Shubman Gill: టీమిండియా కొత్త వన్డే కెప్టెన్ శుభమాన్ గిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు వన్డే కెప్టెన్సీ రావడంపై సంతోషం వ్యక్తం చేస్తూ, రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ ఇద్దరూ తలవంచుకుని, తన కెప్టెన్సీలో వన్డేలు ఆడాల్సిందేనని బాంబ్ పేల్చారు. వాళ్ళిద్దరు ఆడితే, జట్టుకు మంచి జరుగుతుందని తెలిపారు. తన కెప్టెన్సీలో వాళ్ళిద్దరూ ఆడటం మాత్రం కొత్త విషయం అయినప్పటికీ, కచ్చితంగా ఆడాల్సిందేనని వివరించారు. అలాంటి సీనియర్ ప్లేయర్లు తన కెప్టెన్సీలో ఆడితే గర్వకారణంగానే ఉంటుందని స్పష్టం చేశారు. వాళ్ల సలహాలు అలాగే సూచనలు తీసుకొని ముందుకు నడుస్తానని చెప్పుకొచ్చాడు గిల్.
టీమిండియా వన్డే కెప్టెన్సీ రావడంపై శుభమాన్ గిల్ స్పందించారు. వన్డే కెప్టెన్సీ రావడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. వాస్తవానికి టీమ్ ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా వన్డే కెప్టెన్సీ అనౌన్స్ చేశారు. కానీ తనకు ఈ విషయం ముందే తెలుసు అని ఈ క్లారిటీ ఇచ్చారు గిల్. ప్రకటన రాగానే ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యాను అని ఎమోషనల్ అయ్యారు. వన్డే కెప్టెన్సీ అనేది గొప్ప బాధ్యత. చాలా జాగ్రత్తగా తన పని తాను చేయాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడితేనే కెప్టెన్సీలో సక్సెస్ అవుతానని చెప్పుకొచ్చాడు. ఇక రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు తన కెప్టెన్సీలో ఆడడం కూడా గొప్ప విషయమే. వాళ్ళిద్దరూ ఇచ్చే సలహాలను తీసుకొని ముందుకు వెళ్తాను అని చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా టూర్ లో ఈ విషయం స్పష్టమవుతుందని తెలిపాడు గిల్. సీనియర్లను కించపరచకుండా ముందుకు వెళ్తానని చెప్పుకొచ్చాడు.
అదే సమయంలో గిల్ మరో సంచలన ప్రకటన చేశాడు. వన్డేలు ఒకటే కాదు అన్ని ఫార్మాట్స్ కు నేను కెప్టెన్ కావాల్సిందే. అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ అయి అన్ని రకాల ఐసీసీ ట్రోఫీలు ఇండియాకు అందిస్తానని ప్రకటించాడు. దీంతో గిల్ చేసిన వ్యాఖ్యలు వద్దు మారం రేపుతున్నాయి. వన్డే కెప్టెన్సీ వచ్చిన తర్వాత కాస్త ఓవర్ గా మాట్లాడుతున్నాడని సెటైర్లు పేల్చుతున్నారు జనాలు. ముందు ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్ గెలుచుకుని రా? లేకపోతే నీ కెప్టెన్సీనే పీకి పారేస్తారు అంటూ వార్నింగ్ కూడా ఇస్తున్నారు టీమిండియా అభిమానులు.
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య అక్టోబర్ 19వ తేదీ నుంచి వన్డే సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వన్డే సిరీస్ నేపథ్యంలో రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అయితే ఈ సిరీస్ కోసం ఇటీవల టీమిండియా జట్టును ప్రకటించగా, రోహిత్ శర్మకు షాక్ ఇచ్చింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అతని కెప్టెన్సీని పీకి పరేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి గిల్ కు అవకాశం ఇచ్చింది. ఇప్పటికే గిల్ టెస్టులకు కెప్టెన్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వన్డేలకు కూడా కెప్టెన్ అయ్యాడు.
Also Read: Abhishek Sharma Car: అభిషేక్ కారుకు ఇండియాలో నో పర్మిషన్…దుబాయ్ లో వదిలేశాడుగా !
SHUBMAN GILL ON VIRAT KOHLI & ROHIT SHARMA:
– "Virat Kohli bhai & Rohit Sharma bhai have won so many games for India. Very few have so much skill and experience. We need them in ODI team". pic.twitter.com/GQpFsKtMDP
— Tanuj (@ImTanujSingh) October 9, 2025