BigTV English

Asifnagar Crime: దారుణం.. రెండో భార్య సూసైడ్.. వీడియో తీసిన భర్త

Asifnagar Crime: దారుణం.. రెండో భార్య సూసైడ్.. వీడియో తీసిన భర్త

Asifnagar Crime: అతనికి ముందుగానే పెళ్లి అయింది. అయినా సరే మరో యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లు వారి జీవితం బాగానే సాగింది. కొంతకాలంగా మద్యానికి బానిసైన అతను తరచూ రెండో భార్యను వేధించేవాడు. ఆ వేధింపులు తట్టుకోలేని భార్య ఉరి వేసుకుంటుంటే ఆపాల్సింది పోయి.. ఆమె ఆత్మహత్యను వీడియో తీశాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ ఆసిఫ్‌నగర్ పరిధిలో చోటుచేసుకుంది.


ఆసిఫ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి సయ్యద్‌ అలీగూడకు చెందిన షేక్‌ రసూల్‌కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యకు నలుగురు సంతానం ఉన్నారు. అలాగే నాలుగేళ్ల క్రితం అర్షాబేగంను ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు. రసూల్ కార్పెంటర్‌గా పనిచేస్తూ 2 కుటుంబాలనూ పోషిస్తున్నాడు. కొన్నాళ్ల పాటు బాగానే సాగింది వారి జీవింతం. అయితే రసూల్ కొంతకాలంగా మద్యానికి బానిసై తరచూ రెండో భార్యను శారీరకంగా, మానసికంగా వేధించేవాడని స్థానికులు చెబుతున్నారు.

ఇంట్లో డబ్బులు ఇవ్వకపోవడం, పిల్లలు పస్తులుండాల్సిన పరిస్థితుల్లో వారి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ నెల 11న కూడా రసూల్ అర్ధరాత్రి తాగొచ్చి అర్షాబేగం దగ్గరకు వెళ్లాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. మద్యం మానేయకపోతే చస్తానని అర్హాభేగం బెదిరించింది. అప్పటికే ఫుల్‌గా తాగేసున్న రసూల్‌.. నువ్వు చస్తే, పెద్ద భార్య దగ్గరకెళతానంటూ ఎగతాళిగా ప్రవర్తించాడు. ఆమె చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకునేప్పుడు కూడా ఆపే ప్రయత్నం చేయకుండా.. నవ్వుతూ సెల్‌ఫోన్‌తో వీడియో తీశాడు. ఆమె చనిపోయినట్లు నిర్ధారించుకున్నాక బావమరిదికి ఫోన్‌ చేసి అర్షాబేగం ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. మృతురాలి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రసూల్‌ను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు.


Tags

Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×