E-Paper
Advertisement

హుజూరాబాద్‌లో అట్టర్ ప్లాఫ్ షో.. నీరు గారిన ప్రభుత్వ కార్యక్రమం!

హుజూరాబాద్‌లో అట్టర్ ప్లాఫ్ షో.. నీరు గారిన ప్రభుత్వ కార్యక్రమం!
Advertisement

Praja Palana: స్వేచ్ఛ బ్యూరో: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం హుజూరాబాద్ నియోజకవర్గంలో అధికారుల బాధ్యతారాహిత్యం వల్ల నవ్వులపాలవుతోంది. విద్యా వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో ఈ నెల 11 నుంచి 17 వరకు నిర్వహిస్తున్న ‘విద్యా వారోత్సవాల’ సన్నాహక సదస్సు బుధవారం అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. ఉదయం 10 గంటలకే ప్రారంభం కావాల్సిన ఈ సమావేశం.. అధికారుల జాడ లేకపోవడంతో మధ్యాహ్నం 12:30 గంటల వరకు కూడా మొదలు కాలేదు. రెండున్నర గంటల పాటు వేచి చూసినా కీలక అధికారులు, ప్రజాప్రతినిధులు రాకపోవడంతో సదస్సు ఉద్దేశం పూర్తిగా నీరుగారిపోయింది.

పట్టించుకోని అధికార యంత్రాంగం..

నియోజకవర్గ స్థాయి అభివృద్ధిని సమీక్షించాల్సిన ఈ కీలక భేటీకి హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లంతకుంట, వీణవంక మండలాలకు చెందిన తహసీల్దార్లు (ఎంఆర్‌ఓలు), ఎంపీడీఓలు మూకుమ్మడిగా డుమ్మా కొట్టడం గమనార్హం. అధికారులు రారు.. కార్యక్రమం మొదలవ్వదు అన్న చందంగా సాగిన ఈ సదస్సులో సమన్వయం పూర్తిగా కరువైంది. కనీసం మండల స్థాయి పర్యవేక్షకులు కూడా రాకపోవడంతో విద్యాశాఖ అధికారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పాలనా యంత్రాంగాన్ని ముందుండి నడిపించాల్సిన ఆర్డీఓ సైతం ఈ సమావేశానికి గైర్హాజరు కావడంతో, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను అధికారులు బేఖాతరు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Also Read: ఇంటిపైన నీటి కుండలు.. తర్వాత జరిగే అద్భుతం తెలిస్తే.. ఆశ్చర్యపోవడం పక్కా!

వెలవెలబోయిన సభా ప్రాంగణం..

అధికారులే కాదు, ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు కూడా ఈ సదస్సుపై ఆసక్తి చూపలేదు. జమ్మికుంట మున్సిపల్ ఛైర్మన్‌తో పాటు కమిషనర్లు, మెజారిటీ కౌన్సిలర్లు మరియు సర్పంచ్‌లు రాకపోవడంతో సదస్సు హాల్‌లోని కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. 10 గంటలకు రావాల్సిన వారు 12 దాటినా రాకపోవడంతో, ఉన్న కొద్దిమందితోనే మొక్కుబడిగా కార్యక్రమాన్ని ముగించాల్సి వచ్చింది. విద్యా ప్రమాణాలను మెరుగుపరచాల్సిన కీలక తరుణంలో ఇలాంటి ఉదాసీనత ప్రదర్శించడంపై నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి, ప్రభుత్వ లక్ష్యాలకు గండి కొట్టిన వారిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Also Read: సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ రెడీ.. ప్రారంభానికి డేట్ ఫిక్స్..!

Related News

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల.. చివరి తేది..?

రాజ్యాంగానికి తీవ్ర ముప్పు..13 కోట్ల ఓట్లు మాయం.. కేంద్రంపై విరుచుకుపడ్డ మధుయాష్కి!

‘కేసీఆర్ ఫామ్ హౌస్ నీళ్లను రైతులకు ఇస్తాం’.. ఎంపీ చామల సంచలన హామీ!

అనిరుధ్ – కావ్యా మారన్ పెళ్లి రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం!

Big Stories

Advertisement
×