Singer Jhansi: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న వారిలో సింగర్ ఝాన్సీ (Singer Jhansi)ఒకరు. ఈమె అగ్ని పరీక్ష ద్వారా కామన్ మ్యాన్ క్యాటగిరిలో భాగంగా టికెట్టు టు బిగ్ బాస్ కైవసం చేసుకుని నేరుగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు. అగ్ని పరీక్షలో అలాగే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు ఝాన్సీ ఆడిన ఆట తీరు చూస్తే ఈమె కచ్చితంగా టాప్ ఫైవ్ కంటెంట్ గా కొనసాగుతుందని అందరూ భావించారు. అయితే ఝాన్సీ హౌస్ లో ఉన్నన్ని రోజులు సింపతి కార్డ్ ప్లేస్ చేసిందని విమర్శలు కూడా వచ్చాయి.
బిగ్ బాస్ హౌస్లో ఝాన్సీ రైతు బిడ్డ అంటూ డ్రామా ప్లే చేసిందని, ఈమె గుంట నక్క అంటూ ఎన్నో రకాల విమర్శలు చేశారు. అయితే 8 వారాలపాటు హౌస్ లో కొనసాగిన ఝాన్సీ ఎనిమిదవ వారం హౌస్ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలుస్తుంది. ఇలా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన ఈమె వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా సోషల్ మీడియాలో తన గురించి వచ్చిన విమర్శలపై కాస్త ఘాటుగా స్పందిస్తూ తనదైన శైలిలోనే వార్నింగ్ ఇచ్చారు. తన గురించి సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలు చూసి మా అమ్మ చాలా బాధపడిందని అనవసరంగా నా బిడ్డను లోపలికి పంపించాను ఇన్ని మాటలు పడాల్సి వస్తుందని అమ్మ బాధపడినట్లు ఝాన్సీ తెలిపారు.
ఇలా తన గురించి విమర్శలు చేసిన వారికి తాను ఒక విషయం మాత్రమే చెబుతున్నాను దయచేసి ఒక వ్యక్తిని విమర్శించే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. ప్రతి ఇంట్లో కూడా అమ్మాయిలు ఉంటారు అమ్మాయిలను ఏదైనా అనే ముందు ఆలోచించండి వారికంటూ కొంచమైన విలువ ఇవ్వండి. అందరూ వాళ్ల గురించి ఏం మాట్లాడినా తీసుకునే కెపాసిటీ ఉండదు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. నేను కూడా ఇలాంటి నెగెటివిటీని ఈజీగా తీసుకోలేను కానీ ఇప్పుడు మాత్రం నెగిటివ్ కామెంట్లు చూసి నా గుండె రాయి అయిపోయిందని తెలిపారు.
ఇక నేను ఎక్కడ ఎలాంటి డ్రామాలు ప్లే చేయలేదు నేను నాలాగే ఉన్నాను. ఎవరు ఏమనుకున్నా నేను ఇలాగే ఉంటాను. నన్ను విమర్శలు చేసిన వారు వారి జీవితంలో నన్ను మించి ఎదగలేరు. ఇక నన్ను ముంచి ఎదగాలనుకునే వారికి ఏదో ఒక రూపంలో కర్మ రిటన్ గిఫ్ట్ ఇస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. తాను ఎవరిని ముంచి ఎదగలేదు, ఎదగను కూడా నేను నా కష్టాన్ని మాత్రమే నమ్ముకుంటానని ఈ సందర్భంగా ఝాన్సీ ట్రోలర్స్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు . ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె బిగ్ బాస్ హౌస్ లో 8 వారాల పాటు కొనసాగి ఎనిమిదవ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.
Also Read; తమిళ సినిమాల వెంటపడుతున్న నాగవంశీ.. జైలర్ 2 తరువాత మరో మూవీ రిలీజ్ కు సిద్ధం!