E-Paper
Advertisement

పశువుల కొట్టం కంటే ఘోరం.. అమెరికాతో పోటీ అంటే ఇదేనా? మెడికోల సమ్మెకు హరీశ్ రావు సపోర్ట్!

పశువుల కొట్టం కంటే ఘోరం.. అమెరికాతో పోటీ అంటే ఇదేనా? మెడికోల సమ్మెకు హరీశ్ రావు సపోర్ట్!
Advertisement

Harish Rao: కాబోయే డాక్టర్ల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. పశువుల కొట్టం కంటే అధ్వాన్నంగా మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉందన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంగళ్‌పల్లి వద్ద కనీస వసతులు లేవంటూ ఆందోళన చేస్తున్న మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్థుల ధర్నా శిబిరాన్ని సందర్శించి వారికి హరీశ్ రావు మద్దతు తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, డీఎంఈ వాణీదేవి తో ఫోన్‌లో మాట్లాడి విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. డాక్టర్ విద్యను అభ్యసించే మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ పరిస్థితి చూస్తుంటే చాలా బాధ కలుగుతోందని అన్నారు. మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రభుత్వ పాఠశాలలు కూడా ఇంత అధ్వాన్నంగా ఉండవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విజన్ 2047, ఫ్యూచర్ సిటీ అని చెబుతూ అమెరికా, చైనా, సింగపూర్‌లతో పోటీ పడుతున్నానని భారీ డైలాగులు కొడుతుందని గుర్తుచేశారు. కానీ ఇక్కడ కాబోయే డాక్టర్ల దుస్థితి చూస్తుంటే శ్రీలంక, నేపాల్‌తో పోటీ పడుతున్నట్లు కనిపిస్తోందన్నారు. బహుశా శ్రీలంక, నేపాల్‌లో కూడా ఇంత అధ్వాన పరిస్థితులు ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు.

Advertisement

అయితే రాజకీయం కోసం తాను ఈ మాటలు చెప్పడం లేదని సాక్షాత్తూ ఈ కాలేజీ బిల్డింగ్ ఓనర్ ప్రభుత్వానికి రాసిన లేఖ ఆధారంగా ఈ విమర్శలు చేస్తున్నట్లు చెప్పారు. 2024 ఆగస్టు 1న భవనాన్ని తీసుకున్నప్పటి నుంచి 26 నెలలుగా వాటర్ బిల్లు, కరెంటు బిల్లు, భవనం రెంట్ కట్టలేదని ఓనర్ లేఖ రాశారన్నారు. రూ.లక్ష కోట్లతో మూసీ సుందరీకరణ, ఫ్యూచర్ సిటీ కడతానంటున్న ప్రభుత్వానికి.. మెడికల్ కాలేజీ పిల్లల వాటర్ బిల్లు, కరెంటు బిల్లు, రెంట్ కట్టడానికి పైసలు లేవా? అని నిలదీశారు.

Also Read: ‘హిందూ కాలేజ్‌ను ప్రైవేటీకరిస్తే ఊరుకోం’.. కేంద్రానికి కవిత హెచ్చరిక!

Advertisement

సామాన్యులు చిన్న ఇల్లు కట్టుకుంటే సెట్ బ్యాక్ లేదనో, ఫైర్ పర్మిషన్ లేదనో, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేదనో రాత్రికి రాత్రే పోయి కూలగొట్టే ప్రభుత్వానికి.. ఈ మెడికల్ కాలేజీ భవనం కనిపించడం లేదా? అని నిలదీశారు. థర్డ్ ఇయర్ పిల్లలు చదువుతున్న ఈ బిల్డింగ్‌కు ఇంతవరకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేదన్నారు. ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు క్లియరెన్స్, వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ మీటర్ కూడా లేదన్నారు. కాలేజీ చుట్టూ చెత్తాచెదారం, స్క్రాప్, పాములు, కుక్కలు, పందులు, కోతులు ఉన్నాయని సాక్షాత్తూ కాలేజీ ప్రిన్సిపాలే ప్రభుత్వానికి లేఖ రాశారన్నారు.

Also Read: రూ. 400 కోట్ల ‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్.. ఈడీ ఎంట్రీతో సైబర్ కేటుగాళ్ల గుట్టురట్టు!

Tags

Related News

ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఐ సపోర్ట్ వారికే.. క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని..?

తెలంగాణలో ఒకేషనల్ ట్రైనర్ల నిరసన కాక.. అడ్డుకున్న పోలీసులు!

పోలీస్​ కొలువుల కోసం.. ట్రాన్స్​ జెండర్లకు శిక్షణ!

మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి ప్రజలకు బిగ్ రిలీఫ్.. నీటి సరఫరా!

‘హిందూ కాలేజ్‌ను ప్రైవేటీకరిస్తే ఊరుకోం’.. కేంద్రానికి కవిత హెచ్చరిక!

తెలంగాణలో మురసు తుఫాను ఎఫెక్ట్.. భారీగా దెబ్బతిన్న వరి పంటలు!

కాంగ్రెస్ సంచుల పార్టీ.. బీజేపీ చెప్పుల పార్టీ.. కేటీఆర్ ఘాటు విమర్శలు!

Big Stories

Advertisement
×