Kavitha Drone: స్వేచ్ఛ బ్యూరో: ప్రజల భద్రతకు భరోసా ఇవ్వడం ప్రభుత్వ భాద్యత అని తెలంగాణ రక్షణసేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఎక్స్ వేదికగా శనివారం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టీఆర్ఎస్ కార్యాలయం, తన ఇంటిపైనుంచి ఒక అనుమానాస్పద డ్రోన్ ఎగిరిన ఘటన ప్రభుత్వం తెలియదని అనడం సమంజసం కాదన్నారు. సీఎం సమాచారం లేదని ఒక్కమాటతో చేతులు దులుపుకోవడం భాద్యతా రాహిత్యం అవుతుందన్నారు.
పోలీసు లేదా విమానయాన శాఖల నుంచి అవసరమైన అనుమతులతోనే ఈ డ్రోన్‌ను నడిపారా? ఎలాంటి సర్వే లైసెన్స్ తీసుకున్నారు? ఆ డ్రోన్ ఐపీ చిరునామా, గుర్తింపు సంఖ్య మరియు రిజిస్టర్డ్ ఆపరేటర్ ఎవరు? ఆ డ్రోన్ దాదాపు రెండు నిమిషాల పాటు అలాగే నిలిచిపోయినట్లు వీడియో ఆధారాలున్నాయి. ఆ డ్రోన్ ఏం రికార్డు చేసింది.. ఎలాంటి ఫుటేజ్ క్యాప్చర్ కోసం దానిని వాడారు? ఒకవేళ ఆ డ్రోన్‌ను పోలీసులు నడిపితే, ఏ ప్రయోజనం కోసం దానిని మోహరించారు, ఎవరి ఆదేశాల మేరకు నడిపారు? ఈ డ్రోన్ ఆపరేషన్ వెనుక బీఆర్ఎస్ ఉందని సీఎం ఆరోపిస్తున్నారు. దానికి ఏ ఆధారాలు ఉన్నాయి? మేము ఇప్పటికే ఈ ఘటనపై ఫిర్యాదు చేశాం. ఆ డ్రోన్, దాని దాన్ని నడిపిన వారు, ఈ ఆపరేషన్ ఉద్దేశాన్ని గుర్తించడానికి ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారు? ఇవి కేవలం రాజకీయ ప్రశ్నలు మాత్రమే కావు. ఇవి నిఘా, ప్రైవసీ, పోలీసుల జవాబుదారీతనం, ప్రజా భద్రతకు సంబంధించినవి అని పేర్కొన్నారు.
ఆరోపణ ఎవరు చేస్తున్నారనేది ఇక్కడ ముఖ్యం కాదు. డ్రోన్‌ను ఎవరు నడిపారు, ఎందుకు నడిపారు, ఏం రికార్డు చేశారు, ఆ ఆపరేషన్‌కు చట్టబద్ధమైన అనుమతి ఉందా లేదా అనేది ముఖ్యం. ప్రజలకు మీ ఊహాగానాలు కాదు, ఆధారాలతో కూడిన భాద్యతాయుత సమాధానాలు కావాలని కోరారు.
Also Read: హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ గుర్తింపు.. PHFI క్యాంపస్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన