Common Skin Problems: సీజన్ ఏదైనా అది చర్మంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇదిలా ఉంటే చర్మ సమస్యలకు కారణమయ్యే అనేక ఇతర అంశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే స్కిన్ ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది. ఇంతకీ చాలా మందిలో వచ్చే చర్మ సమస్యలు ఏమిటి ? చర్మ సమస్యలు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రతలు తీసుకోవాలనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చర్మ సమస్యలు.. రాకుండా ఉండాలంటే ?
.1. బంగాళదుంపను దాని తొక్కతో కలిపి గ్రైండ్ చేసి.. ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల సూర్యరశ్మి వల్ల ఏర్పడిన చర్మ గాయాన్ని తొలగిస్తుంది.
2. పెరుగులోని ప్రోబయోటిక్స్, ఎంజైమ్‌లు ఎరుపును తగ్గించి చర్మాన్ని శుభ్రపరచడంలో సహాయపడతాయి. పెరుగును ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖ రంధ్రాలు తెరుచుకుని చర్మాన్ని శుభ్రపరుస్తుంది.
3. దోసకాయలో చర్మానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.
4. ముఖంపై ఐస్ ఉపయోగించడం ద్వారా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇది గ్లోయింగ్ స్కిన్ కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖం వాపును తగ్గిస్తుంది. అంతే కాకుండా చర్మంపై చికాకును కూడా తగ్గిస్తుంది.
5. పుదీనాలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని పోషిస్తాయి. అంతే కాకుండా పిగ్మెంటేషన్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇది శీతలీకరణ ప్రభావాన్ని అందిస్తుంది. అంతే కాకుండా వడదెబ్బ సమయంలో చర్మాన్ని తేమ చేస్తుంది. ముఖ రంధ్రాలను తెరుచుకునేలా చేస్తుంది.
1. డీహైడ్రేషన్:
డీహైడ్రేషన్ మీ శరీరాన్ని మాత్రమే కాకుండా మీ చర్మాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. నిరంతరం చెమట పట్టడం వల్ల మీ శరీరంలోని నీరు తగ్గిపోతుంది. మీరు తగినంత నీరు తాగకపోతే.. మీ చర్మం పొడిగా, నిర్జీవంగా మారే ప్రమాదం కూడా ఉంటుంది.
నివారణ:
1. రోజూ 8 నుంచి 10 గ్లాసుల నీరు త్రాగాలి. ప్రతి అర గంటకు ఒకసారి నీరు తాగాలి.
2. మీరు తాజా పండ్ల రసం కూడా తాగవచ్చు.
3. మీరు హైడ్రేటింగ్ ఎలక్ట్రోపోరేషన్ థెరపీ, ఆక్సిజన్ థెరపీ , జువెడెర్మ్ రిఫైన్ వంటి కొన్ని లోతైన హైడ్రేటింగ్ చికిత్సలను కూడా ఎంచుకోవచ్చు .
4. డీహైడ్రేషన్ వల్ల మన శరీరంలో పొటాషియం లోపం ఏర్పడుతుంది. దీనికి అరటి పండ్లు మంచి నివారణ. రోజుకు రెండు అరటిపండ్లు తినడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
5. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య కూడా తొలగిపోతుంది.
6. మజ్జిగ తాగడం చాలా మంచిది. కాబట్టి కొద్దిగా పలుచని మజ్జిగ తయారు చేసుకుని రోజుకు రెండుసార్లు తాగాలి.
7. నిమ్మకాయ నీరు తాగడం వల్ల శరీరం రిఫ్రెష్ అవుతుంది.
2. రక్తహీనత:
రక్తహీనత తీవ్రమైన అనారోగ్యం కానప్పటికీ.. ఇది శరీరంలో ఐరన్ లోపానికి కారణమవుతుంది. ఇది హిమోగ్లోబిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఫలితంగా రక్తహీనతకు దారితీస్తుంది. ఇది చర్మాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది కాబట్టి చిన్న చిన్న మచ్చలు, పెదవులు, గోర్లు, అరచేతులు పసుపు రంగులోకి మారడం వంటి వివిధ చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి.
Also Read: గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే..? ఇవి తింటే చాలు !
నివారణ:
1. రక్తహీనత వల్ల కలిగే వ్యాధులను నివారించడానికి.. మీరు మీ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. అంటే ఐరన్ అవసరాన్ని తీర్చడానికి బీట్‌రూట్, క్యారెట్, టమాటో, ఆకుకూరలను మీ ఆహారంలో చేర్చండి.
2. పెసలు, నువ్వులు, జొన్నలు, పండ్లు తినండి.
3. బఠానీలు, బాదం, ఆప్రికాట్లు, బీన్స్, ఎండుద్రాక్ష, ఖర్జూరాలు తినండి.
4. టమాటో, ఆపిల్ జ్యూస్ తాగండి. ప్రతిరోజూ ఒక అరటిపండు తినండి. బొప్పాయి, ద్రాక్ష, జామ, అరటిపండ్లు, ఆపిల్, సపోటా, నిమ్మకాయ తినండి. దానిమ్మ రసం కూడా చాలా మంచిది.