E-Paper
Advertisement

ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఐ సపోర్ట్ వారికే.. క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని..?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఐ సపోర్ట్ వారికే.. క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని..?
Advertisement

CPI Support: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని సీపీఐ నిర్ణయించినట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రాంరెడ్డి సర్వోత్తమరెడ్డికి, హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సామా రాంమోహన్‌రెడ్డికి మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్‌ నాయకులు తమ పార్టీ కార్యాలయానికి వచ్చి మద్దతు కోరారని, పార్టీ అంతర్గత చర్చలు, రాజకీయ పరిస్థితులను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

పార్టీ నిర్ణయం..

ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న తమ పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూంభవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చి రైతాంగం సంక్షోభంలో చిక్కుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువు అంచనాలు, సహాయక చర్యల విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష పార్టీలను కేంద్ర వద్దకు తీసుకెళ్లాలని అన్నారు. కరువు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో సీపీఐ బృందాలు తప్ప ఇప్పటీ వరకు ఏ ఒక్కరూ కూడ సందర్శించకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎకరాకు రూ.50 వేలు..

Advertisement

వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం ఇప్పటికే 12.5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో రైతులు అసలు పంటలే వేయలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. కరువు ప్రభావం పంటలు వేసిన రైతులకే పరిమితం కాదని, సాగు చేయలేకపోయిన రైతులు, వ్యవసాయ కూలీలు, పేద కుటుంబాలనూ ఆదుకునే సమగ్ర సహాయక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. పంటలు నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. వరి పంటకు ఎకరాకు రూ.30 వేలు, పత్తి సహా ఇతర వాణిజ్య పంటలకు ఎకరాకు రూ.50 వేల చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరిన రూ.25 వేల కోట్ల కరువు సహాయక నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Also Read: ఏపీలో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల పోలింగ్ వాయిదా!

నెలకు రూ.10 వేలు..

Advertisement

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు సమకూర్చి రైతులను ఆదుకోవాలన్నారు.వర్షాభావం, నీటి కొరత కారణంగా సాగు చేయలేక పంటలు వేయని రైతులకు కూడా ఎకరాకు రూ.10 వేల చొప్పున కరువు సబ్సిడీ ఇవ్వాలని కోరారు. కరువు ప్రభావంతో ఉపాధి కోల్పోయిన పేద కుటుంబాలకు ఐదు నుంచి ఆరు నెలల పాటు నెలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక భృతి అందించాలని డిమాండ్‌ చేశారు. పశుగ్రాసం, ఆహార ధాన్యాలు, 14 రకాల నిత్యావసర సరుకులను చౌక దుకాణాల ద్వారా తక్షణమే పంపిణీ చేయాలన్నారు. బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలన్నారు. రాష్ట్రంలో పంటల బీమా అమల్లో లేకపోవడం రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించిందని అన్నారు.

పెద్దఎత్తున ధర్నాలు..

బీమా పథకం అందుబాటులో ఉంటే కొంతమేర రైతులకు పరిహారం లభించేదని పేర్కొన్నారు. పంటల బీమా అమలు బాధ్యత నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకోలేదన్నారు.కరువు సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 10న అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్నాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కరువు బాధితులకు న్యాయం జరిగే వరకు ఈ కార్యక్రమాలను నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని తెలిపారు.కరువు, రైతాంగ సమస్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ.టి.నరసింహా, కార్యదర్శివర్గ సభ్యుడు వి.ఎస్‌.బోస్‌, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాగం హేమంతరావు, ప్రధాన కార్యదర్శి పశ్యపద్మపాల్గొన్నారు.

Also read: తెలంగాణలో ఒకేషనల్ ట్రైనర్ల నిరసన కాక.. అడ్డుకున్న పోలీసులు!

Tags

Related News

ఖమ్మం జిల్లా బేతుపల్లి చెరువులో SDRF బోట్ల ప్రమాదం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ!

ప్రభుత్వ బడి పిల్లలకు.. సీఎం రేవంత్ రెడ్డి భారీ గుడ్ న్యూస్!

తెలంగాణలో ఒకేషనల్ ట్రైనర్ల నిరసన కాక.. అడ్డుకున్న పోలీసులు!

పశువుల కొట్టం కంటే ఘోరం.. అమెరికాతో పోటీ అంటే ఇదేనా? మెడికోల సమ్మెకు హరీశ్ రావు సపోర్ట్!

పోలీస్​ కొలువుల కోసం.. ట్రాన్స్​ జెండర్లకు శిక్షణ!

మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి ప్రజలకు బిగ్ రిలీఫ్.. నీటి సరఫరా!

‘హిందూ కాలేజ్‌ను ప్రైవేటీకరిస్తే ఊరుకోం’.. కేంద్రానికి కవిత హెచ్చరిక!

Big Stories

Advertisement
×