E-Paper
Advertisement

స్నాప్‌చాట్ పరిచయం.. ఉద్యోగం పేరుతో హోటల్‌కు పిలిచి యువతిపై లైంగిక దాడి!

స్నాప్‌చాట్ పరిచయం.. ఉద్యోగం పేరుతో హోటల్‌కు పిలిచి యువతిపై లైంగిక దాడి!
Advertisement

Hyderabad Crime: సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తులను గుడ్డిగా నమ్మితే ఎంతటి ప్రమాదంలో పడతామో చెప్పడానికి హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. ఉద్యోగం వస్తుందన్న ఆశతో వెళ్లిన ఓ యువతికి బంజారాహిల్స్‌లోని ఓ హోటల్ గదిలో ఊహించని నరకం ఎదురైంది.

అసలేం జరిగిందంటే?

Advertisement

పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువతి, ప్రస్తుతం హైదరాబాద్ అత్తాపూర్‌లోని శివనగర్ కాలనీలో ఉంటూ స్వయం ఉపాధి పొందుతోంది. ఐదు నెలల క్రితం ఆమెకు స్నాప్‌చాట్ (Snapchat) ద్వారా కార్తీక్ (32) అనే యువకుడు పరిచయమయ్యాడు. మాటల మధ్యలో ఆమెకు మంచి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. అది నిజమే అనుకున్న ఆ యువతి, అతను పిలవగానే బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌కు వెళ్లింది.

కత్తితో బెదిరించి.. నగ్న వీడియోలతో బ్లాక్‌మెయిల్!

Advertisement

మాట్లాడుకుందామని ఆమెను హోటల్ గదిలోకి తీసుకెళ్లిన కార్తీక్, తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా.. ఆ దృశ్యాలను వీడియో తీశాడు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని తనకు రూ. 5 లక్షలు ఇవ్వాలని కత్తితో బెదిరించాడు.

ర్యాపిడోలో ఫోన్ పంపిన నిందితుడు

భయంతో వణికిపోయిన ఆ యువతి, ఎలాగోలా ధైర్యం చేసి అతని చెర నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుంది. అయితే, ఆ కంగారులో ఆమె తన మొబైల్ ఫోన్‌ను హోటల్ గదిలోనే మర్చిపోయింది. ఆ తర్వాత నిందితుడు ఆ ఫోన్‌ను ఒక ర్యాపిడో రైడర్ ద్వారా ఆమె ఇంటికి పంపించడం గమనార్హం.

పోలీసుల గాలింపు

తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, హోటల్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పరారీలో ఉన్న కార్తీక్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

Also Read: మా ర్యాలీ దెబ్బకు బీజేపీలో భయం.. అందుకే కౌంటర్ ర్యాలీలు: మహేష్ కుమార్ గౌడ్

Tags

Related News

మా ర్యాలీ దెబ్బకు బీజేపీలో భయం.. అందుకే కౌంటర్ ర్యాలీలు: మహేష్ కుమార్ గౌడ్

300 మందిని చంపేస్తామంటూ బెదిరింపు మెయిల్.. కాచిగూడ స్టేషన్‌లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు!

పదవులు తీసుకుని కూర్చుంటే సరిపోదు.. పనిచేయాల్సిందే! ఫ్రంటల్ నేతలకు ఏఐసీసీ క్లాస్!

ఐవీఎఫ్ అండాల దందా వెనుక కేటీఆర్ హస్తం? బల్మూర్ వెంకట్ సంచలన వ్యాఖ్యలు!

లైక్‌లు, పబ్లిసిటీ కోసం రోడ్లపైకి రాలేదు.. దీని వెనుక అసలు లక్ష్యం ఇదే: కిషన్ రెడ్డి

కుమార్తె ప్రేమ వ్యవహారం.. ఆగ్రహాంతో రగిలిపోయిన తండ్రి, ఆదిలాబాద్ జిల్లాలో దారుణం

పౌల్ట్రీ పరిశ్రమకు గుడ్ న్యూస్.. ఫ్యూచర్ సిటీలో కీలక ప్రాజెక్టుకు సీఎం గ్రీన్ సిగ్నల్!

Big Stories

Advertisement
×