E-Paper
Advertisement

తలవంచి తిరిగి వస్తారా.. లేక ప్రధానిని నిలదీస్తారా.. సీఎం రేవంత్ పై హరీష్ రావు ఫైర్!

తలవంచి తిరిగి వస్తారా.. లేక ప్రధానిని నిలదీస్తారా.. సీఎం రేవంత్ పై హరీష్ రావు ఫైర్!
Advertisement

Telangana Water: స్వేచ్చ బ్యూరో: తెలంగాణ నీటి ప్రయోజనాలను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైతే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని, తెలంగాణ హక్కులను కాలరాసే కుట్రలను ప్రజాక్షేత్రంలో ఎండగడతాం.. రాష్ట్ర ప్రయోజనాల కోసం మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం..తెలంగాణ నీటి హక్కులను కాపాడుతాం అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.ఢిల్లీకి ఈనెల 15న వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ నీటి ప్రయోజనాలపై ప్రధాని మోడీని నిలదీస్తారా? లేక తలవంచి మౌనంగా తిరిగి వస్తారా? అని ప్రశ్నించారు. శనివారం మీడియా ప్రకటన విడుదల చేశారు.

కేంద్ర ప్రభుత్వ వివక్ష..

నీటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, కేంద్ర ప్రభుత్వ వివక్ష వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతున్నదన్నారు. తెలంగాణకు చట్టబద్ధంగా దక్కాల్సిన 968 టీఎంసీల గోదావరి జలాల వినియోగానికి సంబంధించిన అన్ని ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు సాధిస్తామని ప్రధాని వద్ద స్పష్టమైన హామీ తీసుకోవాలనీ డిమాండ్ చేశారు. 47 టీఎంసీల జలాల హైడ్రాలజీ క్లియరెన్స్ ఇప్పటికే పూర్తయిన సమ్మక్క–సారక్క ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్ర జల సంఘం కొత్త మార్గదర్శకాల పేరుతో వెనక్కి పంపడం దారుణం అన్నారు.

ఎంతవరకు సమంజసం?

Advertisement

ఇప్పటికే ఆమోద ప్రక్రియలో ఉన్న డీపీఆర్‌కు కొత్త మార్గదర్శకాలను వర్తింపజేయడం ఎంతవరకు సమంజసం? హైడ్రాలజీ సహా కీలక విభాగాల పరిశీలన పూర్తయిన తర్వాత డీపీఆర్‌ను వెనక్కి పంపడం తెలంగాణ ప్రయోజనాలపై గొడ్డలిపెట్టు అన్నారు. సమ్మక్క–సారక్క ప్రాజెక్టుకు కేవలం టీఏసీ అనుమతి మాత్రమే రావాల్సి ఉందని, అలాంటి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేని అసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వానిదని, కేంద్రం వద్ద తెలంగాణ వాదనను బలంగా వినిపించే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేక పోవడం సిగ్గుచేటు అన్నారు.

Also read: 60 రోజుల టికెట్ బుకింగ్‌ రూల్ మారనుందా? రైల్వే కొత్త ప్లాన్ ఇదే!

తెలంగాణకు 50 శాతం

Advertisement

గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీపడకుండా స్పష్టమైన వైఖరి తీసుకుందని, 968 టీఎంసీల గోదావరి జలాలపై తెలంగాణ ప్రాజెక్టులన్నింటికీ ముందుగా కేంద్రం అనుమతులు ఇవ్వాలి, ఆ తర్వాతే నదుల అనుసంధాన ప్రాజెక్టును చేపట్టాలని డిమాండ్ చేసిందన్నారు. గోదావరి నుంచి కావేరికి తరలించే 148 టీఎంసీల్లో తెలంగాణకు 50 శాతం అంటే 75 టీఎంసీలు కేటాయించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టుబట్టిందన్నారు. ఇచ్చంపల్లి నుంచే ఈ ప్రాజెక్టు చేపట్టాలని, తెలంగాణ భూభాగం మీదుగా అలైన్‌మెంట్ ఉండాలని స్పష్టం చేసిందని, మన డిమాండ్లను సానుకూలంగా పరిశీలిస్తామని కేంద్ర టాస్క్‌ఫోర్స్ సైతం హామీ ఇచ్చిందన్నారు.

బనకచర్లకు ప్రాజెక్టు..

తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకే ఎన్డబ్ల్యూడీఏ ఇచ్చంపల్లి నుంచి గ్రాండ్ అనికట్ వరకు డీపీఆర్ రూపొందించి సంబంధిత రాష్ట్రాలకు పంపిణీ చేసిందన్నారు. అందులో నుంచి కీలకమైన మూడు రాష్ట్రాల తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక నుండి అనుమతులు కూడా వచ్చాయి. కేవలం చంద్రబాబు ఒత్తిడికి తలొగ్గి ఆర్థికంగా వయబుల్ కానీ, ఏపీ మినహా ఇతర రాష్ట్రాలకు ప్రయోజనం లేని ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. పోలవరం నుంచి బనకచర్లకు ప్రాజెక్టు అలైన్‌మెంట్‌ను మార్చారన్నారు. తెలంగాణకు చెందాల్సిన జలాలను లేకుండా చేస్తూ, తెలంగాణకు సంబంధించిన జాతీయ ప్రాజెక్టును పూర్తిగా పక్కనపెట్టి ఏపీకి అనుకూలంగా మార్చే కుట్రను సహించేది లేదని హెచ్చరించారు. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి చంద్రబాబు చెప్పినట్లు తలూపితే సీఎం, ఉత్తమ్ కుమార్ రెడ్డి చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు.

సమ్మక్క–సారక్క ప్రాజెక్టు..

తెలంగాణకు హామీగా ఉన్న 968 టీఎంసీల గోదావరి జలాల వినియోగానికి సంబంధించిన అన్ని ప్రాజెక్టులకు తక్షణమే కేంద్ర అనుమతులు సాధించాలన్నారు. పాత మార్గదర్శకాల ప్రకారమే సమ్మక్క–సారక్క ప్రాజెక్టు డీపీఆర్‌ను ఆమోదించి, వెంటనే టీఏసీ అనుమతి ఇప్పించాలని, గోదావరి–కావేరి అనుసంధాన ప్రాజెక్టును ఇచ్చంపల్లి నుంచే చేపట్టాలని,ఈ ప్రాజెక్టులో తెలంగాణకు 148 టీఎంసీల్లో 75 టీఎంసీల వాటా కేటాయించాలని,తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించే పోలవరం–బనకచర్ల అలైన్‌మెంట్‌ను తీవ్రంగా వ్యతిరేకించాలని, తెలంగాణకు సంబంధించిన ఈ కీలక అంశాలను ప్రధాని ముందు ప్రస్తావించకుండా, కేంద్రం నుంచి స్పష్టమైన హామీలు తీసుకురాకుండా వస్తే ఢిల్లీ పర్యటన అర్థరహితం అవుతుందన్నారు.

Also read: 60 రోజుల టికెట్ బుకింగ్‌ రూల్ మారనుందా? రైల్వే కొత్త ప్లాన్ ఇదే!

Tags

Related News

రియల్టర్​ హత్యకు 10లక్షల సుపారీ.. ఏడుగురు అరెస్ట్!

ఇంటిపై రెండు నిమిషాల పాటు డ్రోన్ కలకలం.. ప్రభుత్వానికి కవిత సూటి ప్రశ్నలు!

హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ గుర్తింపు.. PHFI క్యాంపస్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

భద్రాద్రి కొత్తగూడెం వాసులకు గుడ్ న్యూస్.. ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్!

తెలంగాణ కాంగ్రెస్‌కు.. కొత్త ఇన్‌ఛార్జ్‌ నియమించిన ఏఐసీసీ!

తెలంగాణలో రచ్చ రేపుతున్న కవిత పాలిటిక్స్.. సైలెంట్ మోడ్‌లో కేటీర్, హరీష్ రావు!

మమ్మల్ని ఆపడం ఎవరి తరమూ కాదు.. భారత్ సమ్మిట్‌లో రేవంత్ ధీమా

Big Stories

Advertisement
×