E-Paper
Advertisement

మీ పార్ట్‌నర్ మిమ్మల్ని ముందులాగా ప్రేమించడం లేదా? నిశ్శబ్దంగా ఈ 5 సంకేతాలతో తెలుసుకోండి

మీ పార్ట్‌నర్ మిమ్మల్ని ముందులాగా ప్రేమించడం లేదా? నిశ్శబ్దంగా ఈ 5 సంకేతాలతో తెలుసుకోండి
Advertisement

Feeling Unsure About Love| ప్రేమలో ఉన్నప్పుడు ప్రతి సందేహాన్ని నేరుగా అడగడం అందరికీ సులభం కాదు. కొందరు తమ పార్ట్‌నర్ (లవర్ లేదా భార్య/భర్త ) మనసులో ఏముందో తెలుసుకోవడానికి చిన్న మార్పులు చేస్తారు. అయితే ఇలాంటి పరీక్షలు ప్రతీసారీ చేయకూడదు.

1. ముందుగా మెసేజ్ చేయడం ఆపి భాగస్వామి స్పందనను గమనించాలి

ఎప్పుడూ ముందుగా మెసేజ్ చేసే మీరు ఒక్కసారిగా ఆ ప్రయత్నాన్ని తగ్గించండి. ప్లాన్‌లు చేయడం లేదా సంభాషణ ప్రారంభించడం కూడా ఆపేయండి. మీరు మెసేజ్ చేయకపోతే మీ భాగస్వామి చేస్తారా అని గమనించండి. మీరు లేని లోటుని మీ భాగస్వామి గుర్తిస్తారా అని తెలుసుకోవడానికి ఇలా చేయవచ్చు. అయితే ఇది ప్రతిసారీ కావాలనే చేసే ఆట కాదు. కొన్నిసార్లు తమపై ఇంకా శ్రద్ధ ఉందని తెలుసుకోవాలనే కోరికతో ఇలా చేస్తారు. అయితే, ఇలాంటి నిశ్శబ్ద పరీక్షలు అపార్థాలకు దారితీయవచ్చు. ఎదుటివారికి ఈ మార్పు వెనుక కారణం తెలియకపోవచ్చు. అందుకే జాగ్రత్తగా చేయాలి.

2. గతంలో చెప్పిన చిన్న విషయాలు గుర్తున్నాయా అని గమనించండి

Advertisement

కొంతమంది రోజంతా తమకు ఎదురైన విషయాలను భాగస్వామితో పంచుకుంటారు. పని వద్ద జరిగిన సమస్య లేదా రాబోయే కార్యక్రమం గురించి చెబుతారు. మీరు కూడా ఇలా చేస్తుంటే.. మీరు గతంలో చెప్పిన విషయాల గురించి భాగస్వామిని అడగండి. వారు నిజంగా గుర్తుంచుకున్నారా అని గమనించండి. “ఆ పని ఎలా జరిగింది?” అనే చిన్న ప్రశ్న కూడా వారికి ఎంతో ప్రత్యేకంగా అనిపించవచ్చు.
ఇలాంటి స్పందన తమ మాటలను భాగస్వామి శ్రద్ధగా విన్నారని భావించేలా చేస్తుంది. చిన్న విషయాలను గుర్తుంచుకోవడం కూడా ప్రేమ, శ్రద్ధను చూపించవచ్చు.

3. కొంత దూరంగా ఉంటూ భాగస్వామి గమనించండి

సంబంధంపై సందేహం కలిగినప్పుడు కొందరు కొంత వెనక్కి తగ్గుతారు. వారు తక్కువగా మాట్లాడుతారు లేదా ఒంటరిగా ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడతారు. రోజువారీ విషయాలను కూడా భాగస్వామితో పంచుకోవడం తగ్గిస్తారు. తర్వాత తమ ప్రవర్తనలో వచ్చిన మార్పును భాగస్వామి గమనిస్తారా అని చూస్తారు. మీరూ ఇది ట్రై చేయండి.
మీరు ఇలా చేస్తే మీ భాగస్వామి ఏం జరిగిందని అడుగుతారా లేదా దగ్గరవడానికి ప్రయత్నిస్తారా అని గమనిస్తారు. అయితే కారణం చెప్పకుండా దూరంగా ఉండటం మరింత గందరగోళాన్ని సృష్టించే అవకాశం ఉంది.

4. సమాధానం తెలిసినా కొన్ని ప్రశ్నలు అడగకండి

Advertisement

“నేను దూరంగా ఉన్నప్పుడు నన్ను మిస్ అవుతావా?”, “ఇప్పటికీ అందరి కంటే నేను నీ జీవితంలో ముఖ్యమా?” వంటి ప్రశ్నలు అడగండి. ప్రశ్నలకు ముందుగానే మీకు సమాధానం తెలిసినా కేవలం మీ బంధాన్ని బలపరచడానికి అడగంది.
ఇలాంటి ప్రశ్నలకు మీ భాగస్వామి ప్రేమగా ఇచ్చే సమాధానం కొంతకాలం మీలో ఆందోళనను తగ్గించవచ్చు. అయితే సందేహం పదేపదే వస్తే అసలు కారణాన్ని చర్చించడం అవసరం.

Also Read: మంచి వ్యక్తుల ఈ అలవాట్లే వారి బలహీనతలు.. మీరు కూడా ఈ తప్పులు చేస్తున్నారా?

5. తమకు అవసరం వచ్చినప్పుడు భాగస్వామి ఎలా స్పందిస్తారో గమనిస్తారు

మీరు ఎదుర్కొనే కష్టాల గురించి చెప్పండి, లేదా మీ పార్ట్‌నర్ నిజంగా సాయం చేయగలరా? అని అడగండి. చాలా మందికి ప్రేమ అంటే పెద్ద పెద్ద మాటలు చెప్పడం కాదు, ఇలా కష్టసమయంలో తోడుగా ఉండడం. మీ కష్టాలను బహిరంగంగా మాట్లాడటం సంబంధాన్ని మరింత బలపరచవచ్చు

మీ భాగస్వామిని నిశ్శబ్దంగా పరీక్షించడం తాత్కాలికంగా మీకు భరోసా ఇస్తుంది. అయితే దీని వల్ల మీ ఇద్దరి మధ్య అపార్థాలు కూడా పెరిగే అవకాశం ఉంది.

Also Read: మొదటి పరిచయంలోనే అందరికీ నచ్చాలంటే ఈ 5 లక్షణాలు తప్పనిసరి.. మీలో ఉన్నాయా?

తమకు కావాల్సిన ప్రేమ, శ్రద్ధ, భరోసా గురించి నేరుగా మాట్లాడటం మంచిది. పరస్పర నమ్మకం, నిజాయితీ, శ్రద్ధతో సంబంధం మరింత ఆరోగ్యంగా మారుతుంది.

Tags

Related News

రోజూ మీ భార్యతో ఫ్లర్టింగ్ చేస్తున్నారా? దాంపత్య జీవితంలో జరిగేది ఇదే..

స్వీట్ హౌస్ స్టైల్ బ్రెడ్ హల్వా..ఇంట్లోనే ఇలా టేస్టీగా రెడీ చేయండి

చీజ్ లవర్స్‌కు తప్పకుండా నచ్చే ‘ఎగ్‌ప్లాంట్ పార్మిజియానా’.. లొట్టలేసుకుంటూ తినడం ఖాయం!

బండ్ల మీద దొరికే పెసర పునుగుల సీక్రెట్ ఇదే..స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ ఇక మీ ఇంట్లోనే!

సొరకాయ పచ్చి కారం కూర ఇలా చేస్తే..ఒక్క ముద్ద కూడా వదలరు!

ఐస్‌క్రీమ్‌ను ఇలా కూడా తయారుచేయొచ్చా? ఈ జపనీస్ రెసిపీ తెలిస్తే వెంటనే ట్రై చేస్తారు!

సింపుల్‌గా హైదరాబాదీ రాయల్ మటన్ మరగ్.. ఇంటికొచ్చిన అతిథులు ముగ్దులైపోవాల్సిందే!

డిప్రెషన్, స్ట్రెస్ లేకుండా ప్రశాంతమైన జీవితం కావాలా? ఈ 5 జపాన్ టెక్నిక్స్ మీ కోసమే

Big Stories

Advertisement
×