E-Paper
Advertisement

భద్రాచలంలో దారుణమైన ఘటన.. అర్ధరాత్రి యువకుడ్ని కొట్టి, సీసీటీవీ సాక్షిగా

భద్రాచలంలో దారుణమైన ఘటన.. అర్ధరాత్రి యువకుడ్ని కొట్టి, సీసీటీవీ సాక్షిగా
Advertisement

Bhadrachalam town: అద్దె వివాదం తారాస్థాయికి చేరింది. ఆ యువకుల మధ్య అర్ధరాత్రి ఫైటింగ్‌కు దారి తీసింది. ఒకరిపై మరొకరు పిడి గుద్దులు విరిరారు. ఓ వ్యక్తి తీవ్రగాయాలు పాలైన ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన భద్రాచలం పట్టణంలో వెలుగు చూసింది. అసలు ఏం జరిగింది?

భద్రాచలంలో దారుణమైన ఘటన

భద్రాచలం పట్టణంలోని రామాలయం దగ్గర ఓ ప్రైవేటు లాడ్జి వద్ద ఈ ఘటన జరిగింది. రూమ్ అద్దె విషయంలో చిన్నపాటి వివాదం మొదలైంది. చివరకు అది తారాస్థాయికి చేరింది. ఈ ఘర్షణలో 25 ఏళ్ల శరత్ అనే యువకుడు మృతి చెందాడు. జోమాటో, స్విగ్గీలో పని చేస్తున్న నలుగురు యువకులు రూమ్ కోసం ప్రైవేట్ లాడ్జికి వెళ్లారు. మద్యం మత్తులో ఉన్న యువకులు రూమ్ కావాలని కోరారు.

Advertisement

అందుకు లాడ్జి నిర్వాహకులు రూ. 600 అద్దె అని చెప్పారు. రూ. 500 లకు ఇవ్వాలని ఆ యువకులు డిమాండ్ చేశారట. ఆ తర్వాత నలుగురిలో ఒక్కరే ఆధార్ కార్డు చూపించాడు. మిగిలిన వారు తమ కార్డులు చూపించడానికి నిరాకరించారట. ఈ క్రమంలో లాడ్జికి చెందిన వ్యక్తులు.. ఆ యువకులపై చిన్నపాటి గొడవ జరిగింది. అది కాస్త ఘర్షణగా మారింది. ఆ వ్యవహారం కాస్త నడిరోడ్డుపైకి వచ్చింది.

అర్ధరాత్రి లాడ్జి ముందు ఫైటింగ్

లాడ్జి సిబ్బంది పిడిగుద్దులు విసరడంతో ఒక్కడు కుప్ప కూలిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన లాడ్జి సిబ్బంది యువకుడి మృతిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు శరత్‌ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తేల్చిచెప్పారు. శరత్‌తో వచ్చిన స్నేహితులపై దాడి చేయగా అక్కడి నుంచి పారిపోయారు.

Advertisement

ALSO READ: మాజీ డీజీపీకే దిమ్మతిరిగే షాక్.. రూ.18 కోట్ల భూమిని మాయం చేసిన రియల్టర్లు!

ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లాడ్జి నిర్వాహకులను పిలిచి విచారణ చేపట్టారు.

 

Related News

మాజీ డీజీపీకే దిమ్మతిరిగే షాక్.. రూ.18 కోట్ల భూమిని మాయం చేసిన రియల్టర్లు!

రూమ్‌మేట్ ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసి.. ఘాతుకానికి పాల్పడిన మైనర్, హైదరాబాద్ శివారులో షాకింగ్ ఘటన

టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గుండు వాణి పై ఏసీబీ పంజా.. అక్రమాస్తులు చూస్తే మీ మైండ్ బ్లాకే?

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి.. హైకోర్టులో ఎదురు దెబ్బ?

ఇటలీ నేత జియాకోమో ఫిలిబెక్ పై.. రాంచందర్ రావు ఫైర్!

తెలంగాణలో 7 లక్షల పేద కుటుంబాలకు భారీ శుభవార్త!

నిధులు ఎక్కడ రేవంత్ రెడ్డి గారూ? సిద్దిపేట అభివృద్ధిపై హరీశ్‌రావు ఘాటు లేఖ!

Big Stories

Advertisement
×