E-Paper
Advertisement

Harish Rao: కృష్ణా జలాలపై కుట్ర.. కేఆర్ఎంబీ నిధుల మళ్లింపును చూస్తూ ఊరుకుంటారా? టెలిమెట్రీల ఏర్పాటుపై హరీష్ రావు ఫైర్

Harish Rao: కృష్ణా జలాలపై కుట్ర.. కేఆర్ఎంబీ నిధుల మళ్లింపును చూస్తూ ఊరుకుంటారా? టెలిమెట్రీల ఏర్పాటుపై హరీష్ రావు ఫైర్
Advertisement

Harish Rao: కృష్ణా జలాల విషయంలో తెలంగాణ హక్కులను కాపాడాల్సిన బాధ్యతను విస్మరించి, రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల గొంతు ఎండిపోతుంటే, ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. కృష్ణా జలాల వినియోగ లెక్కలు తేల్చేందుకు అత్యంత కీలకమైన ‘టెలిమెట్రీ’ ల ఏర్పాటులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఆయన ఎండగట్టారు.

కృష్ణా నది జలాల వాటాల లెక్కలు తేల్చడానికి టెలిమెట్రీ పరికరాలు కొనుగోలు చేసేందుకు కేటాయించిన రూ. 4.18 కోట్ల నిధులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) దారి మళ్లిస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం మౌనంగా ఉండటం సిగ్గుచేటని హరీష్ రావు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులు పక్కదారి పడుతున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. టెలిమెట్రీల ఏర్పాటును ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తూ, పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ అక్రమ నీటి వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.

Advertisement

జూన్ 2016లో జరిగిన కేఆర్ఎంబీ సమావేశ నిర్ణయం ప్రకారం.. మొదటి దశలో 18 చోట్ల టెలిమెట్రీలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కానీ, రెండో దశలో మరో 9 చోట్ల ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఆ ఊసే లేకపోవడం దురదృష్టకరమన్నారు. కేఆర్ఎంబీ నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం ధిక్కరిస్తూ నిధులు ఇవ్వకపోయినా, తెలంగాణ ప్రభుత్వం ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. ఏపీపై ఒత్తిడి తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.

కోర్టు పరిధిలో అంశాలు ఉన్నాయని కేంద్రం సాకులు చెప్పడాన్ని హరీష్ రావు తప్పుబట్టారు. సుప్రీంకోర్టులో కేసులు ఉన్నప్పుడే కేసీఆర్ ప్రభుత్వం చొరవ తీసుకుని 18 చోట్ల టెలిమెట్రీలు ఏర్పాటు చేసిన విషయం గుర్తు లేదా అని నిలదీశారు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు, కేంద్రంలోని బీజేపీ కలిసి నాటకాలాడటం వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. కేవలం లేఖలు రాస్తూ కాలయాపన చేయకుండా, నిధులు మళ్లించిన కేఆర్ఎంబీపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని, రూ. 4.18 కోట్లను వెంటనే రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.

అసలు ‘టెలిమెట్రీ’ (Telemetry) అంటే ఏమిటి?

Advertisement

నదీ జలాల పంపిణీలో పారదర్శకత కోసం వాడే సాంకేతిక పరిజ్ఞానమే ‘టెలిమెట్రీ’. నదులు, కాలువలు, రిజర్వాయర్ల వద్ద నీటి ప్రవాహాన్ని , నీటి మట్టాన్ని కచ్చితంగా కొలిచేందుకు ఎలక్ట్రానిక్ సెన్సార్లతో కూడిన పరికరాలను ఏర్పాటు చేస్తారు. ఇవి ఆటోమేటిక్‌గా నీటి వినియోగం తాలూకు డేటాను రికార్డు చేసి, శాటిలైట్ లేదా ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థల ద్వారా  కంట్రోల్ రూమ్ కి పంపిస్తాయి.

దీనివల్ల ఏ రాష్ట్రం, ఏ సమయంలో, ఎంత నీటిని వాడుకుందనే విషయం ఎప్పటికప్పుడు కచ్చితంగా తెలుస్తుంది. మనుషులు వెళ్లి కొలిచే పని ఉండదు కాబట్టి, రీడింగ్స్ మార్చడానికి లేదా అబద్ధాలు చెప్పడానికి ఆస్కారం ఉండదు. తెలంగాణ, ఏపీ మధ్య నీటి గొడవలు తగ్గాలంటే ఈ టెలిమెట్రీ వ్యవస్థ అత్యంత కీల‌కంగా మార‌నుంది.

Read Also: Revanth Reddy: 12 వేల గ్రామాల్లో తీర్మానాలు.. కేంద్రానికి షాక్ ఇవ్వనున్న రేవంత్ సర్కార్!

Related News

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

Big Stories

Advertisement
×