BigTV English

Gruha Jyothi Scheme: గృహజ్యోతి స్కీమ్.. జీరో విద్యుత్ బిల్లులు జారీ..

Gruha Jyothi Scheme: గృహజ్యోతి స్కీమ్.. జీరో విద్యుత్ బిల్లులు జారీ..

 


Gruha Jyothi Scheme Telangana
Gruha Jyothi Scheme

Gruha jyothi scheme telangana(TS today news): తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని ఇప్పటికే అధికారికంగా ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తోంది. డిస్కమ్‌లు శుక్రవారం నుంచి లబ్ధిదారులకు జీరో విద్యుత్ బిల్లులు జారీ చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది వినియోగదారులు జీరో విద్యుత్ బిల్లులను పొందారు. శుక్రవారం మహబూబాబాద్‌ జిల్లాలోని కొత్తగూడ, గంగారం మండలాల్లో జీరో బిల్లుల కార్యక్రమాన్ని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క లాంఛనంగా ప్రారంభించారు.మరోవైపు రాష్ట్రంలో 40 లక్షల మంది వినియోగదారులు రూ. 500 ఎల్‌పీజీ సిలిండర్లు పొందనున్నారు.

తెలంగాణ రాష్ట్ర సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ TSSPDCL మీటర్ రీడర్లు శుక్రవారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కుత్బుల్లాపూర్, యూసుఫ్‌గూడ, విద్యా నగర్, సరూర్‌నగర్  ఇతర ప్రాంతాల్లో లబ్ధిదారులకు జీరో బిల్లులు జారీ చేశారు.


సంగారెడ్డి, మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ములుగు, భూపాలపల్లి, వనపర్తి జిల్లాల్లోనూ లబ్ధిదారులకు  జీరో బిల్లులు అందాయి. 106 యూనిట్లే వినియోగించినా రూ.489 బిల్లు పొందిన యూసుఫ్‌గూడకు చెందిన టి. ప్రభు సింగ్ అనే లబ్ధిదారునికి జీరో బిల్లును జారీ చేశారు. అదే విధంగా కుత్బుల్లాపూర్ డివిజన్ కాకతీయ నగర్ కాలనీకి చెందిన పి.బాశెట్టి 65 యూనిట్లు వినియోగించారు. అతడికి జీరో బిల్లును జారీ చేశారు.

Read More: సిరిసిల్లలో తేల్చుకుందాం.. కేటీఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి సవాల్..

గృహ జ్యోతి పథకం మార్గదర్శకాల ప్రకారం 200 కంటే తక్కువ విద్యుత్ యూనిట్లను వినియోగించే వినియోగదారులకు 2022-23లో వినియోగం ఆధారంగా సగటు తీసుకుంటారు. ఈ పథకం కింద జీరో విద్యుత్ బిల్లు ఇస్తారు.

విద్యుత్ అధికారుల చెప్పిన వివరాల ప్రకారం ఒక నిర్దిష్ట నెలలో 200 యూనిట్ల వరకు వినియోగించే అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఆ నెలకు జీరో బిల్లు వస్తుంది. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ మీటర్లు ఉంటే పథకం ఒక మీటరుకు మాత్రమే పరిమితం చేస్తారు. డిస్కమ్‌లు ప్రతి నెలా 20వ తేదీలోగా ప్రభుత్వానికి వివరాలను పంపుతాయి. ఆ తర్వాత ప్రభుత్వం సబ్సిడీ మొత్తాన్ని విడుదల చేస్తుందని అధికారులు తెలిపారు.

ఎలక్ట్రిసిటీ యాక్ట్ , ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఎవరైనా గృహేతర ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం ప్రజాపాలన, ఇతర ఛానెల్‌ల ద్వారా స్వీకరించిన దరఖాస్తులు , ఆధార్ కార్డులతో  అనుసంధానించిన అన్ని దరఖాస్తులు ఈ పథకం పరిధిలోకి వస్తాయి. ఉచిత విద్యుత్‌కు అర్హులైనప్పటికీ మార్చి నుంచి బిల్లులు పొందే వినియోగదారులు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి స్థానిక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ , ఇతర సంబంధిత మున్సిపల్ కార్యాలయాల్లో కూడా సంప్రదించవచ్చు.  రాష్ట్ర ప్రభుత్వం 2024-25 కోసం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.2,418 కోట్లు కేటాయించింది.

Tags

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×