E-Paper
Advertisement

Nampally Numaish 2026: నుమాయిష్‌లో ‘ధరల’ మంట.. సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న ఎగ్జిబిషన్ రేట్లు!

Nampally Numaish 2026: నుమాయిష్‌లో ‘ధరల’ మంట.. సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న ఎగ్జిబిషన్ రేట్లు!
Advertisement

చారిత్రాత్మక నాంపల్లి నుమాయిష్ అంటేనే ఒక ఉత్సవం, మధ్యతరగతి ప్రజల సరదా. కానీ ఈ ఏడాది నుమాయిష్ సందర్శకులకు చుక్కలు చూపిస్తోంది. లోపలికి అడుగు పెట్టిన దగ్గరి నుండి బయటకు వచ్చే వరకు ప్రతి వస్తువు ధర ఆకాశాన్ని అంటుతోంది. తినే తిండి దగ్గరి నుండి కొనే బట్టల వరకు అన్నీ ప్రీమియం రేట్లలో అమ్ముతుండటంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

ఏది ముట్టుకున్నా వెయ్యి పైనే..

ఎగ్జిబిషన్ అంటే రకరకాల వస్తువులు తక్కువ ధరకు దొరుకుతాయని ఆశించి వచ్చే సందర్శకులకు ఈసారి నిరాశే ఎదురవుతోంది. బయట మార్కెట్‌తో పోల్చుకుంటే ఇక్కడ ధరలు రెట్టింపు ఉన్నాయని కొనుగోలుదారులు వాపోతున్నారు. సాధారణ గృహోపకరణాలు లేదా దుస్తులు ఏది కొనాలన్నా కనీసం వెయ్యి రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. ‘బయట దొరికే వస్తువులకే ఇక్కడ బ్రాండెడ్ రేట్లు వసూలు చేస్తున్నారు’ అని ఒక సందర్శకుడు తన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్లేట్ మిర్చి బజ్జీ వంద రూపాయలా?

Advertisement

నుమాయిష్‌కి వెళ్లే వారు అక్కడ దొరికే స్ట్రీట్ ఫుడ్‌ను ఎంతో ఇష్టంగా తింటారు. అయితే ఈసారి తిండి పదార్థాల ధరలు చూసి జనం నోరెళ్లబెడుతున్నారు. బయట సుమారు 30 నుండి 40 రూపాయలకు లభించే ఒక ప్లేట్ మిర్చి బజ్జీని ఇక్కడ ఏకంగా 100 రూపాయలకు విక్రయిస్తున్నారు. అంటే బయట మూడు ప్లేట్లు కొనే డబ్బుతో ఇక్కడ కేవలం ఒక్క ప్లేట్ మాత్రమే వస్తోంది. మిర్చి బజ్జీయే కాదు, చాయ్ నుండి బిర్యానీ వరకు ప్రతి ఐటమ్ ధరలు సాధారణ స్థాయి కంటే రెండు మూడు రెట్లు ఎక్కువగా ఉండటంతో ఏదైనా తినాలంటే సామాన్యుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గత ఏడాదితో పోలిస్తే భారీ పెరుగుదల

గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి ధరలలో స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది. స్టాల్స్ అద్దెలు పెరగడం వల్లే ధరలు పెంచామని వ్యాపారులు చెబుతున్నప్పటికీ, అది సందర్శకుల జేబులకు చిల్లు పెడుతోంది. పిల్లలతో కలిసి ఎగ్జిబిషన్ చూసి రావాలంటే కనీసం 3000 నుండి 5000 రూపాయలు ఖర్చవుతోందని మధ్యతరగతి కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వినోదం కోసం వచ్చి, ధరల భారం మోస్తూ వెనుతిరగాల్సి వస్తోందని పబ్లిక్ వాపోతున్నారు.

Advertisement

ALSO READ: West Godavari: సంక్రాంతి బరుల్లో కాసుల వర్షం.. రూ.లక్ష, 2లక్షలు కాదు.. రూ.1.53 కోట్లు గెలుచుకున్న పందెంరాయుడు!

Related News

అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు.. జనగామ జిల్లా అభివృద్ధి పనులకు ఎంపీ చామల శంకుస్థాపన!

హైదరాబాద్‌కు ‘సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్’.. గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభం.. మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణ అభివృద్ధికి ‘కేంద్ర’ సాయం.. నిర్మలా సీతారామన్‌తో భట్టి కీలక భేటీ!

శాంతిభద్రతలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష.. పోలీస్ బాసులకు దిశా నిర్దేశం!

ఘోస్ట్ సిమ్‌ల గుండెల్లో ‘ఆక్టోపస్’.. 18 ప్రత్యేక బృందాలు.. 66 మంది అరెస్ట్!

మద్యం ప్రియులకు షాక్​.. త్వరలో పెరగనున్న ధరలు.. సిఫార్సు చేసిన కమిటీ!

ఫ్యూచర్ సిటీ ప్లాన్ అదిరింది.. అంతర్జాతీయ స్థాయిలో డిజైన్స్.. సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు!

బీఆర్ఎస్‌కు మంత్రి బండి సంజయ్ కౌంటర్.. రాజీనామా డిమాండ్ అసలు కథ, కొడుకు కేసు గురించి

Big Stories

Advertisement
×