E-Paper
Advertisement

మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి ప్రజలకు బిగ్ రిలీఫ్.. నీటి సరఫరా!

మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి ప్రజలకు బిగ్ రిలీఫ్.. నీటి సరఫరా!
Advertisement

Water Tankers: వాటర్ ట్యాంకర్ల యజమానులు సమ్మెను బుధవారం రాత్రి విరమించారు. తక్షణమే నీటి సరఫరా పునరుద్ధరణకు అంగీకరించారు. బుధవారం హైడ్రా కార్యాలయంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తో వాటర్ ట్యాంకర్ల యజమానులు నిర్వహించిన సమావేశం సఫలీకృతమైంది. వాటర్ ట్యాంకర్ల యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలు చర్చించారు. కమిషనర్ సూచనల మేరకు సమ్మె విరమణ చేయాలని నిర్ణయించారు. ఔటర్ రింగు రోడ్డు అవతల నుంచి నీటిని తోడి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు యజమానులు అంగీకరించారు. దీంతో గత రెండు రోజులుగా కొనసాగుతున్న సమ్మెకు బ్రేక్ పడింది. తక్షణమే నీటి ట్యాంకర్ల సరఫరాలను పునరుద్ధరించాలని నిర్ణయించింది. హైదరాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ సూచన మేరకు వాటర్ ట్యాంకర్స్ యజమానుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌ నేతృత్వంలో ప్రతినిధులు బుధవారం మధ్యాహ్నం హైడ్రా కార్యాలయంలో కమిషనర్‌ రంగనాథ్‌ని కలిసి తమ సమస్యలపై చర్చించారు.

ప్యూర్ ప్రాంతం నుంచి సరఫరా..

సంబంధిత శాఖల నుంచి అవసరమైన అనుమతులు పొందిన తర్వాత పెరీ అర్బన్ రీజియన్ (ప్యూర్) ప్రాంతం నుంచే బోరు నీటిని సేకరించి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు సంఘం సభ్యులు అంగీకరించారు. ఇకపై తమ ట్యాంకర్‌ వ్యాపార కార్యకలాపాలన్నీ ప్యూర్ ప్రాంతం నుంచే నిర్వహిస్తామని వాటర్ ట్యాంకర్ల యజమానులు తెలిపారు. హైదరాబాద్‌ నగరం అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతం కావడంతో పాటు ఎల్‌నినో ప్రభావం, తగినంత వర్షపాతం లేకపోవడం వంటి కారణాలతో భూగర్భ జలమట్టాలు గణనీయంగా పడిపోయాయి. ఈ పరిస్థితుల్లో నగరంలోని జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాణిజ్య అవసరాల కోసం పెద్ద ఎత్తున భూగర్భ జలాలను తోడటం వల్ల స్థానికులు గృహ అవసరాలకు వినియోగించే బోర్లు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది.

వెయ్యి నుంచి 1500 అడుగులు..

Advertisement

మాదాపూర్‌, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, అమీర్‌పేట, అశోక్‌నగర్‌ వంటి ప్రాంతాల్లో నీటికి డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో ట్యాంకర్ల నిర్వాహకులు రవాణా దూరం, ఇంధన ఖర్చులను తగ్గించుకునేందుకు ఆయా ప్రాంతాలకు సమీపంలోని బోర్ల నుంచి నీటిని సేకరిస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతోంది. సాధారణంగా గృహ అవసరాల కోసం వేసే బోర్లు 100 నుంచి 300 అడుగుల లోతు వరకు ఉండగా, వాణిజ్య అవసరాల కోసం కొందరు ఏకంగా వెయ్యి నుంచి 1500 అడుగులు లేదా అంతకంటే ఎక్కువ లోతులో బోర్లు వేసి, అధిక సామర్థ్యం కలిగిన మోటార్లతో నీటిని తోడుతున్నారు. దీనివల్ల భూగర్భ జలాలపై మరింత ప్రభావం పడుతుందని హైడ్రా కమిషనర్ వాటర్ ట్యాంకర్స్ యజమానులకు వివరించారు.

Also Read: రామాయణ సినిమాకు దిల్ రాజు రివ్యూ.. ఆ పాత్ర పై ప్రశంసలు!

స్థానికుల నిరసనలు, ఫిర్యాదులు..

Advertisement

ఈ సమస్యపై పలు కాలనీల సంక్షేమ సంఘాలు, స్థానిక ప్రజల నుంచి హైడ్రాకు ఫిర్యాదులందాయి. తెల్లాపూర్‌ ప్రాంతంలో వాణిజ్య అవసరాల కోసం నీటిని తోడటాన్ని నిలిపి వేయాలని స్థానికులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. సూరారం, జీడిమెట్ల ప్రాంతాల ప్రజలు తమ ఇళ్లలోని బోర్లలో నీరు అడుగంటిపోతుందని హైడ్రా కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశారు. ప్రజల ఫిర్యాదులపై స్పందించిన హైడ్రా రెవెన్యూ, పోలీసు, మున్సిపల్‌, భూగర్భ జలాల శాఖల సమన్వయంతో చర్యలు చేపట్టింది.

నీటికి డిమాండ్‌..

చెరువుల నుంచి వాణిజ్య అవసరాల కోసం నీటిని తోడుతున్న బోర్లను గుర్తించి తొలగించే చర్యలు కూడా చేపట్టింది. నగరంలోని జనసాంద్రత అధికంగా ఉన్న, నీటి డిమాండ్‌ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో భూగర్భ జలాలను పెద్ద ఎత్తున వాణిజ్య అవసరాలకు వినియోగించకుండా నియంత్రించేందుకు వాటర్‌ బోర్డు, రెవెన్యూ, పోలీసు తదితర శాఖలతో కలిసి హైడ్రా సమన్వయంతో పని చేసిందని హైడ్రా కమిషనర్ రంగనాధ్ తెలిపారు. అదే సమయంలో వాణిజ్య సంస్థలకు నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటూ, ప్రజల గృహ అవసరాలకు నీటి లభ్యతను కాపాడేందుకు కృషి చేయనున్నట్లు కమిషనర్ స్పష్టం చేశారు.

Also Read: ఏడుగురు రాజకుమారులు… ఒక్కోరికీ ఒక్కో శక్తి… యానిమే లవర్స్ కు ఫుల్ మీల్స్

Tags

Related News

పశువుల కొట్టం కంటే ఘోరం.. అమెరికాతో పోటీ అంటే ఇదేనా? మెడికోల సమ్మెకు హరీశ్ రావు సపోర్ట్!

పోలీస్​ కొలువుల కోసం.. ట్రాన్స్​ జెండర్లకు శిక్షణ!

‘హిందూ కాలేజ్‌ను ప్రైవేటీకరిస్తే ఊరుకోం’.. కేంద్రానికి కవిత హెచ్చరిక!

తెలంగాణలో మురసు తుఫాను ఎఫెక్ట్.. భారీగా దెబ్బతిన్న వరి పంటలు!

కాంగ్రెస్ సంచుల పార్టీ.. బీజేపీ చెప్పుల పార్టీ.. కేటీఆర్ ఘాటు విమర్శలు!

నవ్వుతూ కస్టమర్‌గా వచ్చి 4 తులాల బంగారం లేపేశాడు.. కానీ చివరికి..?

రూ. 400 కోట్ల ‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్.. ఈడీ ఎంట్రీతో సైబర్ కేటుగాళ్ల గుట్టురట్టు!

Big Stories

Advertisement
×