BM Sandeep: తెలంగాణ రాష్ట్ర నూతన ఇన్ ఛార్జ్‌గా బీ ఎం సందీప్‌ని ఏఐసిసి నియమించింది. దీంతో మీనాక్షి నటరాజన్ స్థానంలో సందీప్ ని నియమించినట్టు ఏఐసీసీ స్పష్టం చేసింది.
తెలంగాణ రాష్ట్ర నూతన ఏఐసీసీ బి.ఎం. సందీప్ కుమార్ రాజకీయ ప్రస్థానం కర్ణాటక రాష్ట్రం చిక్కమగళూరు ప్రాంతానికి చెందిన బి.ఎం. సందీప్ కుమార్ చెందిన వ్యక్తి. ఈయన కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత విభాగం నుంచి అంచెలంచెలుగా ఎదిగిన నేతగా గుర్తింపు పోందారు. దీంతో పాటుగా గతంలో ఇండియన్ యూత్ కాంగ్రెస్‌లో కీలక బాధ్యతలు నిర్వహణ చేసినట్టు సమాచారం.
ఇక రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ (RGPRS)లో జాతీయ కన్వీనర్‌గా సందీప్ పనిచేసారు. కర్ణాటక రాష్ట్ర కన్వీనర్‌గా కూడా పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో సంస్థాగత బాధ్యతలు చేపట్టిన నేతగా గుర్తింపుతో పాటు ప్రస్తుతం ఏఐసీసీ కార్యదర్శిగా మహారాష్ట్ర రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు స్వీకరించారు. దీంతో కేరళ రాష్ట్రానికి కూడా అదనపు ఏఐసీసీ కార్యదర్శి బాధ్యతలను కాంగ్రెస్ అదిష్టానం అప్పగించింది. యువజన కాంగ్రెస్ నుంచి ఏఐసీసీ స్థాయి వరకు రాజకీయ ప్రస్థానంలో ఆయన ఏంతో అనుబవమున్న వ్యక్తిగా పేరుంది.
Also Read: గిరిబాబు పై సీనియర్ ఎన్టీఆర్ కి కోపం తెప్పించిన మూవీ.. ఏదో.. ఎందుకో తెలుసా?