E-Paper
Advertisement

Heavy Rush: సొంతూళ్లకు పయనమైన జనం.. కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు.. హైవే పై ఫుల్ ట్రాఫిక్!

Heavy Rush: సొంతూళ్లకు పయనమైన జనం.. కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు.. హైవే పై ఫుల్ ట్రాఫిక్!
Advertisement

Heavy Rush: సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్ నగరం ఖాళీ అవుతోంది. లక్షలాది మంది నగరవాసులు తమ సొంతూళ్లకు పయనమవడంతో ప్రధాన రహదారులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు జనసంద్రంగా మారాయి. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణికుల రద్దీ రికార్డు స్థాయిలో కొనసాగుతోంది. రాత్రి, ఉదయం అనే తేడా లేకుండా ట్రాఫిక్‌ జామ్‌ కొనసాగుతోంది. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. పెద్ద కాపర్తి నుంచి వెలిమినేడు వరకు సుమారు 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం కావడంతో పాటు వరుస సెలవులు తోడవడంతో, నిన్నటి కంటే ఈరోజు రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

టోల్ ప్లాజా వద్ద ప్రత్యేక ఏర్పాట్లు
వాహనాల రద్దీని త్వరితగతిన క్లియర్ చేసేందుకు పంతంగి టోల్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 16 టోల్ బూతుల్లో 11 బూతులను కేవలం విజయవాడ వైపు వెళ్లే వాహనాల కోసమే కేటాయించారు. ప్రస్తుతం నిమిషానికి సగటున 47 వాహనాలు టోల్ దాటుతున్నాయి. ఇప్పటివరకు సుమారు 1,30,000 వాహనాలు ఈ మార్గం గుండా వెళ్ళినట్లు సమాచారం. పరిస్థితిని పర్యవేక్షించేందుకు టోల్ సిబ్బందితో పాటు పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు.

Advertisement

ప్రత్యామ్నాయ మార్గాలు
హైవేపై ట్రాఫిక్ భారాన్ని తగ్గించేందుకు పోలీసులు ప్రయాణికులకు కీలక సూచనలు చేశారు. విజయవాడ వైపు వెళ్లేవారు రద్దీని బట్టి భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకోవాలని సూచించారు. అలాగే గుంటూరు, ఒంగోలు వైపు ప్రయాణించే వారు సాగర్ హైవే (నాగార్జున సాగర్ రోడ్డు) మీదుగా వెళ్లడం ఉత్తమమని తెలిపారు. ఎల్బీ నగర్, చౌటుప్పల్ వంటి కీలక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నారు.

కిటకిటలాడుతున్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు
నగరంలోని MGBS, JBS బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఎల్బీ నగర్, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్, తార్నాక వంటి ప్రధాన కూడళ్ల వద్ద పండుగ సందడి నెలకొంది. రైల్వే స్టేషన్లు కూడా జనంతో పోటెత్తాయి. ఇప్పటికే నగరవాసుల్లో దాదాపు 70 శాతం మంది తమ గ్రామాలకు చేరుకున్నారని అంచనా. మిగిలిన వారు కూడా ఈరోజు ప్రయాణాలు పెట్టుకోవడంతో రవాణా వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడుతోంది.

Advertisement

అదనపు బస్సులు
ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా ఆర్టీసీ అధికారులు భారీ ఎత్తున అదనపు బస్సులను నడుపుతున్నారు. ఇప్పటికే ప్రకటించిన 8,432 ప్రత్యేక బస్సులకు తోడు, రద్దీ దృష్ట్యా తాజాగా మరో 550 అదనపు బస్సులను అందుబాటులోకి తెచ్చారు. విజయవాడ బస్టాండ్‌లో కూడా ప్లాట్‌ఫారాలన్నీ ప్రయాణికులతో నిండిపోవడంతో, అక్కడ ఎప్పటికప్పుడు బస్సుల రాకపోకలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

Also Read: అమెరికాలో కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి, పలువురికి గాయాలు

ప్రైవేట్ ట్రావెల్స్ జోరు – భద్రతపై నిఘా
ప్రభుత్వ రవాణా సంస్థలతో పాటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు కూడా విపరీతమైన డిమాండ్ పెరిగింది. ప్రయాణికుల అవసరాలను ఆసరాగా చేసుకుని కొన్ని ప్రైవేట్ సంస్థలు అధిక ధరలు వసూలు చేయకుండా రవాణా శాఖ నిఘా పెట్టింది. అలాగే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, దొంగతనాలు జరగకుండా బస్టాండ్లు, హైవేల వెంబడి పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Related News

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

Big Stories

Advertisement
×