే అన్నదాతలకు మాత్రమే అందుతాయని చెప్పారు. ఈ యాప్ వినియోగంపై అన్నదాతలకు సమస్యలు ఉంటే.. సంబంధిత ఏఈవోను సంప్రదింపవచ్చని వివరించారు. అధికారులందరూ యాప్ గురించి రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని కోరారు.

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×