E-Paper
Advertisement

తెలంగాణలో మురసు తుఫాను ఎఫెక్ట్.. భారీగా దెబ్బతిన్న వరి పంటలు!

తెలంగాణలో మురసు తుఫాను ఎఫెక్ట్.. భారీగా దెబ్బతిన్న వరి పంటలు!
Advertisement

Crop Damage: మురసు తుఫాను ప్రభావంతో జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను సంరక్షించుకునేందుకు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు సూచించారు. తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

పంటలు నాశనం..

ఇప్పటివరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో సుమారు 1600 ఎకరాల్లో మినుము పంట, 1,500 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలిస్తూ వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు.కొత్తగూడెం మండలం సుజాతనగర్ గ్రామంలో నేలకొరిగిన వరి పంట పొలాలను చైతన్య రెడ్డి, కొత్తగూడెం వ్యవసాయ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు (ఏడీఏ), సుజాతనగర్ మండల వ్యవసాయ అధికారి (ఎంఏఓ)తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పంటల పరిస్థితిని, వర్షాల కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. వరి పంట నేలకొరిగిన ప్రాంతాల్లో పొలాల్లో నిల్వ ఉన్న వర్షపు నీటిని వెంటనే బయటకు పంపించాలని సూచించారు. నీరు ఎక్కువ సమయం నిల్వ ఉండకుండా మురుగు కాలువల ద్వారా నీటిని తొలగించాలని తెలిపారు. వరి కంకులు తడిసి ధాన్యం మొలకెత్తే పరిస్థితి ఉన్నచోట ఒక ట్యాంకు నీటిలో 100 గ్రాముల ఉప్పు కలిపి పిచికారీ చేయడం ద్వారా మొలకలు రాకుండా నివారించవచ్చని అన్నారు.

అధికారుల సలహా..

Advertisement

మిరప పంట సాగు చేస్తున్న రైతులు భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా నేలకొరిగిన మొక్కలను తిరిగి నిలబెట్టి కర్రలు లేదా ఇతర ఆధారాలతో కట్టుకోవాలని సూచించారు. మొక్కల మొదళ్ల వద్ద మట్టిని ఎగదోసి మొక్కలు పడిపోకుండా చూడాలని, చేలల్లో నీరు నిల్వ ఉండకుండా తగిన పారుదల సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. అధిక తేమ కారణంగా తెగుళ్లు వ్యాపించే అవకాశం ఉన్నందున పంటలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, వ్యవసాయ శాఖ అధికారుల సలహా మేరకు అవసరమైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండలాల్లో అధిక వర్షపాతం నమోదైన నేపథ్యంలో పంట నష్టంపై ప్రాథమిక అంచనాలు రూపొందించినట్లు బాబురావు తెలిపారు.

Also Read: రాజభవనం వదిలేసి రోడ్డుపైకి… మనసు ముక్కలైన వాళ్లకి మెడిసిన్ ఇచ్చే కొరియన్ డాక్టర్ కథ

Tags

Related News

తెలంగాణలో ఒకేషనల్ ట్రైనర్ల నిరసన కాక.. అడ్డుకున్న పోలీసులు!

పశువుల కొట్టం కంటే ఘోరం.. అమెరికాతో పోటీ అంటే ఇదేనా? మెడికోల సమ్మెకు హరీశ్ రావు సపోర్ట్!

పోలీస్​ కొలువుల కోసం.. ట్రాన్స్​ జెండర్లకు శిక్షణ!

మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి ప్రజలకు బిగ్ రిలీఫ్.. నీటి సరఫరా!

‘హిందూ కాలేజ్‌ను ప్రైవేటీకరిస్తే ఊరుకోం’.. కేంద్రానికి కవిత హెచ్చరిక!

కాంగ్రెస్ సంచుల పార్టీ.. బీజేపీ చెప్పుల పార్టీ.. కేటీఆర్ ఘాటు విమర్శలు!

నవ్వుతూ కస్టమర్‌గా వచ్చి 4 తులాల బంగారం లేపేశాడు.. కానీ చివరికి..?

Big Stories

Advertisement
×