Tamim Iqbal Become Next ACC Chairman: ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీకి (mohsin naqvi) ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఏసీసీ అధ్యక్ష పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో అతని స్థానంలో మరో వ్యక్తి కూర్చోబోతున్నాడు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ గా పని చేస్తున్న తమీమ్ ఇక్బాల్ ను (Tamim Iqbal) ఏసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా ( ACC Chairman) చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ మేరకు తెర వెనుక ఐసీసీ అధ్యక్షుడు జై షా కూడా చక్రం తిప్పుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే మొహ్సిన్ నఖ్వీ పదవి కోల్పోవడమే కాకుండా రోడ్డున పడతాడని సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ఐసీసీ అధ్యక్ష పదవి కోసమే పోటీపడ్డ మొహ్సిన్ నఖ్వీ… ఇప్పుడు ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్ష పదవిని కూడా కోల్పోతున్నాడని మరి కొందరు సెటైర్లు పేల్చుతూ పోస్టులు పెడుతున్నారు. జై షాను గెలికితే, ఇప్పుడు సీటు చిరగాల్సిందేనని నఖ్వీని ఆడుకుంటున్నారు.
ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్ష ఎంపిక కోసం ఎలాంటి ఎన్నిక జరగదు. రొటేషన్ పాలసీని మాత్రమే సభ్య దేశాలు అమలు పరుస్తున్నాయి. ఆసియా క్రికెట్ కౌన్సిల్ లో బంగ్లాదేశ్, పాకిస్తాన్, టీమిండియా, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి. 2026 ఆగస్టులోనే ఈ రొటేషన్ పాలసీ జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా చేరింది. అంతకుముందు రొటేషన్ పద్ధతిలో పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, భారత్ ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్ష పదవిని అనుభవించాయి. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడి సాధారణ పదవీ కాలం రెండు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఏదైనా అనివార్య పరిస్థితులు వస్తే, ఆ పదవీ కాలాన్ని ఏకాభిప్రాయంతో పొడిగించుకునే అవకాశాలు ఉంటాయి. అధ్యక్ష పదవికి రొటేషన్ విధానం ఉండగా ఉపాధ్యక్షుడితో పాటు ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సభ్యులను మాత్రం వార్షిక సమావేశంలో సభ్య దేశాలు కచ్చితంగా ఎన్నుకోవాలి.
ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్ష పదవిని 2025 ఏప్రిల్ లో మొహ్సిన్ నఖ్వీ చేపట్టాడు. అంతకు ముందు 2024 వరకు జై షా ఈ పదవిలో ఉండగా, ఆ తర్వాత షమ్మీ సిల్వాకు అవకాశం దక్కింది. ఇక 2025లో మొహ్సిన్ నఖ్వీకి ఈ బాధ్యతలు చేపట్టారు. అతని పదవీ కాలం 2027 వరకు ఉంటుంది. ఆ తర్వాత తమీమ్ ఇక్బాల్ కు అవకాశం రానుందని ప్రచారం మొదలైంది.