E-Paper
Advertisement

పదవులు తీసుకుని కూర్చుంటే సరిపోదు.. పనిచేయాల్సిందే! ఫ్రంటల్ నేతలకు ఏఐసీసీ క్లాస్!

పదవులు తీసుకుని కూర్చుంటే సరిపోదు.. పనిచేయాల్సిందే! ఫ్రంటల్ నేతలకు ఏఐసీసీ క్లాస్!
Advertisement

Sandeep Kumar: స్వేచ్ఛ బ్యూరో: పార్టీకి వెన్నెముకగా ఉండాల్సిన ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ పై ఏఐసీసీ ఇన్ చార్జ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో,ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అనుబంధ సంఘాలు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని ఏఐసీసీ ఇన్ చార్జ్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. తనకు పూర్తి స్థాయిలో ఫీడ్ బ్యాక్ ఉన్నదని, రిపోర్టు ఆధారంగానే తాను ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. రెండు రోజుల క్రితం జరిగిన మీటింగ్ లో ఏఐసీసీ ఇన్ చార్జ్ సందీప్ చైర్మన్లకు వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. కొన్ని ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ కమిటీలు వేసినా.. పనిచేయడం లేదని మండిపడ్డారు. మరి కొన్ని విభాగాలు అసలు కమిటీలే వేయలేదన్నారు. ఒకటి రెండు విభాగాలు మాత్రమే సీరియస్ గా పనిచేస్తున్నట్లు ఏఐసీసీ ఇన్ చార్జ్ ఈ మీటింగ్ లో వెల్లడించారు. పనితీరు మార్చుకోవాల్సిందేనని, తాను నెక్ట్స్ రివ్యూ పెట్టే సమయానికి అన్నికమిటీలు ఏర్పాటు చేయడంతో పాటు ఫర్మామెన్స్ షీట్ ను కూడా అందజేయాలని ఏఐసీసీ ఇన్ చార్జ్ నొక్కి చెప్పారు.

ఫీడ్‌బ్యాక్ రిపోర్టుతో కన్నెర్ర..?

Advertisement

పార్టీ అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా, అనుబంధ సంఘాలైన యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ , మహిళా కాంగ్రెస్, సేవాదళ్, కిసాన్ కాంగ్రెస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విభాగాల కార్యకలాపాలు కేవలం గాంధీ భవన్‌కు, పత్రికా ప్రకటనలకే పరిమితమయ్యాయన్న నివేదికలు అధిష్టానానికి చేరాయి. జిల్లాల వారీగా పూర్తిస్థాయి కమిటీలు లేకపోవడం, మండల, గ్రామ స్థాయిలో కార్యకర్తలను సమన్వయం చేయకపోవడంపై ఇన్‌చార్జ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.‘పదవులు తీసుకుని కూర్చుంటే సరిపోదు. క్షేత్రస్థాయిలో మీ ఉనికి ఎక్కడ కనిపిస్తోంది? ఇంతవరకు కమిటీల నియామకాలు ఎందుకు పూర్తి చేయలేదు? ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్లడం లేదు?’ అంటూ ఆయన గట్టిగా నిలదీసినట్లు సమాచారం. ముందుగానే తమ వద్ద ఉన్న గ్రౌండ్ లెవల్ ఫీడ్‌బ్యాక్ రిపోర్టును ముందుంచి మరీ ఆయన నిలదీయడంతో, ఏం సమాధానం చెప్పాలో తెలియక పలువురు నేతలు నీళ్లు నమిలారని తెలిసింది.

యూత్ కాంగ్రెస్ ప్రత్యేకమేమీ కాదు.. అన్నీ ఒక్కటే..

Advertisement

ఈ సమావేశంలో కొందరు నేతలు తమ విభాగాలకు ఉన్న ప్రాధాన్యతను చెప్పుకునే ప్రయత్నం చేయగా, ఏఐసీసీ కార్యదర్శి సందీప్ కుమార్ ఈకీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ కార్యకలాపాల ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన స్పందిస్తూ, ‘పార్టీలో యూత్ కాంగ్రెస్ ప్రత్యేకమేమీ కాదు.. అన్ని ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఒక్కటే’ అని తేల్చి చెప్పారు. ఏ ఒక్క విభాగానికో ప్రత్యేక మినహాయింపులు ఉండవని, ప్రతి అనుబంధ సంఘం సమాన బాధ్యతతో పనిచేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. విభాగాల మధ్య సమన్వయ లోపం ఉండకూడదని, అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే పార్టీ బలోపేతం అవుతుందని హితవు పలికారు. గ్రూపు రాజకీయాలకు, వ్యక్తిగత అజెండాలకు తావులేదని, కేవలం పనితీరు ఆధారంగానే భవిష్యత్తులో గుర్తింపు ఉంటుందని హెచ్చరించారు.

షాకైన చైర్మన్లు, అధ్యక్షులు..

ఇప్పటివరకు సాధారణ సమీక్షల మాదిరిగానే సమావేశం సాగుతుందని భావించి వచ్చిన అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు ఏఐసీసీ ఇన్‌చార్జ్, కార్యదర్శిల దూకుడు చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కేవలం మాటలు కాకుండా, ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలపై రాతపూర్వక నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు.అంతేగాక పనిచేయని వారిని మార్చడానికి అధిష్టానం వెనుకాడదన్న సంకేతాలు బలంగా వెళ్లడంతో పదవుల్లో ఉన్న నేతల్లో గుబులు మొదలైంది.మరోవైపు పనిచేసేందుకు ఆసక్తి లేని వారు కూడా నిర్మోహమాటంగా పార్టీ కి చెప్పవచ్చని, పార్టీ లైన్ లో పనిచేసే వాళ్లకే పదవులు ఇస్తామని ఏఐసీసీ ఇన్ చార్జ్ సందీప్ తేల్చేశారు. ఈ విషయం ఇప్పుడు గాంధీభవన్ లో పాటు ముఖ్యనేతల్లోనూ హాట్ టాఫిక్ గా మారింది.

Also Read: ఐవీఎఫ్ అండాల దందా వెనుక కేటీఆర్ హస్తం? బల్మూర్ వెంకట్ సంచలన వ్యాఖ్యలు!

Tags

Related News

ఐవీఎఫ్ అండాల దందా వెనుక కేటీఆర్ హస్తం? బల్మూర్ వెంకట్ సంచలన వ్యాఖ్యలు!

లైక్‌లు, పబ్లిసిటీ కోసం రోడ్లపైకి రాలేదు.. దీని వెనుక అసలు లక్ష్యం ఇదే: కిషన్ రెడ్డి

కుమార్తె ప్రేమ వ్యవహారం.. ఆగ్రహాంతో రగిలిపోయిన తండ్రి, ఆదిలాబాద్ జిల్లాలో దారుణం

పౌల్ట్రీ పరిశ్రమకు గుడ్ న్యూస్.. ఫ్యూచర్ సిటీలో కీలక ప్రాజెక్టుకు సీఎం గ్రీన్ సిగ్నల్!

పల్నాడు ప్రాజెక్టుపై మౌనం ఎందుకు?.. రేవంత్ సర్కార్‌పై హరీష్ రావు ఫైర్

ఎల్‌నినో ఎఫెక్ట్.. 15 నెలల సన్నబియ్యం బఫర్ స్టాక్‌కు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం

కూకట్‌పల్లి ట్రక్ పార్క్ వేలంలో కీలక మలుపు.. హైకోర్టు మెట్లు ఎక్కిన వివాదం!

Big Stories

Advertisement
×