E-Paper
Advertisement

Khammam: హే కృష్ణా.. రామా.. ఎన్టీఆర్‌ విగ్రహ ఏర్పాటుపై స్టే..

Khammam: హే కృష్ణా.. రామా.. ఎన్టీఆర్‌ విగ్రహ ఏర్పాటుపై స్టే..
Advertisement
khammam ntr statue

Khammam: మంత్రి పువ్వాడ అజయ్‌కి బిగ్ షాక్ తగిలింది. ఖమ్మం లకారం చెరువులో కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై హైకోర్టు స్టే విధించింది. ఇస్కాన్‌, యాదవ సంఘాలు హైకోర్టులో పిటిషన్లు వేయగా.. విచారణకు స్వీకరించిన కోర్టు.. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎన్టీఆర్‌ విగ్రహం పెట్టొద్దని ఆదేశించింది. పువ్వాడ అజయ్‌ సహా నిర్వాహకులకు నోటీసులు జారీ చేసింది.

ఎన్టీఆర్‌ వందో జయంతి సందర్భంగా మే 28న విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్నారు. 54 అడుగుల విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. 4 కోట్ల విరాళాలు వచ్చాయి. విగ్రహాన్ని జూనియర్‌ ఎన్టీఆర్‌తో ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో విగ్రహం చుట్టూ వివాదం ముసురుకుంది.

Advertisement

ఎన్టీఆర్ విగ్రహం శ్రీకృష్ణుడి గెటప్‌లో ఉండటమే వివాదానికి కారణం. తమ దైవం శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఎన్టీఆర్ రూపంలో ఏర్పాటు చేయడాన్ని యాదవ సంఘాలు తప్పుబడుతున్నాయి. ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి టైంలో శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న విగ్రహానికి నివాళులు అర్పిస్తే.. మా దేవుడిని అపవిత్రం చేయడమేననేది యాదవ సంఘాల వాదన. అటు, నటి కరాటే కళ్యాణి సైతం విమర్శలు చేసి ‘మా’ నోటీసులు కూడా అందుకున్నారు.

శ్రీకృష్ణుడి గెటప్‌ లో ఎన్టీఆర్ విగ్రహం ఉండటంతో ముస్లింలు కూడా అభ్యంతరం చెబుతున్నారు. ఖిల్లా ఏరియాను ఆనుకొని ఉన్న లకారం ట్యాంక్ బండ్ మీద ఒక సామాజిక వర్గానికి చెందిన విగ్రహాన్ని అంత పెద్ద స్థాయిలో ఏర్పాటు చేయడం తమకు కూడా అభ్యంతరకరమేనని అంటున్నారు. ఇలా వివాదాల నడుమ విషయం హైకోర్టుకు చేరడం.. స్టే విధించడంతో.. విగ్రహ ఏర్పాటు సందిగ్థంలో పడింది.

Related News

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×