E-Paper
Advertisement

Murder Mystery: మూడు నెలలుగా కనిపించని యజమాని.. కుక్కల మలంలో దొరికినవి చూసి పోలీసులు షాక్!

Murder Mystery: మూడు నెలలుగా కనిపించని యజమాని.. కుక్కల మలంలో దొరికినవి చూసి పోలీసులు షాక్!

Owner Murder Mystery: కుక్కలు ఎంతో విశ్వాసంగా ఉంటాయి. యజమాని పట్ల ఎంతో ప్రేమను కనబరుస్తాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి అడుగు పెట్టనివ్వవు. ఒకవేళ లోపలికి వచ్చినా, అడ్డగించి అడుగు ముందుకు వేయనివ్వవు. కానీ, అవే కుక్కలు యజమానిని చంపితే? ముక్క కూడా మిగలకుండా తినేస్తే? ఊహించడానికే భయంకరంగా ఉంది కదా? అమెరికాలో జరిగిన ఓ ఘటన గురించి తెలుసుకుంటే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

టెక్సాస్ లో ఫ్రెడ్డీ మ్యాక్ అనే 57 ఏళ్ల వ్యక్తి నివసించేవాడు. కానీ, ఆయన కొద్ది రోజులు కనిపించలేదు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు మొదలు పెట్టారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆయన ఇంటికి చేరుకుంది. ఇంట్లో ఏకంగా 18 కుక్కలు ఉన్నాయి. దర్యాప్తు అధికారులను ఆ కుక్కలు ఇంట్లోకి రానివ్వలేదు. చివరికి  పోలీసులు వాటికి మత్తు మందు ఇచ్చి ఇంట్లోకి వెళ్లారు. ఇళ్లంతా వెతికారు. మ్యాక్ కనిపించలేదు. అన్ని గదులను పరిశీలించారు. ఓ గదిలో రక్తపు మరకలు ఎండిపోయి కనిపించాయి.

హత్య జరిగితే, డెడ్ బాడీ ఎక్కడ?

మ్యాక్ ఏమయ్యాడు? ఎవరైనా హత్య చేశారా? ఒకవేళ హత్య చేస్తే, ఆయన శవం ఎక్కడ? ఎవరైనా చంపి శవాన్ని తీసుకెళ్లారా? దారుణంగా కొట్టి కిడ్నాప్ చేశారు? ఒక్కొక్కరు ఒక్కో అనుమానం వ్యక్తం చేశారు. అన్ని రకాలుగా దర్యాప్తు కొనసాగించారు. కానీ, ఏం తేల్చలేకపోయారు. పోలీసులు మరోసారి ఆయన ఇంటిని జాగ్రత్తగా పరిశీలించారు. ఇంటి పెరట్లో కుక్కలు మల విసర్జన చేయడాన్ని చూశారు. ఎందుకో, ఆ మలం అబ్ నార్మల్ గా కనిపించింది. కాస్త దగ్గరకు వెళ్లి నిశితంగా పరిశీలించారు. మలంలో వెంట్రుకలు, గుడ్డ పేలికలు కనిపించాయి. ఆ మలాన్ని సేకరించి డీఎన్ఏ పరీక్షలకు పంపించారు.

డీఎన్ఏ రిపోర్టు చూసి పోలీసులు షాక్!

కొద్ది గంటల్లోనే డీఎన్ఏ రిపోర్టు వచ్చింది. నివేదికను చదివి పోలీసులు షాకయ్యారు. కుక్కల మలంలో ఉన్న వెంట్రుకలు, శరీర భాగాలు మ్యాక్ కు చెందినవేనని తేలడంతో షాకయ్యారు. కుక్కలే ఆయనను తిన్నాయని పోలీసులు తేల్చారు. అయితే, ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్కలు ఆయను ఎలా తిన్నాయి? అని అనుమానం వ్యక్తం చేశారు. ఒకవేళ మ్యాక్ చనిపోయిన తర్వాత తిని ఉండొచ్చా?లేదంటే, బతికి ఉన్నప్పుడే చంపి తిన్నాయా? మనిషిని తింటే ఎముకలను వదిలేసి ఉండాలి. కానీ, ఇక్కడ ఎముకలతో సహా పూర్తి మనిషిని తినేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మ్యాక్ ను ఎవరైనా చంపి ముక్కలు చేసి వాటిని ఆహారంగా వేశారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేశారు. కానీ, ఆ కుక్కలు ఇంట్లోకి ఎవరినీ అడుగు పెట్టించేవి కాదని చుట్టు పక్కల జనాలు చెప్పారు. ఈ నేపథ్యంలో కుక్కలే అతడిని తినేశాయని చెప్పి, కేసు క్లోజ్ చేశారు. అయితే, ఇప్పటికీ ఆయన మృతి మీద అనుమానాలు అలాగే కొనసాగుతున్నాయి.

Read Also:  ‘అక్కడ’ చింతపండు పెట్టి.. భార్యను చంపేసిన భర్త, ఎక్కడో కాదు మన రాష్ట్రంలోనే!

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×