BigTV English

IAS Officers: క్యాట్‌లోనూ ఆ ఐఏఎస్‌లకు చుక్కెదురు.. వెళ్లిపోవాల్సిందేనంటూ..

IAS Officers: క్యాట్‌లోనూ ఆ ఐఏఎస్‌లకు చుక్కెదురు.. వెళ్లిపోవాల్సిందేనంటూ..

Hearing in Cat on the petition of IAS Officers: క్యాట్ లోనూ ఆ ఐఏఎస్ ఆఫీసర్లకు చుక్కెదురైంది. ఎక్కడివాళ్లు అక్కడే రిపోర్ట్ చేయండి అంటూ వారిని ఆదేశించింది. డీఓపీటీ ఆర్డర్స్ ప్రకారం రిపోర్టు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. రేపు యథావిధిగా రిపోర్టు చేయాలని క్యాట్ ఆదేశాలు జారీ చేసింది.


Also Read: మరోసారి హస్తీనాకు సీఎం రేవంత్‌రెడ్డి… ఆశావహుల్లో ఉత్కంఠ

విచారణ సమయంలో ఐఏఎస్ ల పై క్యాట్ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ప్రజా హితాన్నే పరిగణనలోకి తీసుకున్నాం. వన్ మెన్ కమిటీ సిఫారసు చేసినప్పుడు ఎందుకు హైకోర్టుకు వెళ్లలేదు? ఏపీలో వరదలతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. వారికి సేవ చేయాలని లేదా..? డీఓపీటీ ఇచ్చిన ఆదేశాలను పాటించాలి. వన్ మెన్ కమిటీ సిఫారసులను డీఓపీటీ ఎలా అమలు చేస్తుంది? స్థానికత ఉన్నప్పటికీ, స్వాపింగ్ చేసుకోవొచ్చని గైడె లైన్స్ లో ఉందా..? నవంబర్ 1 లోగా వన్ మెన్ కమిటీ నివేదికను అందించండి. ఐఏఎస్ ల కేటాయింపుపై డీఓపీటీకి నిర్ణయం తీసుకునే అధికారం ఉంది’ అంటూ క్యాట్ పేర్కొన్నది.


ఈ సందర్భంగా ఐఏఎస్ ల తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ‘ఏడుగురికి సంబంధించి క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. క్యాట్ ఆదేశాల కాపీ వచ్చాక హైకోర్టును ఆశ్రయిస్తాం. రేపు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తాం’ అంటూ ఆయన పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. కేంద్ర ప్రభుత్వం తరఫున డీఓపీటీ ఇటీవలే ఉత్తర్వులను జారీ చేసింది. తెలంగాణ కేడర్ కావాలన్న 11 మంది ఐఏఎస్ అధికారుల విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించింది. ఇప్పటికే ఈ 11 మంది ఐఏఎస్ అధికారులు.. వాకాటి కరుణ, వాణీప్రసాద్, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి, ప్రశాంతితోపాటు ఐపీఎస్ కేడర్ కు చెందిన అంజనీ కుమార్, అభిషేక్ మహంతి, అభిలాశ్ బిస్త్ లను కేంద్ర ప్రభుత్వం ఏపీ క్యాడర్ కు అటాచ్ చేసింది. అదేవిధంగా ఏపీలో కొనసాగుతున్న శివశంకర్, హరికిరణ్, సృజనలను తెలంగాణకు వెళ్లాలంటూ కేంద్రం ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది.

Also Read: ఇద్దరు మంత్రులకు కీలక భాద్యతలు అప్పగించిన అధిష్టానం.. కారణం అదేనా.. మరేదైనా ఉందా ?

డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ పలువురు ఐఏఎస్ అధికారులు క్యాట్ ను ఆశ్రయించారు. వారి పిటిషన్లను స్వీకరించిన క్యాట్ నేడు విచారించింది. ఈ సందర్భంగా తాజాగా ఈ ఆదేశాలను జారీ చేసింది. ఎక్కడివారు అక్కడికి వెళ్లిపోవాల్సిందేనంటూ అందులో స్పష్టం చేసింది.

అయితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో 2014లో అఖిల భారత సర్వీస్ అధికారులైన ఐఏఎస్, ఐపీఎస్ లను ఏపీ, తెలంగాణ మధ్య కేంద్రం విభజించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు అధికారులను కేటాయించింది. అయితే, పలువురు అధికారులు తమకు కేటాయించిన రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రంలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో డీఓపీటీ తాజాగా ఆదేశాలు జారి చేసింది. వారంతా కూడా తమకు కేటాయించిన సొంత క్యాడర్ లోనే కొనసాగాలంటూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నది.

Related News

Bc Bill: సడన్‌గా రాజకీయ పార్టీలకు బీసీలపై ప్రేమ దేనికి?

Birth Certificate: ఇదెక్కడి ఘోరం.. బర్త్ సర్టిఫికెట్‌కు అప్లై చేస్తే డెత్ సర్టిఫికెట్..?

Ponnam Prabhakar: హైదరాబాద్ అభివృద్ధికి కిషన్ రెడ్డి ఏ ప్యాకేజ్ తీసుకొచ్చారు

Srushti Fertility IVF Scam: రూ.20 కోట్లు.. 80 మంది పిల్లలు.. నమ్రత కేసులో సంచలనాలు

Rain Alert: మరి కాసేపట్లో భారీ వర్షం.. త్వరగా ఆఫీసులకు చేరుకోండి, లేకపోతే…

Telangana Congress: కాంగ్రెస్‌లో ఫైర్ బ్రాండ్లుగా ఫోకస్ అవుతున్న కోమటిరెడ్డి బ్రదర్స్

Big Stories

×