E-Paper
Advertisement

Hyderabad News: చేప చర్మంతో కుక్కకు సర్జరీ.. పశువైద్యంలో మైలురాయి, హైదరాబాద్‌ డాక్టర్ల ఘనత

Hyderabad News: చేప చర్మంతో కుక్కకు సర్జరీ.. పశువైద్యంలో మైలురాయి, హైదరాబాద్‌ డాక్టర్ల ఘనత
Advertisement

Hyderabad News: పశు వైద్య రంగంలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతమైంది. ఈ ఘనతకు హైదరాబాద్ నగరం వేదికైంది. ఇన్‌ఫెక్షన్ వల్ల చర్మం కోల్పోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ కుక్కకు పెట్స్ కేర్ ఆసుపత్రి వైద్యులు చేప చర్మంతో అంటుకట్టి దానికి పునర్జన్మ ప్రసాదించారు. ఇంతకీ ఎక్కడ, ఏంటి?

హైదరాబాద్‌ పశువైద్యుల ఘనత

Advertisement

హైదరాబాద్ నుంచి బోడుప్పల్‌కు చెందిన రాఘువ అనే వ్యక్తి తన పెంపుడు కుక్క చర్మ వ్యాధి బారిన పడింది. అక్టోబర్‌లో కుక్కకు కాలిన గాయాలు అయ్యాయి. అప్పటికే దాని శరీరం దాదాపుగా 50 శాతం చర్మం డ్యామేజ్ అయ్యింది. చివరకు శునకం పరిస్థితి విషమంగా మారింది.

Advertisement

ఓ వ్యక్తి ఇచ్చిన సలహా మేరకు జూబ్లీహిల్స్‌లోని పెట్స్ కేర్ ఆసుపత్రిని ఆశ్రయించాడు సదరు వ్యక్తి. సాధారణ పద్ధతుల్లో చికిత్స చేయడం కష్టమని భావించారు పశువైద్యులు. అందుకోసం అత్యాధునిక రీజెనరేటివ్ పద్దతిని ఉపయోగించారు. ప్రాసెస్ చేసిన చేప చర్మాన్ని.. శునకానికి ఇన్‌ఫెక్షన్ సోకిన భాగంలో గ్రాఫ్టింగ్ చేయడం అన్నమాట. 

చేప చర్మంతో కుక్కకు సర్జరీ

ప్రాసెస్ చేసిన చేప చర్మాన్ని కుక్క గాయపడిన ప్రాంతంలో అంటుకట్టే పద్దతితో సర్జరీ చేసి అమర్చారు వైద్యులు. చేప శరీరం.. ఇన్ఫెక్షన్‌ తగ్గించి శునకం నొప్పిని నివారించింది. దీనివల్ల కణజాల పునరుత్పత్తికి దోహదపడింది. దీనికితోడు కొల్లాజెన్, ఒమేగా కొవ్వు ఆమ్లాలు బయో యాక్టివ్ సమ్మేళనాలతో ఉన్న చేప చర్మం తాత్కాలిక చర్మ ప్రత్యామ్నాయంగా ఉపయోగించారు.

ప్రస్తుతం శునకం పూర్తి ఆరోగ్యంగా ఉందని, చర్మం సాదారణంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దీనిపై డాక్టర్ వెంకట్ మాట్లాడారు. తెలంగాణలో ఈ తరహా ఆపరేషన్ చేయడం ఇదే తొలిసారని తెలిపారు. చర్మ మార్పిడి చేప చర్మంతో చేస్తే ఎంతో ప్రభావవంతంగా ఉంటుందన్నారు.

ALSO READ:  సంక్రాంతి నేపథ్యంలో సొంతూళ్లకు ప్రజలు.. కిక్కిరిసిన రైల్వే, బస్ స్టాండ్లు

గాయాలు త్వరగా మానడానికి చేప చర్మం అవసరమైన పోషకాలను అందిస్తాయని తెలిపారు. దీనివల్ల జంతువులకు నొప్పి తగ్గడమేకాదు, కవచంలా పని చేస్తుందన్నారు. బ్యాక్టీరియా లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడం ద్వారా ఇన్‌ఫెక్షన్ వ్యాప్తించకుండా అరికడుతుందన్నారు.

కాలిన గాయాలు లేకుంటే చర్మ వ్యాధులున్న మనుషులపై ఇలాంటి ప్రయోగాలు జరుగుతుంటాయని అంటున్నారు కొందరు వైద్యులు. పశు వైద్యంలో ఇదొక విప్లవాత్మక మార్పుగా చెబుతున్నారు. భవిష్యత్తులో మూగజీవాలకు ఎదురయ్యే క్లిష్టమైన చర్మ సమస్యలకు తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలను ఇవ్వవచ్చని వైద్య నిపుణుల మాట.

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×