BigTV English

Indoor Stadium : కుప్పకూలిన మొయినాబాద్ ఇండోర్ స్టేడియం.. ఇద్దరు మృతి

Indoor Stadium : కుప్పకూలిన మొయినాబాద్ ఇండోర్ స్టేడియం.. ఇద్దరు మృతి

Indoor Stadium : నాణ్యత లోపం.. ఇంజనీర్లు, కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం ఇద్దరు వలస కార్మికుల ప్రాణాలను బలి తీసుకుంది. నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం కుప్పకూలడంతో శిథిలాలకింద చిక్కుకుని ఇద్దరు మృతి చెందగా, మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం ఇండోర్ స్టేడియంలో నిన్న ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారందిరికీ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. అయితే పోలీసులు ఇప్పటివరకూ ఒక్క కాంట్రాక్టర్ పైనే కేసు నమోదు చేశారు. ఇది ఒక హై ప్రొఫైల్ కేసు కావడంతోనే పోలీసులు జోక్యం చేసుకోవట్లేదా? లేక ఈ ఘటన వెనుక పెద్దలు, ప్రముఖులు ఉన్నారనే కారణంతోనే జాప్యం చేస్తున్నారా? అసలు ఈ ఘటన ఎలా జరిగింది? అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.


రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ మండలం కనకమామిడిలో సోమవారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం కుప్పకూలింది. ఆ ఘనటలో ఇద్దరు కార్మికులు మృతి చెందినట్లు తెలిసింది. ఓ టేబుల్ టెన్నిస్ అకాడమి సంస్థకి చెందిన ఇండోర్ స్టేడియంలో కూలీలు నిర్మాణ పనులు చేస్తుండగా.. ఒక్కసారిగా స్లాబ్ కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో మెుత్తం కూలీలు 14 మంది ఉన్నట్లు తెలిసింది. ఇద్దరు కార్మికులు చనిపోగా.. మిగతా వారిని రక్షించారు. వారిలో పలువురు గాయపడగా.. ఆసుపత్రికి తరలించారు. మృతులు బిహార్‌కు చెందిన బబ్లు, వెస్ట్ బెంగాల్‌కు చెందిన సునీల్‌గా గుర్తించారు.

ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి స్థాయిలో శిథిలాలను తొలిగించిన తర్వాత మృతుల సంఖ్యపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఉదయం పనిలోకి ఎంత మంది కార్మికులు వచ్చారు. వారిలో ఎందరు సురిక్షితంగా ఉన్నరనే సమాచారాన్ని నిర్మాణ పనులు పర్యవేక్షిస్తున్న వారిని అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు కూడా తెలియాల్సి ఉంది. నిర్మాణంలో నాణ్యత లేకపోవటం కూలిందా ? లేక డిజైన్ లోపమా? అనేది విచారణ తర్వాత తేలాల్సి ఉంది.షెడ్‌ నిర్మాణం చేపట్టి ఇనుప షీట్లపై ఆర్‌సీసీ స్లాబ్‌ వేయడం వల్లే కూలిందని, షెడ్‌ డిజైనింగ్‌లో ఇంజనీర్ల నిర్లక్ష్యం ఉందని మండిపడుతున్నారు.


.

.

Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×