E-Paper
Advertisement

Harish Rao : సీఎం చెప్పిన దాంట్లో తప్పేముంది హరీశ్?

Harish Rao : సీఎం చెప్పిన దాంట్లో తప్పేముంది హరీశ్?
Advertisement

తెలంగాణ రాజకీయాల్లో విమర్శల పర్వం కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు, రీజినల్ రింగు రోడ్డు, కోర్ అర్బన్ రీజియన్‌లో ప్రభుత్వం చేపట్టాలనుకుంటున్న అభివృద్ధి పనులకు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అడుగడుగునా అడ్డుపడుతున్నట్టు తెలుస్తోంది. ఫ్యూచర్ సిటీకి అనుసంధానంగా చేపడుతున్న ప్రాజెక్టుల్లో భాగంగా కొందరి ఇండ్లను హైడ్రా అధికారులు, జీహెచ్ఎంసీ సంయుక్తంగా తొలగిస్తూ వస్తున్నది.దీంతో గూడు కోల్పోయిన కొందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వారికి మద్దతుగా నిలబడిన బీఆర్ఎస్ నేతలు వారిని అడ్డం పెట్టుకుని కుటిల రాజకీయాలకు తెరలేపినట్టు ప్రచారం జరుగుతోంది.

కూల్చకుండా.. కట్టకుండా అభివృద్ధి ఎలా?

అభివృద్ధి అనేది పాతవి కూల్చకుండా, కొత్తవి కట్టకుండా ఎలా సాధ్యం అని అధికార పార్టీ నేతలు అంటున్నారు. గత బీఆర్ఎస్ పాలనలో హైటెక్ సిటీ ప్రాంతంలో కొండలను తొలచి బహుల అంతస్థులను నిర్మించినప్పుడు కూల్చివేతలు గుర్తుకురాలేదా? అని హస్తం పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా ఇండ్లు, షాపులు, భూములు కోల్పోతున్న వారికి నష్టపరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతున్నది. అయినప్పటికీ ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం బాధితులను అడ్డం పెట్టుకుని నష్టపరిహారం అనే అంశాన్ని పక్కకు జరిపి ఎమోషనల్ పాలిటిక్స్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూం ఇండ్ల పేరిట కూల్చివేతలు చేపట్టి నిరుపేదలను రోడ్డున పడేసినప్పుడు ఇవన్నీ గుర్తుకురాలేదా? అప్పుడు వారు కూడా ఇలాగే రోదించారు? ఏండ్లు గడుస్తున్నా పేదలకు డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చారా? పేదల పేరిట బీఆర్ఎస్ నాయకులకు, కమీషన్లకు అమ్ముకున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.

మూసీ పునరుజ్జీవం ఎందుకు చేయలేదు?

Advertisement

బీఆర్ఎస్ రాష్ట్రంలో పదేండ్లు అధికారంలో ఉన్నది. ఆనాడు హుస్సేన్ సాగర్ శుద్ధి,మూసీ పునరుజ్జీవంలో భాగంగా రూ. వేల కోట్లు ఖర్చు చేసిన బీఆర్ఎస్ కంటితుడుపు చర్యగా వ్యవహరించింది. నిధులు మాత్రం ఖర్చు అయ్యాయి, మూసీ పునరుజ్జీవం మాత్రం జరగలేదు. హైదరాబాద్‌లో సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడం వల్లే మొత్తం పూర్తి చేయలేకపోయామని, మాస్టర్ ప్లాన్ రెడీ చేశాక కంప్లీట్ చేస్తామని నాడు బీఆర్ఎస్ పేర్కొన్నది. పదేండ్లలో అటు మాస్టర్ ప్లాన్, ఇటు పునరుజ్జీవం రెండూ పూర్తికాలేదు. నాడు గులాబీ పార్టీ మధ్యలో వదిలేసిన ప్రాజెక్టును ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు చేపట్టింది.తాము చేపట్టిన ప్రాజెక్టును కొనసాగిస్తున్నందుకు అభినందించాల్సింది పోయి బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావులు విమర్శించడాన్ని కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా తప్పుబడుతున్నారు.

Andhra Pradesh: చిన్నారుల ఆత్మగౌరవంపై దెబ్బ.. పాఠశాలలో ఉపాధ్యాయురాలి పైశాచికం.. అసలు ఏం జరిగిందంటే?
ఇదిలాఉండగా, కోర్ అర్బన్ సిటీలో ఎకో పార్క్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. అభివృద్ధి కావాలంటే కొన్నింటిని వదులకోవాల్సింది ఉంటుందని, బాధితులకు నష్టపరిహారం అందిస్తామని స్పష్టంచేశారు.అయినా, వినకుండా బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని.. నగర విస్తరణ, అభివృద్ధి జరిగితేనే పెట్టుబడులు, పరిశ్రమలు, కంపెనీలు వస్తాయని, ఉద్యోగావకాశాలు మెరుగవుతాయని సీఎం గుర్తుచేశారు.రాష్ట్రంలో విధ్వంసం జరగడం లేదని,పాతవి కూల్చి కొత్తవి కడుతున్నామని చెప్పారు.ఈ విషయాన్ని ఎన్నిసార్లు చెప్పినా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని సీఎం అసహనం వ్యక్తం చేశారు.ఇదే విషయంపై కాంగ్రెస్ శ్రేణులు సైతం సీఎం రేవంత్‌కు అండగా నిలుస్తూ..ప్రభుత్వం ఏం చేయాలనుకుంటున్నదో ప్రజలకు వివరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Related News

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Big Stories

Advertisement
×