E-Paper
Advertisement

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి.. హైకోర్టులో ఎదురు దెబ్బ?

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి.. హైకోర్టులో ఎదురు దెబ్బ?
Advertisement

Kaushik Reddy: బీఆర్​ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్​ రెడ్డికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. వాయిస్​ శాంపిల్​ ఇవ్వాలంటూ సీఐడీ అధికారులు జారీ చేసిన నోటీసును సవాల్​ చేస్తూ కౌశిక్​ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్​ ను హైకోర్టు సోమవారం కొట్టివేసింది. వివరాల్లోకి వెళితే.. గత జనవరిలో సమ్మక్క జాతరకు వెళ్తున్న క్రమంలో కరీంనగర్ జిల్లా వీణవంక వద్ద పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

నోటీసులు జారీ..

అనంతరం హుజూరాబాద్​‌కు తరలించారు. దాంతో పోలీసుల తీరుకు నిరసనగా కౌశిక్ రెడ్డి హుజూరాబాద్​‌​లో రోడ్డుపై బైఠాయించారు. కరీంనగర్ కమిషనర్​ గౌస్​ ఆలంను దూషించటంతోపాటు పోలీసు అధికారుల విధులకు ఆటంకం కలిగించారు. ఈ మేరకు అందిన ఫిర్యాదు మేరకు పాడి కౌశిక్ రెడ్డిపై వీణవంకతో పాటు హుజూరాబాద్ పోలీస్​ స్టేషన్లలో వేర్వేరుగా కేసులు నమోదయ్యాయి. ఈ రెండు కేసులను పోలీసు అధికారులు సీఐడీకి బదిలీ చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా సీఐడీ అధికారులు వాయిస్ శాంపిల్స్ ఇవ్వాలని పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను సవాల్ చేస్తూ కరీంనగర్ కోర్టులో కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.

రాజకీయ కక్షల కారణంగా..

Advertisement

విచారణ నిర్వహించిన కరీంనగర్ కోర్టు వాయిస్ శాంపిల్స్ ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ కక్షల కారణంగా నమోదైన కేసులో భాగంగా సీఐడీ అధికారులు వేధిస్తున్నారని కౌశిక్ రెడ్డి తరఫు న్యాయవాది వాదించారు. అయితే, సీపీ దూషించిన క్రమంలో సీఐడీ అధికారులు దర్యాప్తులో భాగంగా చట్ట ప్రకారం వాయిస్ శాంపిల్స్ సేకరిస్తున్నారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్ రావు కోర్టులో వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు కొన్నిరోజుల క్రితం తీర్పును రిజర్వు చేసింది. తాజాగా కరీంనగర్ కోర్టు ఉత్తర్వులను సమర్థిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాడి కౌశిక్ రెడ్డి తన వాయిస్ శాంపిల్స్​ ను సీఐడీ అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది.

Also read: ఏపీలో ఘోర ప్రమాదం.. విద్యార్థులపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్!

Tags

Related News

టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గుండు వాణి పై ఏసీబీ పంజా.. అక్రమాస్తులు చూస్తే మీ మైండ్ బ్లాకే?

ఇటలీ నేత జియాకోమో ఫిలిబెక్ పై.. రాంచందర్ రావు ఫైర్!

తెలంగాణలో 7 లక్షల పేద కుటుంబాలకు భారీ శుభవార్త!

నిధులు ఎక్కడ రేవంత్ రెడ్డి గారూ? సిద్దిపేట అభివృద్ధిపై హరీశ్‌రావు ఘాటు లేఖ!

చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో తగలబడ్డ బోగీలు.. ఏం జరిగిందంటే?

మైనర్‌ కుమార్తె పై తండ్రి అసభ్య ప్రవర్తన.. పోక్సో కేసు నమోదు!

గ్రైండర్ డేటింగ్ యాప్.. పక్కా ప్లాన్‌తో దోపిడీ ముఠాను పట్టుకున్న పోలీసులు!

Big Stories

Advertisement
×