Telugu Folk Singers Remuneration:ఒకప్పుడు పాటలంటే సినిమా పాటలే.జానపదాలు ఉన్నప్పటికీ అవన్నీ మారు మూల గ్రామాలకే పరిమితం.అడపాదడపా హిట్టయినా అవి సీడీలలో టౌన్ల వరకే.కానీ ట్రెండ్ మారింది.సోషల్ మీడియా పుణ్యమా అని ఇపుడు జాన పదం పట్టాభిషేకం చేసుకుంటుంది.ఆడియన్స్ కి అందునా ఫోక్ లవర్స్ కి కాస్త కనెక్ట్ అయితే చాలు మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంటుంది. ఇక ఈ పాటలు పాడిన సింగర్స్ కి కూడా క్రేజ్ ఇపుడు మాములుగా లేదు.మరి తమదైన గొంతుతో నెట్టింటిని షేక్ చేస్తున్న ఫోక్ సింగర్స్ ఎవరో వారి పారితోషికాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ఒకసారి చూసేద్దాం .
ఒక్కో పాటకి దాదాపుగా 4 లక్షల పైనే
ఫోక్ సింగర్ అనగానే మనకి టక్కున గుర్తొచ్చే పేరు మంగ్లీ. అటు సినిమాలలో రాములో రాములా అని పాడినా ,ఇటు బాయిలోనే పల్లి పలికే అంటూ ఆడినా అది మంగ్లీ కే సొంతం.ఒకరకంగా ప్రస్తుతం ఉన్న ఫోక్ ఇండస్ట్రీని తనదైన గొంతుతో ఈ క్రేజీ సింగర్ ఏలుతుందనే చెప్పాలి.
ముఖ్యంగా ఆడ నెమలి,లాయిరే లల్లాయిరే, జాలే జంగమయ్య, జాగో బంజారా లతో పాటు సింగిడి చినబోయినాది అమ్మని చూసి, ఆ రంగులు తడబడినాయి బొడ్డెమ్మని చూసి అంటూ ఎన్నో బతుకమ్మ పాటలని పాడి ఫోక్ ఇండస్ట్రీలో తనదైన స్టాంప్ వేసింది.ఇక ప్రస్తుతం మంగ్లీ పారితోషికం విషయానికి వస్తే అందరి కన్నా ఎక్కువగా ఒక్కో పాటకి దాదాపుగా 4 లక్షల పైనే తీసుకుంటుందని,సందర్భం బట్టి ఈ నెంబర్ అటు ఇటుగా మారుతుందని ఇన్ సైడ్ టాక్.మరి నిజమెంతో మంగ్లీ బయటపెడితే కాని తెలీదు.
డిమాండ్ ని బట్టి రెండు నుండి నాలుగు లక్షల వరకు
ఇక మంగ్లీ తర్వాత ఆ స్థాయిలో పారితోషికం తీసుకుంటున్న ఫోక్ సింగర్ గా మధు ప్రియనే చెప్పుకోవాలి. ఆడపిల్లనమ్మా నేను పాడుపిల్లనాని అంటూ చిన్నతనంలోనే ఫోక్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మధు పెద్దపులి ,వచ్చిందే, గోదారి గట్టు, జంగముడా,అరె జంగముడా ,బోర బండ మీద బోనాలంటా అంటూ ఎన్నో పాటలతో ఆడియన్స్ ని అలరించిన మధుప్రియ ప్రస్తుతం ఒక్కో పాటకి డిమాండ్ ని బట్టి రెండు నుండి నాలుగు లక్షల వరకు తీసుకుంటుందని సమాచారం.అయితే సోషల్ మీడియాలో వచ్చిన వార్తగానే చూడాలి.
దాదాపు 70 వేల నుండి లక్ష వరకు
ఇక బావా ఓ సారి రావా అంటూ అదరగొట్టిన మౌనిక యాదవ్ కి కూడా ఫోక్ ఇండస్ట్రీలో మంచి పేరే ఉంది. ముఖ్యంగా తను పాడిన మా గల్లిలో ఒక్కడు పోరడు పాట వచ్చిన నాలుగేళ్లల్లో ఏకంగా 100 మిలియన్ల వ్యూస్ ని కొల్లగొట్టడం విశేషం. ఇక పుష్ప సినిమాలో మౌనిక పాడిన సామీ నా సామీ పాట ఎంత ఫేమస్ అయిందో చెప్పక్కర్లేదు.ఇక ఈవిడ ఒక్కో పాటకి దాదాపు 70 వేల నుండి లక్ష వరకు తీసుకుంటుందని టాక్. అయితే సందర్భం బట్టి ఈ నెంబర్ కూడా అటు ఇటుగా మారుతుందని సమాచారం.
దాదాపు 50 వేల నుండి లక్ష వరకు
ఇక ఆడ నెమలి అంటూ అదరగొట్టిన కనకవ్వ , దారిపొంటొతుండు అంటూ సెన్సేషన్ క్రియేట్ చేసిన మామిడి మౌనిక, సిటీల సీరెలన్నడే..సిలకు రైకలన్నడే,నాయి దొరో ..నా సిన్ని దొర వంటి పాటలతో అలరించిన రేలారే అర్చన దాదాపు 50 వేల నుండి లక్ష వరకు అందుకుంటున్నారని ఇన్ సైడ్ టాక్.
స్వయంగా బయట పెడితే కాని తెలీదు .
ఇకపోతే అడవి తల్లి పాటతో లైమ్ లైట్ లోకి వచ్చిన కుమ్మరి దుర్గవ్వ, బావల్ల ,నా ముద్దు ముద్దు బావల్ల , ఏమే పిల్లా అన్నప్పుడల్లా అంటూ మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టిన దీకొండ శిరీష,తిన్నా తీరం పడతలే ,ఆనాడేమన్నంటినా వంటి పాటలు పాడిన లక్ష్మి, ప్రభ, అశ్వినీ రాథోడ్, కల్యాణి మాధురి వంటి ఫోక్ సింగర్స్ కూడా దాదాపు 50 వేల నుండి లక్ష వరకు తీసుకుంటున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .మరి వీటిలో నిజమెంతో స్వయంగా వీరే బయట పెడితే కాని తెలీదు .
ALSO READ:‘దారిపొంటొతుండు’తో సెన్సేషన్..మామిడి మౌనిక పాటకు రూ.లక్షల్లో పారితోషికమా?