BigTV English

Rana Birthday Special : రాక్షస రాజుగా బల్లాలదేవుడి .. అదిరిపోతున్న కట్ అవుట్ తో పోస్టర్ రిలీజ్..

Rana Birthday Special : రాక్షస రాజుగా బల్లాలదేవుడి .. అదిరిపోతున్న కట్ అవుట్ తో పోస్టర్ రిలీజ్..
Rana Daggubati

Rana Birthday Special : టాలీవుడ్లో విలక్షణమైన నటనకు పెట్టింది పేరుగా .. ఎటువంటి పాత్రలోనైనా నటించగలడు అని గుర్తింపు తెచ్చుకున్న నటుడు రానా దగ్గుబాటి. బాహుబలిలో బల్లాలదేవుడిగా వరల్డ్ ఫేమస్ అయిన రానా మంచి విలన్ క్యారెక్టర్లలో కూడా నటించగలరు అని నిరూపించుకున్నాడు. మరోపక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటూ.. ఇటు బుల్లితెరపై వెబ్ సిరీస్ తో సందడి చేస్తూ దూసుకుపోతున్న ఈ హీరో నుంచి మరొక మూవీ అనౌన్స్మెంట్ కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు.


ఈరోజు రానా పుట్టినరోజు సందర్భంగా సరికొత్త మూవీ గురించి మంచి అప్డేట్ ప్రేక్షకులకు బర్త్ డే ట్రీట్ గా ఇచ్చారు. నేనే రాజు నేనే మంత్రి లాంటి సూపర్ డూపర్ హిట్ అందించిన డైరెక్టర్ తేజ తో మరొకసారి రానా వర్క్ చేయబోతున్నాడు. ఈ ఇద్దరి కాంబోలో రాబోతున్న మూవీ కి సంబంధించి ఒక మాసివ్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. గన్ పట్టుకొని ..వైల్డ్ లుక్ తో.. ఆరడుగుల భారీ కట్ ఔట్ తో రానా ఈ పోస్టర్ లో చాలా డైనమిక్ గా ఉన్నాడు. పోస్టర్లో సినిమా పేరు రాక్షస రాజు అని ప్రకటించారు.

గురువారం రానా పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ రాక్షస రాజు చిత్ర బృందం..ఈ పోస్టర్ని విడుదల చేశారు. ఈ మూవీ రెండు భాగాలలో విడుదల అవుతుంది అని సినీ నగర్ లో టాక్. రానా తో సినిమా చేయబోతున్నట్లు తేజ ప్రకటించి చాలా కాలమే అయింది. ఆ తర్వాత హీరో డైరెక్టర్ ఇద్దరి దగ్గర నుంచి ఎటువంటి స్పష్టత లేకపోవడంతో ఇక ఈ మూవీ ఉండదని అందరూ అంటున్నారు. ఇన్ని రోజులకి మూవీ నుంచి అధికారిక ప్రకటన విడుదల కావడం రానా అభిమానులకు ఆనందంగా ఉంది.


విరాటపర్వం మూవీ తర్వాత రానా నుంచి మరొక సినిమా వచ్చింది లేదు .అయితే మధ్య గ్యాప్ లో అతను కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్ పోషించగా రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో కూడా నటించాడు. ప్రస్తుతం తేజ సినిమాతో పాటు మరొక సినిమాకులో కూడా రానా చేయబోతున్నట్లు టాక్. ఇక ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియాల్సి ఉంది. లాస్ట్ ఇయర్ మొత్తం సైలెంట్ గా ఉన్న రానా మొత్తానికి ఈ సంవత్సరమైనా మంచి సినిమాలతో సందడి చేస్తాడేమో అని అభిమానులు ఆశిస్తున్నారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×