Kothagudem Airport: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు కోసం మరో కీలక ముందడుగు పడింది. సెప్టెంబర్ 7న కేంద్ర సాంకేతిక బృందం భద్రాద్రి జిల్లాలో పర్యటించి ఎయిర్‌పోర్ట్‌కు అనువైన ప్రాంతాలను పరిశీలించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో ఇప్పటికే ఎయిర్ పోర్ట్ అధారిటిస్ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఆధ్వర్యంలో ఆరు వేర్వేరు ప్రదేశాల్లో సర్వే కూడా నిర్వహించారు. ఈమేరకు ఎయిర్ పోర్ట్ అధారిటీస్ నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా కు గుడ్ న్యూస్ అందింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని సుజాతనగర్ లో 667 ఎకరాల్లో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి కేంద్ర విమానయాన శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కొత్తగూడెం జిల్లా లో ఎయిర్‌పోర్ట్ కల ఈనాటిది కాదు. పారిశ్రామిక ప్రాంతానికి చెందిన ప్రముఖులు 25 ఏళ్ళ క్రితమే రోడ్, రైల్, ఎయిర్ కనెక్టివిటీ కమిటీ ఏర్పాటు చేసి ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు కోసం నాటి ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్ గా పని చేసిన గిరిధర్ హయాం నుంచే కేంద్ర ప్రభుత్వానికి రైలు, విమానయానం పై ప్రతిపాదనలు పంపుతూనే ఉన్నారు. భూ సేకరణ ఇతర అంశాలపై సహకారించేం దుకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రావడంతో, ఎట్టకేలకు సుజాతనగర్ ప్రాంతంలో ఎయిర్ పోర్ట్ కు కావాల్సినంత భూ లభ్యత తో పాటు వరద తాకిడి లేకపోవడం, అనుకూలమైన రన్ వే ప్రదేశం లభ్యత, ఇంకా పలు అంశాలు సుజాతనగర్‌లో ఏయిర్ పోర్టు ఏర్పాటు కు గ్రీన్ సిగ్నల్ వచ్చేలా చేశాయి.
ప్రతిపాదిత సుజాతనగర్ ఎయిర్‌పోర్ట్ ప్రాంతం హైవేకు కేవలం 3.4 కీ.మీ., కొత్తగూడెం రైల్వే స్టేషన్ కు5.7కి.మీ. భారజలకర్మాగారం, ఐటిసి భద్రాచలం పేపర్ బోర్డు , ఇంకా మూడుసింగరేణి సంస్థలు కేవలం 30 కీ.మీ. పరిధిలో ఉంటాయి. దీంతో పాటు పర్యావరణ అనుకూలత, గోదావరి వరదల ముంపునకు చాలా దూరంగా ఉండటం వంటి పరిస్థితులు సుజాతనగర్ ఎయిర్‌పోర్ట్ ఖరారుకు తుది నివేదిక ఇచ్చేందుకు మార్గం సుగమమైందని అధికార వర్గాలు తెలిపాయి. వాస్తవానికి భద్రాద్రి జిల్లా లోని పాల్వంచ-దమ్మపేట, చాపరాలపల్లి, సీతంపేట, పెనగడప, దుమ్ముగూడెం ప్రాంతాల్లో కూడా ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు భూమి లభ్యత సర్వేలు జరిగాయి. అయితే అభయారణ్యం , అటవీ ప్రాంతం మినహాయింపు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గతంలో సంభవించిన గోదావరి వరదల ముంపు ప్రాంతాలను బేరీజు వేశారు .దీని ప్రకారం సుజాతనగర్ ప్రాంతం ఎంత మేరకు దూరంగా ఉందన్న అంశాలను పరిగణనలోకి వచ్చాకే తుది నిర్ణయం తీసుకున్నట్లు సర్వే నివేదిక లో పేర్కొన్నారు.
Also read: తెలంగాణలో రచ్చ రేపుతున్న కవిత పాలిటిక్స్.. సైలెంట్ మోడ్‌లో కేటీర్, హరీష్ రావు!