E-Paper
Advertisement

Shah Rukh Dunki single : షారుక్ డుంకీ ఫస్ట్ సింగిల్ .. సాలిడ్ మెలోడి గా ‘లుట్ పుట్ గయా’

Shah Rukh Dunki single : షారుక్ డుంకీ ఫస్ట్ సింగిల్ .. సాలిడ్ మెలోడి గా ‘లుట్ పుట్ గయా’
Advertisement
Shah Rukh Dunki

Shah Rukh Dunki single : బాలీవుడ్ బాద్షా.. షారుక్ ఖాన్ పఠాన్ చిత్రం నుంచి జోరు బాగా పెంచేశాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ హీరో.. క్రిస్మస్ ,న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 22న డుంకీ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్ చిత్రాలు బాలీవుడ్ లోనే కాక టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ సొంతం చేసుకున్నాయి. దీంతో ఇప్పుడు బాద్షా దృష్టి టాలీవుడ్ మీద కూడా ఉన్నట్లు టాక్.

ఈ నేపథ్యంలో తెలుగులో కూడా డుంకీ మూవీ ప్రమోషన్స్ ఫుల్ జోష్ లో జరుగుతున్నాయి. ఈ మూవీ పై భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేమిటంటే.. రేపు నవంబర్ 22న ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కాబోతోంది. ఇక ఈ మూవీ కి హిట్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణి దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Advertisement

మనసుకు హత్తుకునే సినిమాలు తీయడంలో స్పెషలిస్ట్ అయిన రాజ్‌కుమార్ హిరాణి ఈ సారి డుంకీ అంటూ సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నాడు. ఇటీవల మూవీ నుంచి విడుదలైన డంకీ డ్రాప్ 1 లో మూవీకి సంబంధించిన ప్రధాన పాత్రలను పరిచయం చేశారు. ఒక్క వీడియోలోనే ప్రేమ ,స్నేహం , బాధ , తపన, పట్టుదల ఇలా నవరసాలను పలికించాడు డైరెక్టర్. ఇంట్రో వీడియో ఇలా ఉంటే మరి మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

ఈ మూవీ నుంచి లుట్ పుట్ గయా అనే పల్లవితో సాగే మెలోడీ ఫస్ట్ సింగిల్ నవంబర్ 22న విడుదల కాబోతోంది. ఈ సాంగ్  కచ్చితంగా ఆడియెన్స్‌కు మాంచి మ్యూజిక్ ఫీస్ట్ అవుతుందని భావిస్తున్నారు. విదేశానికి వెళ్ళాలి అని కలలుకనే ఒక సామాన్య ఫ్రెండ్ గ్యాంగ్ ఆ తర్వాత తమ ఆశలు నెరవేర్చుకునే క్రమంలో ఎదుర్కొనే ఒడిదుడుకులను హైలైట్ చేస్తూ డంకీ డ్రాప్ 1 వీడియో ఎంతో అద్భుతంగా ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో విడుదల కాబోతున్న సాంగ్ పై కూడా అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. రాబోయే ఈ మెలోడీ సాంగ్.. ఒక మంచి రొమాంటిక్ సాంగ్ అయితే బాగుండు అని షారు ఫాన్స్ ఆశిస్తున్నారు. బాలీవుడ్ కింగ్ ఆఫ్ రొమాన్స్ షారుక్ ఈ సాంగ్ తో ప్రేక్షకులను ఎంతగా మెస్మరైజ్ చేస్తారో చూడాలి.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×