BigTV English

Kadam Project :కడెం ప్రాజెక్టుకు భారీ వరద.. ఆందోళనలో ప్రజలు..

Kadam Project :కడెం ప్రాజెక్టుకు భారీ వరద.. ఆందోళనలో ప్రజలు..
Kadem project live news


Kadem project live news(Telangana news updates): నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ మరోసారి వణుకు పుట్టిస్తోంది. ప్రాజెక్ట్ దిగువన ఉన్న గ్రామాలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి నెలకొంది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఎగువ నుంచి 3.8 లక్షల క్యూసెక్కుల వరద నీరు కడెం ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. 14 గేట్ల ద్వారా దిగువకు రెండున్నర లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

ప్రాజెక్టుకు 18 వరద గేట్లు ఉండగా అందులో నాలుగు గేట్లు తెరుచుకుకోకుండా ఇంకా మొరాయిస్తున్నాయి. ప్రస్తుతం 14 గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు. వరద ఉధృతి ఇదే తీరుగా కొనసాగితే ముప్పు తప్పదని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కడెం ప్రాజెక్టుకు ప్రమాదకర స్థాయిలో వరద పోటెత్తడంతో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పరిస్థితిని పరిశీలించారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×