Jubilee hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ పార్టీలు తమ తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఈ విషయంలో బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంటుంది. సీటు కోసం ముగ్గురు వ్యక్తులు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే త్రిసభ్య కమిటీ రిపోర్టు స్టేట్ అధ్యక్షుడికి చేరింది.
ఇంకోవైపు నియోజకవర్గాల్లో అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు ఓటర్లను ఆకట్టుకునేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగుంట సునీత నియోజకవర్గంలో ప్రచారం మొదలు పెట్టేశారు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. ఉపఎన్నికలో తనకు టికెట్ ఇచ్చినందుకు కాంగ్రెస్ హైకమాండ్‌కు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ధన్యవాదాలు తెలిపారు. అత్యధిక మెజార్టీతో గెలుస్తాననే విశ్వాసం తనకు ఉందన్నారు నవీన్ యాదవ్.
మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అక్టోబర్ 13న నోటిఫికేషన్ రానుంది. 21న నామినేషన్ గడువు ముగియనుంది. నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. కౌంటింగ్ మాత్రం నవంబర్ 14న జరగనుంది. నియోజకవర్గం పరిధిలో ఎక్కడికక్కడ చెక్‌పోస్టులను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. వాహనాలను క్షుణ్ణంగా తనికీలు చేస్తున్నారు.
తనకు టికెట్ ఇవ్వడంపై కాంగ్రెస్ అధిష్ఠానానికి ధన్యవాదాలు తెలిపిన నవీన్ యాదవ్
నాకు ఈ అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కు కృతజ్ఞతలు
నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను
జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ గెలుపును… pic.twitter.com/mvGjOWQ810
— BIG TV Breaking News (@bigtvtelugu) October 9, 2025