E-Paper
Advertisement

తెలంగాణలో ఆల్-టైమ్ రికార్డు విద్యుత్ డిమాండ్.. రబీ సీజన్‌పై భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు

తెలంగాణలో ఆల్-టైమ్ రికార్డు విద్యుత్ డిమాండ్.. రబీ సీజన్‌పై భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు
Advertisement

Bhatti Vikramarka: స్వేచ్ఛ బ్యూరో: ‎ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. విద్యుత్ డిమాండ్ చారిత్రాత్మక గరిష్ఠ స్థాయికి చేరుకున్నా, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా చేయడంలో విద్యుత్ సంస్థలు సమర్థంగా పనిచేస్తున్నాయని అభినందించారు. రానున్న రబీ సీజన్‌లోనూ ఇదే పనితీరును కొనసాగిస్తూ రైతులు, గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు నిరంతరాయంగా విద్యుత్ అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజాభవన్‌లో ఇంధన శాఖ ఉన్నతాధికారులు, ఎస్పీడీసీఎల్ అధికారులతో రాష్ట్ర విద్యుత్ సరఫరా పరిస్థితిపై ‎సోమవారం సమీక్ష నిర్వహించారు.

రబీ సీజన్‌కు విద్యుత్ సంస్థల సన్నద్ధతపై చర్చ..

Advertisement

ఈ సందర్భంగా రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, సరఫరా నిర్వహణ, మౌలిక సదుపాయాల విస్తరణ, రానున్న రబీ సీజన్‌కు విద్యుత్ సంస్థల సన్నద్ధతపై చర్చించారు. ‎అక్టోబర్ 16న రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 20,018 మెగావాట్లకు చేరుకుని చారిత్రాత్మక గరిష్ఠ స్థాయిని నమోదు చేసిందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వరుసగా రెండో రోజు కూడా 20,003 మెగావాట్ల స్థాయిలో విద్యుత్ డిమాండ్ నమోదైనప్పటికీ, విద్యుత్ సంస్థలు సమర్థంగా సరఫరా చేశాయని వెల్లడించారు. రాష్ట్రంలో ఏటా విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతోందని, గత ఏడాది నవంబర్ 16న 8,522 మెగావాట్లుగా ఉన్న గరిష్ఠ డిమాండ్ ఈ ఏడాది అదే తేదీన 12,802 మెగావాట్లకు చేరిందని డిప్యూటీ సీఎం వివరించారు. ఇందులో ఎస్పీడీసీఎల్ పరిధిలో 8,859 మెగావాట్లు, ఎన్పీడీసీఎల్ పరిధిలో 3,595 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ నమోదైందన్నారు.

విద్యుత్ ఇబ్బందులు లేకుండా సరఫరా..

Advertisement

‎వర్షాభావ పరిస్థితుల కారణంగా జలవిద్యుత్ ఉత్పత్తిలో సుమారు 4,000 మెగావాట్ల కొరత ఏర్పడినప్పటికీ ఖరీఫ్ సీజన్‌లో రైతులతో పాటు అన్ని వర్గాల వినియోగదారులకు ఎలాంటి విద్యుత్ ఇబ్బందులు లేకుండా సరఫరా చేయడం అభినందనీయమని డిప్యూటీ సీఎం కొనియాడారు. ఇదే విధంగా రబీ సీజన్‌లోనూ విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ‎మరోవైపు పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా సరఫరా, మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నట్లు అధికారులు వివరించారు. దావూద్‌ఖాన్‌గూడ, బడంగ్‌పేట ప్రాంతాల్లో కొత్తగా నిర్మించిన రెండు 33/11 కేవీ సబ్‌స్టేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. వీటి ద్వారా సరూర్‌నగర్ సర్కిల్ పరిధిలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చడంతో పాటు సరఫరా నాణ్యత, విశ్వసనీయత మెరుగుపడుతుందని వెల్లడించారు. ‎

రికార్డు డిమాండ్.. నో పవర్ కట్!

రబీ సీజన్‌లో దీర్ఘకాలిక పొడి వాతావరణం ఉండే అవకాశాలున్నందున విద్యుత్ డిమాండ్‌లో ఆకస్మిక పెరుగుదల సంభవించే పరిస్థితులను ముందుగానే అంచనా వేయాలని డిప్యూటీ సీఎం సూచించారు. డిమాండ్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన విద్యుత్‌ను సమకూర్చుకోవాలని, ఏ ఒక్క వర్గం వినియోగదారుడికీ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ‎ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వీ పాటిల్, డైరెక్టర్లు శివాజీ, చక్రపాణి, నరసింహ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read: మధురై తనిష్క్ దోపిడీ కేసులో కీలక మలుపు.. ప్రధాన నిందితుడు అరెస్ట్, 11.7 కిలోల బంగారం రికవరీ

Tags

Related News

భద్రాచలంలో దారుణమైన ఘటన.. అర్ధరాత్రి యువకుడ్ని కొట్టి, సీసీటీవీ సాక్షిగా

మాజీ డీజీపీకే దిమ్మతిరిగే షాక్.. రూ.18 కోట్ల భూమిని మాయం చేసిన రియల్టర్లు!

రూమ్‌మేట్ ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసి.. ఘాతుకానికి పాల్పడిన మైనర్, హైదరాబాద్ శివారులో షాకింగ్ ఘటన

టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గుండు వాణి పై ఏసీబీ పంజా.. అక్రమాస్తులు చూస్తే మీ మైండ్ బ్లాకే?

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి.. హైకోర్టులో ఎదురు దెబ్బ?

ఇటలీ నేత జియాకోమో ఫిలిబెక్ పై.. రాంచందర్ రావు ఫైర్!

తెలంగాణలో 7 లక్షల పేద కుటుంబాలకు భారీ శుభవార్త!

Big Stories

Advertisement
×