E-Paper
Advertisement

తెలంగాణలో ఒకేషనల్ ట్రైనర్ల నిరసన కాక.. అడ్డుకున్న పోలీసులు!

తెలంగాణలో ఒకేషనల్ ట్రైనర్ల నిరసన కాక.. అడ్డుకున్న పోలీసులు!
Advertisement

Vocational Trainers: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో పనిచేస్తున్న వొకేషనల్ ట్రైనర్లు(వృత్తి విద్యా శిక్షకులు) తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. 10 నెలలుగా జీతాలు రాకపోవడంతో వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. ఈ సుదీర్ఘ పెండింగ్ సమస్యలను పరిష్కరించి, తక్షణమే తమను ఆదుకోవాలని కోరుతూ తెలంగాణ వొకేషనల్ ట్రైనర్స్ అసోసియేషన్(టీవీటీఏ) ప్రతినిధులు బుధవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ నవీన్ నికోలస్ కు బుధవారం వినతిపత్రాన్ని సమర్పించారు.

వొకేషనల్ ట్రైనర్లు..

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మోడల్ స్కూళ్లు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, గురుకుల సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న వొకేషనల్ ట్రైనర్లు ఎదుర్కొంటున్న నరకయాతనను ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వొకేషనల్ ట్రైనర్లందరికీ గత 10 నెలలుగా నిలిచిపోయిన పెండింగ్ వేతనాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ గా పేర్కొన్నారు. అలాగే ప్రతి నెల 1వ తేదీనే వేతనం చెల్లించాలని, ఆర్థిక భద్రత, ఉద్యోగ నిరంతరాయతను కల్పిస్తూ ఏడాదికి 12 నెలల పాటు పూర్తి వేతనం అందించే వ్యవస్థను అమలు చేయాలని వారు కోరారు.

Advertisement

Also Read: ఏడుగురు రాజకుమారులు… ఒక్కోరికీ ఒక్కో శక్తి… యానిమే లవర్స్ కు ఫుల్ మీల్స్

ఆవేదన వ్యక్తం.. 

ట్రైనర్లకు ప్రస్తుతం ఉన్న క్యాజువల్ లీవ్ సంఖ్యను పెంచాలని కోరారు. మహిళా వొకేషనల్ ట్రైనర్లకు ఉద్యోగ సంక్షేమ చర్యల్లో భాగంగా వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను మంజూరు చేయాలని డిమాండ్ గా పెట్టుకున్నారు. ప్రభుత్వ, వసతి విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించడంలో, వారిని కెరీర్ పరంగా సమున్నతంగా తీర్చిదిద్దడంలో తాము ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నామని ట్రైనర్లు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. విద్యావ్యవస్థను బలోపేతం చేస్తున్న తమపై అధికారులు మానవీయ కోణంలో ఆలోచించాలన్నారు. సకాలంలో జీతాలు ఇవ్వడం, కనీస సేవా ప్రయోజనాలు కల్పించడం వల్లనే తాము నిశ్చింతగా, పూర్తి నిబద్ధతతో విధులు నిర్వహించగలమని పేర్కొన్నారు.

పరిష్కార మార్గాలు..

Advertisement

తమ సుదీర్ఘ కాలపు సమస్యలను సానుభూతితో పరిశీలించి, త్వరితగతిన పరిష్కార మార్గాలు చూపాలని, తద్వారా తమ కుటుంబాలను ఆదుకోవాలని సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్‌ను అసోసియేషన్ ప్రతినిధులు అభ్యర్థించారు. ఇదిలాఉండగా తొలుత స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ఎదుట వొకేషనల్ ట్రైనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ధర్నా చేపట్టారు. ఆపై సెక్రటరియట్ వైపు ర్యాలీగా వెళ్తుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు అక్కడే.. ఫుట్ పాత్ పై కూర్చుని నిరసన తెలిపారు.

Also Read: కాంగ్రెస్ సంచుల పార్టీ.. బీజేపీ చెప్పుల పార్టీ.. కేటీఆర్ ఘాటు విమర్శలు!

Tags

Related News

ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఐ సపోర్ట్ వారికే.. క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని..?

పశువుల కొట్టం కంటే ఘోరం.. అమెరికాతో పోటీ అంటే ఇదేనా? మెడికోల సమ్మెకు హరీశ్ రావు సపోర్ట్!

పోలీస్​ కొలువుల కోసం.. ట్రాన్స్​ జెండర్లకు శిక్షణ!

మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి ప్రజలకు బిగ్ రిలీఫ్.. నీటి సరఫరా!

‘హిందూ కాలేజ్‌ను ప్రైవేటీకరిస్తే ఊరుకోం’.. కేంద్రానికి కవిత హెచ్చరిక!

తెలంగాణలో మురసు తుఫాను ఎఫెక్ట్.. భారీగా దెబ్బతిన్న వరి పంటలు!

కాంగ్రెస్ సంచుల పార్టీ.. బీజేపీ చెప్పుల పార్టీ.. కేటీఆర్ ఘాటు విమర్శలు!

Big Stories

Advertisement
×