BigTV English

Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు నేడే నోటిఫికేషన్

Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు నేడే నోటిఫికేషన్

Local Body Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే ఇవ్వకపోవడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాలు జారీ చేశారు. తొలి విడతలో 53 రెవెన్యూ డివిజన్లు, రెండో విడతలో 50 రెవెన్యూ డివిజన్లలో ఎన్నికలు జరగనున్నాయి.


అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లను SEC పూర్తి చేసింది. ఈ మేరకు మండల, జిల్లా పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్ దాఖలుకు సంబంధించి ఎలాంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఎంపీటీసీలకు మండల ఆఫీస్, జెడ్పీటీసీల కోసం జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించనున్నారు. నాలుగైదు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు కలిపి ఒక ఆర్వోను నియమించారు. రిజల్ట్ వచ్చేవరకు పర్యవేక్షణ బాధ్యతలను ఆర్వో అధికారులకు అప్పగించారు.

తొలి రెండు విడతల్లో MPTC, ZPTC ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 23న తొలి విడత.. ఈ నెల 27న రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించనున్నారు. నవంబర్ 11న MPTC, ZPTC ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మొదటి విడతలో 2 వేల 963 MPTC, 292 ZPTC స్థానాలు ఉన్నాయి. అలాగే రెండో విడతలో 2 వేల 786 MPTC, 272 ZPTC స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.


Also Read: గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో గుండెపోటుతో ప్రయాణికుడు మృతి..

31 జిల్లాల్లో 565 మండలాల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించనుంది. ఐదు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 565 ZPTC, 5749 MPTC స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మిగతా మూడు దశల్లో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. 12 వేల 733 గ్రామ పంచాయతీలు, లక్షా 12 వేల 288 వార్డులకు మిగతా మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్‌ 31న మొదటిదశ.. నవంబర్‌ 4న రెండోదశ.. నవంబర్‌ 8న మూడోదశ గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు.

Related News

Sircilla: కలర్ డబ్బా తేస్తేనే.. స్కూల్‌లోకి ఎంట్రీ.. ప్రిన్సిపాల్ వింత పనిష్‌మెంట్

Jubilee hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్‌లో కాంగ్రెస్ గెలుపు ఖాయం, పార్టీ హైకమాండ్‌కు నవీన్ కృతజ్ఞతలు

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్.. ఏఐసీసీ ప్రకటన

Telangana Digital Connectivity: గ్రామీణ డిజిటల్ కనెక్టివిటీలో తెలంగాణ రోల్ మోడల్

Mahesh Kumar Goud: బీసీ రిజర్వేషన్ల కేసు ఖచ్చితంగా గెలుస్తాం: మహేశ్ కుమార్ గౌడ్

Telangana RTC: హైదరాబాద్‌లో బస్సు ఛార్జీల పెంపు.. జిల్లా బస్సుల్లో కూడా బాదుడు.! టీజీఎస్‌ఆర్టీసీ క్లారిటీ

BC Reservations: హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ గురువారానికి వాయిదా

Big Stories

×