E-Paper
Advertisement

Collector Harichandana: ఎస్సీల ఆర్థికాభివృద్ధికి కొత్త పథకం.. టూ వీలర్, త్రీ వీలర్ దరఖాస్తులు ఆహ్వానం

Collector Harichandana: ఎస్సీల ఆర్థికాభివృద్ధికి కొత్త పథకం.. టూ వీలర్, త్రీ వీలర్ దరఖాస్తులు ఆహ్వానం
Advertisement

Collector Harichandana: హైదరాబాద్ జిల్లా పరిధిలో ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26 ను విడుదల చేసినట్లు, అర్హులైన అభ్యర్థులు రుణాలపై దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యాక్షన్ ప్లాన్ లో బ్యాంకు అనుసంధానంతో ఆర్థిక సహాయం రూ. లక్ష విలువైన టూ వీలర్ పై 90 శాతం సబ్సిడీ, రూ. 3 లక్షల విలువైన త్రి వీలర్ వాహనాలపై 70 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు కలెక్టర్ హరిచందన తెలిపారు.

21 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు

హైదరాబాద్ జిల్లాలోని అన్ని మండలాలలోని షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులు, వయస్సు 21 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు ఆన్లైన్ లో ఈ నెల 17 నుండి 24 వరకు తమ దరఖాస్తులను సమర్పించుకోవాలని ఆమె సూచించారు. అభ్యర్థుల సంవత్సర ఆదాయం రూ. రెండు లక్షలు మించకుండా ఉండాలని, అభ్యర్థులు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డ్, రేషన్ కార్డు, ఫుడ్ సెక్యూరిటీ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్, దివ్యాంగులకు సదరమ్ సర్టిఫికెట్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు తప్పనిసరని కలెక్టర్ సూచించారు.

రూ.4 కోట్ల 58 లక్షల రాయితీ

Advertisement

ఈ ద్విచక్ర వాహనాల కోసం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గిగ్ కార్మికులకు ప్రాధాన్యతనివ్వనున్నట్లు తెలిపారు. జోమాటో, స్విగ్గి, రాపిడో, ఉబేర్ వంటివి క్లెయిమ్ చేయటానికి సంబంధింత సర్టిఫికెట్ సమర్పించాలని కలెక్టర్ వివరించారు. ఈ పథకాల కింద మొత్తం 540 లబ్దిదారులకు, సుమారు రూ.4 కోట్ల 58 లక్షల రాయితీ కేటాయించడం జరిగిందని తెలిపారు. టూ వీలర్ కోసం 270 మంది లబ్దిదారులు, త్రీ వీలర్ కోసం 153 మంది లబ్దిదారులను ఎంపిక చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

Also Read: LPG Cylinder Booking: అర్రెర్రెరే.. చాట్ జీపీటీని దాటేసిన ఎల్పీజీ బుకింగ్ యాప్, దేశంలో ఏ జరుగుతోంది..?

Related News

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Hyderabad: పైరవీలకు చెక్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, ముఖ్యనేతలకు కీలక సూచనలు

వారెవ్వా గోల్కొండ! భక్తులతో కిక్కిరిసిన కోట.. అధికారుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?

Big Stories

Advertisement
×