Travis Head set to miss IPL 2027: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ (Indian Premier League 2027 Tournament) మినీ వేలం దగ్గర పడుతున్న నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు (Sunrisers Hyderabad) ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఐపీఎల్ 2027 సీజన్ మొత్తానికి సన్ రైజర్స్ హైదరాబాద్ డేంజరస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ (Travis Head) దూరం కాబోతున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ కారణంగా వచ్చే సీజన్ ఆడబోనని ఇప్పటికే కావ్య పాపకు ట్రావిస్ హెడ్ (Travis Head) సమాచారం ఇచ్చాడని అంటున్నారు. ఈ క్రమంలో వచ్చే సీజన్ ఆడాల్సిందేనని సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం బతిలాడినా హెడ్ ససేమిరా అన్నాడట. దీంతో కావ్య పాప కూడా అతన్ని లైట్ తీసుకున్నట్టు చెబుతున్నారు. ఈ కథనాల ప్రకారం వచ్చే సీజన్ కు నిజంగానే అతడు దూరమైతే, 2027లో ట్రావి-షేక్ విధ్వంసకర ఓపెనింగ్ జోడి కనిపించదు అన్నమాట. ఇది సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ కు పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు.
ట్రావిస్ హెడ్ నిజంగానే 2027 సీజన్ కు దూరమైతే, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు దాదాపు రూ.14 కోట్లు మిగులుతాయి. 2025 మెగా వేలానికి ముందు ట్రావిస్ హెడ్ ను రూ.14 కోట్లకు హైదరాబాద్ రిటైన్ చేసుకుంది. ఇప్పుడు అతడు తప్పుకుంటే, ఆ 14 కోట్లతో మరో ఆటగాడిని డిసెంబర్ 16వ తేదీన గోవాలో జరగనున్న మినీ వేలంలో కొనుగోలు చేయవచ్చు. హెడ్ స్థానంలో ఇషాన్ కిషన్… అభిషేక్ శర్మతో కలిసి ఓపెనర్ గా బరిలోకి దిగుతాడు. 2026 సీజన్ లో 410 పరుగులే చేసిన హెడ్, పెద్ద ఇన్నింగ్స్ ఆడలేదు. అంటే హెడ్ వెళ్లినా కావ్యాకు పెద్ద నష్టం లేదు.