BigTV English
Advertisement

Hyderabad: నర్సుతో ఎఫైర్.. అప్పు తీసుకుని, తల నరికి, బాడీని ముక్కలు చేసి, ఫ్రిడ్జ్‌లో దాచి..

Hyderabad: నర్సుతో ఎఫైర్.. అప్పు తీసుకుని, తల నరికి, బాడీని ముక్కలు చేసి, ఫ్రిడ్జ్‌లో దాచి..
Hyderabad nurse head cut

Hyderabad: వాడో ఉన్మాది. కిరాతకుడు. ఇటీవల ఢిల్లీలో జరిగిన సంచలన ఘటనను ఫాలో అయ్యాడు. నర్సును చంపేశాడు. తల వేరు చేసి మూసీ నదిలో పడేశాడు. బాడీని ముక్కలు ముక్కలు చేసి ఇంట్లోని ఫ్రిడ్జిలో దాచేశాడు. వాసన రాకుండా కెమికల్స్ కలిపాడు. ఇదంతా ఎందుకు చేశాడంటే…


గత వారం హైదరాబాద్ మలక్‌పేట దగ్గర మూసీ నది సమీపంలో ప్లాస్టిక్ కవర్లో ఓ మహిళ తల కనిపించడం కలకలం రేపింది. కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు.. ఆ తల కేర్ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేసే ఎర్రం అనురాధ(55)గా గుర్తించారు. నిందితుడు చంద్రమోహన్‌ను అరెస్ట్ చేశారు.

పదేళ్ల క్రితం చంద్రమోహన్ తండ్రికి హాస్పిటల్‌లో హార్ట్ సర్జరీ జరిగింది. అప్పుడే అక్కడ పని చేసే నర్సు అనురాధను లైన్లో పెట్టాడు. రెండేళ్ల క్రితం తన ఇంట్లోనే ఓ గదిని అద్దెకిచ్చి ఆమెను అక్కడ సెటప్ చేశాడు. అయితే, స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టే అలవాటు ఉన్న చంద్రమోహన్.. అనురాధ నుంచి అప్పుగా 7 లక్షలు తీసుకున్నాడు. అవి కూడా ట్రేడింగ్‌లో నష్టపోయాడు. ఫుల్‌గా అప్పుల పాలయ్యాడు. ఇచ్చిన అప్పు తీర్చమంటూ అనురాధ నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో ఆమెను లేపేయాలని ప్లాన్ చేశాడు చంద్రమోహన్.


మే 12న వాళ్లిద్దరికీ పెద్ద గొడవ జరిగింది. అనురాధను చంపేశాడు. ఆ తర్వాత కత్తి, టైల్స్ కట్టర్ కొనుక్కొచ్చి శరీర భాగాలను వేరు చేశాడు. తలను ఆటోలో తీసుకెళ్లి మూసీ పక్కన పడేశాడు. యూట్యూబ్‌లో సెర్చ్ చేసి.. మిగిలిన శరీర భాగాలను ఫ్రిజ్‌లో, బకెట్‌లో దాచి పెట్టి వాటిపై కెమికల్స్ చల్లాడు. ఒక్కో పార్ట్‌ను ఒక్కో చోట పడేయాలనేది అతని ప్లాన్.

ఈలోగా అనురాధ చనిపోయిన విషయం ఎవరికీ తెలీకుండా ఆమె ఫోన్‌ నుంచి తెలిసిన వాళ్లకు మెసేజ్‌లు పెట్టాడు. ఆస్ట్రేలియాలో ఉండే అనురాధ కూతురుకు.. తాను చార్‌ధామ్ వెళ్తున్నానని.. కొన్నిరోజుల పాటు సెల్ పని చేయదని మెసేజ్ చేశాడు. ఇక తనను ఎవరూ పట్టుకోలేరని భావించాడు. కానీ, అసలే హైదరాబాద్ పోలీసులు. ఎంతటి కిలాడీనైనా పట్టేసుకునే ట్రాక్ రికార్డ్ వారిది.

మలక్‌పేట్ మూసీ ఒడ్డిన తల దొరకగానే.. ముందుగా మిస్సింగ్ కేసులేమైనా ఉన్నాయా చూశారు. లేవని తేలింది. తల దొరికిన సమీప ప్రాంతంలో సీసీకెమెరాలన్నీ చెక్ చేశారు. రోజుల తరబడి, గంటల కొద్దీ ఫూటేజీని నిశితంగా పరిశీలించారు. ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తి కనిపించాడు. టెక్నికల్‌ టీమ్‌ సాయంతో చంద్రమోహన్‌ ఉండే ప్రాంతాన్ని గుర్తించారు. అతని ఇంటిపై రైడ్ చేస్తే.. డెడ్ బాడీ పార్ట్స్ దొరికాయి. చంద్రమోహన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. అలా హంతకుడు దొరికాడు.

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×