
Traffic Challan(Telangana News Updates): ట్రాఫిక్ చలాన్ల ఒత్తిడి తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బైక్‌పై ఉన్న పెండింగ్ చలాన్లు చెల్లించాలని ట్రాఫిక్ పోలీసులు ఒత్తిడి చేయడం వల్లే చనిపోయాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా హాసన్ పర్తి మండలం మల్లారెడ్డిపల్లిలో జరిగింది.
వరంగల్‌లోని ఓ బట్టల దుకాణంలో మొగిలి అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. మొగిలి రోజూ ఇంటి నుంచి స్కూటీపై వరంగల్‌కు వెళ్తుంటాడు. ఇదే క్రమంలో….ఈనెల 21న స్కూటీపై ఇంటికి వెళ్తున్న మొగిలిని.. ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. స్కూటీపై 7వేల120 రూపాయలు పెనాల్టీతో 17 చలాన్లు ఉన్నాయని చెప్పారు. తాను కూలి పనులు చేసుకుని జీవిస్తున్నాని తన వద్ద అంత డబ్బు లేదని పోలీసులకు చెప్పినట్లు కుటుంబసభ్యులు చెప్తున్నారు. అయినా వినకుండా చలాన్లు కట్టాల్సిందేనని పోలీసులు ఒత్తిడి తెచ్చారని వెల్లడించారు. స్కూటీ సీజ్ చేయడంతో ఏం చేయాలో తెలియక ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చారని చెబుతున్నారు. పోలిసుల ఒత్తిడి తట్టుకోలేకే మొగిలి పురుగుల మందు తాగేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి తరలించగా చికిత్సపొందుతూ చనిపోయినట్లు తెలిపారు.
అయితే ఎంజీఎంలో మొగిలి బంధువులను ట్రాఫిక్ ఎస్సై రామారావు పరామర్శించారు. వైద్య ఖర్చుల నిమిత్తం 3వేల రూపాయలు ఇచ్చినట్లు ఎస్సై తెలిపారు. తన డ్యూటీ తాను చేశానని.. మొగిలి సూసైడ్ చేసుకోడానికి తమ ఒత్తిడి కారణం కాదని చెప్పుకొచ్చారు. విషయం తెలిసిన వెంటనే సీజ్ చేసిన స్కూటీని మొగిలి కుటుంబ సభ్యులకు ఇచ్చినట్లు చెప్పారు. చలాన్ వ్యవహారంపై మొగిలి కుమారుడు సూర్య హసన్‌పర్తి పోలీసులకి ఫిర్యాదు చేశారు.

Revanth Reddy on KCR : పాలమూరుకు ఇచ్చిన హామీల సంగతేంటి? కేసీఆర్ కు రేవంత్ ప్రశ్నలు..